Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Allari Alludu (1993)

చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, నగ్మా, మీనా
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 06.10.1993Songs List:రైక చూస్తె రాజమండ్రి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

రైక చూస్తె రాజమండ్రి
పైట చూస్తె పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది నైటు
ఇంక తెల్లవార్లు మల్లెపూల ఫైటు
అమ్మ తోడు అబ్బ తోడు గుమ్మ పాప

రైక చూస్తె రాజమండ్రి
పైట చూస్తె పాలకొల్లు

పంట చేలు పాల పిట్ట
వాల గానే ఈల వేసే
దోచేశాడే ఓలమ్మో
కంది చేను కన్నె లేడి
కాలు పెట్టేయ్ వాలు చూసి
కాజేసేది ఎట్టమ్మో
మురిపాల మూగ నవ్వు
పులకించి పూత కొస్తే
సరసాల సంకురాత్రి
తొలికోడి కూతకొస్తే
రూపాయి రుంగు బొమ్మ నీదేలే
ఎక్కుపెట్టాను ఏటవాలు చూపూ
జిక్కు జిక్కానికొచ్చి నిను రేపు
చుక్క తోడు పక్క తోడు చక్కనోడి

మాటచూస్తే మండపేట
పాట చూస్తె ఎంకి పాట

చిత్తడింట్లో సిగ్గులాగి
చిత్తు చేసే చీకటేలా
చిందేసిందే ఓలమ్మో
ఒత్తిడింట్లో ఒళ్ళు తాకి
ఒడ్డు చేరి ఈత లోన
సింగారాలే నీవయ్యో
జడలోని జాజి పూలు
ఒడిలోన బంతులాడే
గుడికాడ బావి చాటు
దొరికింది దొంగతోడే
పాపాయి పాల ఉంగ నాకేలే
పువ్వు కెవ్వంటే పక్కకెంతో ఊపో
ఒళ్ళు జివ్వంటె ఒపలేదు కైపు
అడ్డగోలు ఒంగవోలు గంగడోలు

మాటచూస్తే మండపేట
పాట చూస్తె ఎంకి పాట
ఆడి చూపులోన మోగుతుంది ఫ్లూటూ
ఆడి ఊపులోన మోట ఏరు దాటూ
అమ్మ తోడు అబ్బ తోడు గుమ్మ పాప

రైక చూస్తె రాజమండ్రి
పైట చూస్తె పాలకొల్లుకమ్మని ఒడి బొమ్మని పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం అడుగులో తాళం
నీషాలలో వేసెయ్ బాణం రసాలలో తృణం ఫనం

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే

చరణం: 1
మిడిసి పడకే తొలి సొగసు మొగలి పూరేఖా...
కస బుస కస కసిగా
పడక విడిచి విరి పడక పరుచుకున్నాగా...
పగ వగ ఇదే పదరా
చినుకు పడి చీర జారే మెరుపు మెడ హారమేసె
ఉరుము జతిలో నడుము లయలో చెలో లేలో
తడిసె నీ రూపం  తళుకులో దీపం
వయస్సులో వానేవస్తే తడి స్వరం చలి జ్వరం

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే

చరణం: 2
గుబులు గుబులు మొదలగులు పెరిగే ఒళ్ళంతా...
సడే మియా తడే పొడిగా
చిగురు పొగరు చెలి ఫిగరుకెదిగి తుళ్ళింతా...
పదే పదే అదే పనిగా
జడ తడిసి జావళీలై మెడల జడ తాళమెసే
ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో
అడిగితే అందం అధరమే బంధం
అయో మయం ఆషాడం లో
ప్రియా ప్రియం స్వయంవరం

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం అడుగులో తాళం
నీషాలలో వేసెయ్ బాణం రసాలలో తృణం ఫనంమచిలీ పట్నం మాయాబజార్ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఆ... హు హు...
కొట్టవయ్యా షోడా
మచిలీ పట్నం ఆఁ...
ఆ మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
ఆ మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా
నిటారు సోకుల గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేశా
అహ అహ అహ అహ
మరదలి పల్లి సెంటర్లోన మడత మంచం వాల్సేశా

మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా

బాబు ఫిడేలు తగులుకో నాయన తగులుకో

మా అత్త మహాదేవి మహత్యంబెట్టిదనిన
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
మా అత్తేశ్వరి జతి కనరాయ్
ధన ధాణ్యేశ్వరి కొనచీనాంబరి మా వాణిశ్రీ కృతి వినరా
టింగు రంగ నింగి విడిచిన తార నేనేరా
అహ ఒహొ అహ ఒహొ
క్రీస్తు పూర్వము నీ పురాణం మాకు తెలుసునులే
అహ ఒహొ  అత్తో దుత్తో
అంజలి దేవి నా సిస్టర్ ఏ ఎన్ ఆరే నా మిస్టర్
ప్రేమనగరే మా ఊరు ప్రేమికులకే బేజారు
బందరు కళ్ళకి మాజీ సుందరి
అహంకారమే అలంకారమట ఇస్
మంగళగిరి లో పోటీ చేసి మంత్రి గిరినే పట్టేశావ్

మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా

భాషా వాసుడు భార్య దాసుడు
మామేశ్వరుడే గద సుమతీ
ఆంధ్రుల అన్నయ్య నన్నయ గారికి
తమ్మయ నేనే కదండయా అసలు అయ్యా అది
నీవు గిరి కథ నే సిరి కధ చెప్పుకుందామా
అహ అహ అహ అహ
అమ్మ చాటున ఉమ్మలాటకి ఆశ పడదామ
అహ ఒహొ ఏహే అహ
శ్రీదేవంటే పడి చస్తా నగార్జునతో  నడిచొస్తా
ముఠామేస్త్రీనే మురిపిస్తా చంటి నెత్తుకు లాలిస్తా
చిలకలాంటి ఈ చిలిపి కన్యకి
పులకరింతలు పునికేదెవరో ష్...
బద్రగిరిలో భజనలు చేసి గోదావరిలో మునకేసేస్తా

మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా

మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా
చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా
జై అత్త మహాదేవి చరిత్రకి
గోవిందా గోవిందా హరినిన్ను రోడ్డు మీద పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

(ఈ పాటను నాగ చైతన్య నటించిన సవ్యసాచి (2018)  సినిమాలో రీమిక్స్ చేశారు)

నూనూగు మీసాల నూత్న యవ్వనమున
ఏలూరు సి.ఆర్. రెడ్డి కలశాలలో
ఓ రాణి ప్రేమ పురాణం
ఆ ముచ్చటకైన ఖర్చులూ
రోజంతా జంట షికారులు
ఊరంతా ఉత్త పుకారులు
మరపు రావు కాలేజ్  రోజులు
ఒన్స్ మోరే
మరపు రావు కాలేజ్  రోజులు

నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గయిత్తు
నేను రోమియోగ మారిన్నది లగ్గయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగ్గయిత్తు
అది బామ కాదు బాతు
నిన్ను క్లోలాసున చూసినాది లగ్గయిత్తు
నిన్ను కౌగిలింత కోరినాది లగ్గయిత్తు
నాలో పుట్టుకొచ్చె జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

కాంచనమాల - లగ్గయిత్తు లగ్గయిత్తు
సూర్య కుమారి - లగ్గయిత్తు లగ్గయిత్తు
నేను కానా నీకు లేనా
ఆ రోజుల్లల్లో మీ ఆడలల్లో
కట్ బ్లౌస్  లల్లో లైలా ఫొసుల్లో
మొహమాటాలే విడిచీ
మొగుడాటల్లో గెలిచీ
ఫ్లాట్ ఫామ్  పార్క్ తీరమో
ప్రేమ లేఖలా రాయభారమో
జన్మకు రానిది మన్మధ  సీజన్
ప్రేమ పటాలకు  అడ్రెస్స్ యు మై లవ్ 

నిన్ను క్లాసు లోన చూసినాది లగ్గయిత్తు
నిన్ను కౌగిలింత కోరినాది లగ్గయిత్తు
నాలో పుట్టుకొచ్చె జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

S D బర్మన్  - యిత్తు లగ్గాయిత్తు
ఆనందు భర్షి - .లగ్గాయిత్తు లగ్గాయిత్తు
నీది రాగం నాది భావం
ఈ కౌగిట్లో సాగే డ్యూయట్లో
సిగ్గందిట్లో జారే సందిట్లో
చలి పాటాలే చదివీ
వలపాటల్లో కరిగీ
లవ్ పరిక్షలో  ఫస్ట్ ర్యాంక్   లో
హిట్టు కొట్టనా జట్టు కట్టనా
నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల
ప్రేమ జగాలకు మంత్రము ఐ లవ్ యు

నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గయిత్తు
నేను రోమియోగ మారిన్నది లగ్గయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగ్గయిత్తు
అది బామ కాదు బక్ బక్
నిన్ను క్లాసు లోన చూసినాది లగ్గయిత్తు
నిన్ను కౌగిలింత కోరినాది లగ్గయిత్తు
నాలో పుట్టుకొచ్చె జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
ఒక్కసారే వన్సుమోరే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఏవిటిది
ఉండుమరి
హుఁ వదలమంటే
ఏయ్ కదలనంతే
ఎవరైనా చూస్తే
చూస్తే చూడని
తాళాలేవి
ఇస్తా దేవి
చాంగుభళా
యంగ్ మజా
కొంగు సఖా
డంగు డమా, లింకు లిమా
పిల్లా పింగాణీ మోతా...

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే
రతి సుఖసారే మతి చెడిపోయే
సతి ముఖమెంత వాడిపోయే
ఎవరికి వారే యమున విహారే
కలిసిన వయసులు పదహారే - వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే

ఊఁ  ఊఁ ఊఁ ఉ ఉ - ఊ హుఁ
ఊఁ  ఊఁ ఊఁ ఊహు - ఏయ్
ఊ ఊ - ఆఁ
ఊ ఊ - అమ్మా...
ఊ హు - ఆఁ
ఊ హు - ఆఁ
ఆ ఆ ఆ ఆ - ఓమ్మో...

మరదలంటే నువ్వేనే తిరగలి బుల్లో
వరద లాగా పొంగనివ్వు వయసే ఒళ్ళో
నక్క ఒకటి గోతి కాడ ఉన్నది బాబు
దాన్ని తొక్కి వచ్చి లవ్వు చేస్తే లక్కుర మావో
హే లడికి రంభకి ఇస్తాను కీ
ఉడికే ఊర్వశికీ
వన్ - నెలవంక
టు - చలికాలం
త్రీ - మనమింక
హయ్యో - కలకాలం
సవతుల సణుగుడు మనకేలా వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే

కూ...  -  కూ...
కుకురు కుకు - కుక్కురు కుక్కు

మగడివంటే నువ్వేరా మగసిరి మామా
మధన కామరాజ రారా మంచన భీమా
అసలు సిసలు అందమంటే నీదే భామా
శిల్ప మిల్క్ చిలక రావే చీకటి బొమ్మ
హో దిండు దుప్పటి ఫిఫ్టీ ఫిఫ్టీ
ఇంకా లేటేవిటి
హరేయ్ తొలి రేయి బులపాటం
తరువాయి అలవాటం
ఇతరుల గొడవలు మన కేలా వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరే

రతి సుఖసారే మతి చెడిపోయే
సతి ముఖమెంత వాడిపోయే
ఎవరికి వారే యమున విహారే
కలిసిన వయసులు పదహారే - వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే - సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే - హరే హరేతొడతోక్కిడి తోట లోన పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

తొడతోక్కిడి తోట లోన
బుడబుక్కల గాలి వాన
గొడుగెక్కడ ఉందొ గానీ
గొడవిక్కడ జరిగిపోయే
వస్తావా వాటేస్తను
మస్తుగా మందేస్తను

వస్తావా వాటేస్తను
మస్తుగా మందేస్తను
తొడిమలలో తొలకరి అందం
విసురు చెలి విలా విలా విలా విలా

తొడతోక్కిడి తోట లోన
బుడబుక్కల గాలి వాన
గొడుగెక్కడ ఉందొ గానీ
గొడవిక్కడ జరిగిపోయే

అరె కొండ గాలికొట్టి
నా కొంగు జారుతుంటే
నువు తొంగి తొంగి చూడాలయ్యో
ప్యార్ కియాతో డర్నా క్యా జబ్
ప్యార్ కియాతో డర్నా క్యా
అరెరరే సన్నజాజిపూలు
సందేల పెట్టుకుంటే
చెలి చందమామ అందాలయ్యో
ప్యార్ కియాతో డర్నా క్యా జబ్
ప్యార్ కియాతో డర్నా క్యా

కొస్తగా కొన్నిస్తను
దుస్తులే గుంజేస్తను
జింగి చా చక జింగి చా
జింగి చా చక జింగి చా
చలి పిడుగే తగిలినవేళ
కలబడితే అలా అలా అలా అలా

