Aditya 369 (1991) Telugu Songs Lyrics
• Nandamuri Balakrishna played a memorable dual role as Krishna Kumar and Emperor Sri Krishnadevaraya.
• Aditya 369 (1991) is regarded as one of India's earliest and most celebrated science fiction time-travel films.
• Singeetam Srinivasa Rao brilliantly blended science fiction, fantasy and history into one unforgettable cinematic experience.
• The majestic Vijayanagara Empire episodes featuring Sri Krishnadevaraya remain one of the biggest highlights of the film.
• Ilaiyaraaja composed five evergreen songs that continue to be loved by Telugu music lovers.
• Master Tarun appeared as Kishore, Silk Smitha portrayed Simha Nandani, and Baby Raasi (credited as Baby Vijaya) appeared as Kishore's friend.
• The futuristic 2504 A.D. sequences and time machine concept were technically far ahead of their time in Telugu cinema.
Jaanavule Song Lyrics in Telugu – Aditya 369 (1991)
'Jaanavule' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. P. Sailaja and S. Janaki.
Movie : Aditya 369 (1991)
చిత్రం: ఆదిత్య 369 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: జిక్కీ, ఎస్. పి. శైలజ, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ
పల్లవి:
నెర జాణవులే వర వీణవులే
కిలికించితాలతో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే..
సన్నలలో గుస గుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే వర వీణవులే కిలికించితాలతో
ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
చరణం: 1
మోమటు దాచీ మురిపెము పెంచే..లాహిరిలో
అహహహహ ఒహొహో హొహొహో
మూగవుగానే మురళిని ఊదే..వైఖరిలో
చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా
జాణవులే వర వీణవులే
కిలికించితాలతో
ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుస గుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే వర వీణవులే
కిలికించితాలతో
ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే
మధు సంతకాలలో
చరణం: 2
చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
అహహహహ ఒహొహో హొహొహో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాళీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా
జాణవులే వర వీణవులే
కిలికించితాలతో
ఆహాహాహా...
జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుస గుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే ఆహాహా వర వీణవులే
కిలికించితాలతో
ఆహహహా మృదుపాణివిలే
మధు సంతకాలలో
Raasaleela Vela Song Lyrics in Telugu – Aditya 369 (1991)
'Raasaleela Vela' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.
Movie : Aditya 369 (1991)
చిత్రం: ఆదిత్య 369 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
పల్లవి:
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
చరణం: 1
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
చరణం: 2
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ రాయబారమేల
Centurylu Kotte Vayassu Song Lyrics in Telugu – Aditya 369 (1991)
'Centurylu Kotte Vayassu' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.
Movie : Aditya 369 (1991)
చిత్రం: ఆదిత్య 369 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
పల్లవి:
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో
ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చరణం: 1
మేఘమాలనంటుకున్న యాంటినాలతో
మెరుపుతీగ మీటి చూడు తందనాలతో
సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో
వలపు వేణువూది చూడు వందనాలతో
చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో
కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న
కుర్రవాళ్ళ ఈలపాట హుషారులో
లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు
వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో
ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చరణం: 2
వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో రెచ్చి రాసుకున్నపాటకెన్ని పంక్తులో
విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో
ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో
కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత కధక్కులో
నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా
గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా
పాటలన్ని పూవులైన తోటలాంటి లేత యవ్వనాన
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో
ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
జింగు చాక చచ్చ జిజిక్ చాచా
జింగు చాక చచ్చ జిజిక్ చాచా
Chilipi Yaatralo Song Lyrics in Telugu – Aditya 369 (1991)
'Chilipi Yaatralo' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.
Movie : Aditya 369 (1991)
చిత్రం: ఆదిత్య 369 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
పల్లవి:
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
చరణం: 1
ఎదురుగ ఉంది ఏదో వింత
పద పద చూద్దాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే ఔనా
కనబడలేదే నిన్నా మొన్నా
కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందే రాగం
కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం
ఎవర్నైనా హలో అందాం
ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా
సులువుగ తెలిసిన తరుణం కదా ఇది
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
చరణం: 2
వినబడలేదా కూ కూ Welcome
అతిథిలమంటు ఆన్సర్ చేద్దాం
తళ తళలాడే తారా తీరం
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడు లేదే మైకం
మయుడి మిస్టరి ఏమో ఈ మాలోకం
మెదడు విక్టరీ చేసే చిత్రం
తెలివి డిక్షనరీ చెప్పే మాయ మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం
రహస్యాలు పరీక్షిద్దాం
కనుక్కొన్న చమత్కారాలన్ని
చిలవలు పలువలు కలిపి తెలుపుదాం
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్
చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
Suramodamu Song Lyrics in Telugu – Aditya 369 (1991)
'Suramodamu' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki and Sunanda.
Movie : Aditya 369 (1991)
చిత్రం: ఆదిత్య 369 (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, సింగీతం శ్రీనివాసరావు
తా.. తకతాం..తకితాం..తక తకిట దిత్తై..
తకిటతై తత్ తరికిటతాం..
తకతకిట తకతధిమి తకఝుణుతక
తకిట తద్దిమిత.. ధిమిత తక తకిట..
పల్లవి:
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
చరణం: 1
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో...
ఆఆఆఆఅ...ఓఓఓఓ..
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో
దాచెనులే కడలి
ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి
రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం - నాకు ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల
మహా మహా సభాసదులు మురిసిన...
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
చరణం: 2
స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
మ మ గ గ మ ద మ
మ మ ద స ని ద మ
రంపంప రంపపంప
రంపంప రంపపంప రంపంప రంపపంప
భరతము నెరుగని నరుడట రసికుడు
Rock Roll ఆట చూడు
బ్రేకు లోని సోకు చూడు
వెస్ట్ సైడ్ రైమ్ మీద
ట్విస్ట్ చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
rock rock rock n roll
shake shake shake n roll (2)
రప్ప పాప - పపాప - పపాప
ర పాప పాప పాప పాప పాప పాప పాప
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు.. త త
జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...