తొడతోక్కిడి తోట లోన
బుడబుక్కల గాలి వాన
గొడుగెక్కడ ఉందొ గానీ
గొడవిక్కడ జరిగిపోయే

పాల మబ్బులన్ని
నీ పాత కోకలైతే
నీ కొత్తకోక నేనై వస్తా
ముద్దాడు కోరా ముచ్చట్లయ్య
మూడు ముల్లేసుకోరా మురిపాలయ్యా
పైట చెంగులన్ని
నీ పూల పక్కలైతే
అరె మల్లెపూలు మత్తైవస్తా
పట్టేసుకోరా పరువాలయ్యా
అలా చుట్టేసు కోరా బంగారయ్యా

హయ్యె హస్తుకో కుమ్మెస్తగా
బస్తుకో వళ్ళిస్తగా
జింగి చా చక జింగి చా
జింగి చా చక జింగి చా
చెలి చిలకే పలికిన వేళ
జత రుతువే మహా మహా మనోరమ

తొడతోక్కిడి తోట లోన
బుడబుక్కల గాలి వాన
గొడుగెక్కడ ఉందొ గానీ
గొడవిక్కడ జరిగిపోయే

అరె వస్తావా వాటేస్తను
మస్తుగా మందేస్తను
తొడిమలలో తొలకరి అందం
విసురు చెలి విలా విలా విలా విలా

చక జింగి చా (4)
చలో నా చక్కెరకేళి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

తాగితే సంతకం పెట్టగలను తాగనివ్వరు
సంతకం పెడితే తాగగలను పెట్టనివ్వరు 
చలో నా చక్కెర కేలి...చేరుకో రాత్రి తెనాలి 
చలో నా చక్కెర కేలి...చేరుకో రాత్రి తెనాలి 
నా శంకు మార్కు లుంగీ యమ చలంటుంతే 
నీ సంకురాత్రి ఓణీ అరె జతౌతుంటె 
మంచులోన నానబెట్టి మందులోన ఊరబెట్టి 
మల్లె పూల మాల కట్టి మాపటెల చాప చుట్టి 
ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఊచ్ 
ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఊచ్ 

చలో నా చక్కెరకేళి...చేరుకో రాత్రి తెనాలి 
చలో నా చక్కెరకేళి...చేరుకో రాత్రి తెనాలి 

మై ఢిల్లి కా రాజా హూం 
నువ్వు నాకు కొత్తిమీర కట్ట హూం 
గోంగూర తట్టకీ ఉల్లిపాయ తొక్కుకీ 
వాలు చూసి వార్తా హూం 
ఈ చిన్న వాడ్నే మెచ్చా హూం 
చిట్టి మనసే మై ఇచ్చ హూం 
పల్లెటూరి పిచ్చుకా పాడుతుంటె పిచ్చిగా 
డొక్క డొలు కడతా హూం 
నెత్తికెక్కకే మత్తు దేవతా 
కొంప ముంచకే కోతి సిస్టరా 
నీతో పేచీ నాతో రాజీ 
రభలక్క సందుకాడ రాజసాని మేడ లోన 
జంబలక్క పంబ మీద రాతిరంత రచ్చ చేసి 
ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఊచ్ 
తూచ్ తూచ్ తూచ్ తూచ్ 
తొక్కుడు తొక్కుడు తూచ్ 
తొందర పడితే హాచ్ 

చలో నా చక్కెరకేళి...చేరుకో రాత్రి తెనాలి 
చలో నా చక్కెరకేళి...చేరుకో ఆంధ్రా ప్యారీస్ 

మై ప్యారిస్ కా పాపా హూం 
ఫ్రెంచి వైను నింపుకున్న పీపా హూం 
తోట కూర కాదనీ వేట కూర వేడిలో 
తిక్క రేగి తింటా హూం 
మై మైసూర్ కా మైనా హూం 
my name is మీనా హూం 
కంటి తోన కన్నడం వంటితోన వంగడం 
చూడకుంటె తంటాహూం 
అల్లుడమ్మలా ఫోసుకొట్టనా 
అత్త నోటికీ తాళమేయనా 
పీసో కేసో బాసో గూసో 
నంగనాచి నత్త గుల్ల 
కంగు తిన్న అత్త పిల్ల 
సంతకాలు చేయమటు చెంతకొచ్చి బంతులాడె 

ఉక్కిరి బిక్కిరి హూ ఉడతా ఉడతా ఊచ్ 
తొక్కుడు తొక్కుడు తూచ్ 
తొందర పడితే హాచ్ 

చలో నా చక్కెరకేళి...చేరుకో రాత్రి తెనాలి 
చలో నా చక్కెరకేళి...చేరుకో రాత్రి తెనాలి 

Most Recent

Default