Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gamyam (2008)
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
నటీనటులు: శర్వానంద్, అల్లరి నరేష్, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి
నిర్మాత: సాయి బాబు జాగర్లమూడి
విడుదల తేది: 29.02.2008Songs List:వన్ వే జీవితానికి పాట సాహిత్యం

 
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
సాహిత్యం: ఈ.యస్. మూర్తి
గానం: రంజిత్, నోయెల్ సేన్

U never know how u love the game
U never know how to worship the game
Until u know to love urself
Love ur soul ull love urself cmon

వన్ వే వన్ వే జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్న ఆగదెమది
జారిపోయే ప్రయాణం

రన్‌వే లాంటిది కాదుగా ఇది
ఎన్నో ఎన్నో మలుపు లున్నది
ఎగుడూ దిగుడూ చూసుకొదిది పరుగు తీసే ప్రవాహం

నీ దారి లోనేనవ్వు చిలకరించే మల్లె పూవులు
తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగ లెన్నో

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలనీ స్రుస్టి లో రహస్యం

జగమే ఒక మాయ.. బ్రతుకే ఒక మాయ
అది అన్నది ఎవరూ అది విన్నది ఎవరేఊ

మనసునే పట్టి లాగే
ప్రేమ ఎంత మాయ అనుకున్న
ఒక చూపుకే బతికే
ఆ మాయలో హాయి లేదా?
ఇప్పుదికడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీ కి

బదులు ఎవ్వరూ చెప్పలెరుగా అందుకే ఈ రోజే నీదే

ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం
అంత కన్న అతి చిన్నదీ యవ్వనం

తాను పుట్టిన చొటె వున్తున్దచినుకు
తాను వెళ్లే చొటె తెలుసా మరి తనకు
నిన్న అన్నదే రాదు గతమంటే ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు కలాలంటిదే కదా మనకు
ఎన్ని వేలచిరు దేశాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచే లోగే మారిపోతుందీ నాటక రంగం
ఎంత చిత్రమో తెలుస్కో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తంచాల్లేగాని ఏంటా పరాకు పాట సాహిత్యం

 
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చైతన్య, సునీత ఉపద్రష్ట

చాల్లేగాని ఏంటా పరాకు
ఉన్నట్టుండి ఏమైంది నీకు
అయ్యో అని worry ఐపోకు
tell me అని enquiry లన్ని ఎందుకు
మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు
ఏదోలా ఎందుకుంటావ్ నీదీలోకం కాదన్నట్టు
ఒదిగుందే లోని గుట్టు
కదిలిస్తే తేనె పట్టు
వదలదుగా వెంటపడుతు
నాకేం తెలుసిది ఇంతేనంటు
మునిగేదాక లోతన్నది
కొలిచే వీలు ఏమున్నది
పరవాలేదు అంటున్నది
ప్రేమలో పడ్డది

ఆమె చెంపలా కందిపోవడం
ఏమి చెప్పడం ఎంత అద్భుతం
అందుకే కదా కోరి కోరి కయ్యాలు
అతని కోసమే ఎదురుచూడటం
బ్రతిమలాడి తను అలక తీర్చడం
పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు
జంటలెన్ని చెబుతున్నా
ఎన్ని కథలు వింటున్నా
అంతుబట్టదే ప్రేమ ఏనాటికైనా
విన్నాగాని అంటావేగాని
ఏమంటోంది ఆకాశవాణి
చూసాగాని వేరే లోకాన్ని
ఏంచెప్పాలి చూపించే వీలులేదని

పక్కకెళ్ళిపో పాడు మౌనమా
కరగవెందుకే కొద్ది దూరమా
బయటపడని జత ఏదో చూసుకోరాదా
ఎంతసేపు ఈ వింత dilemma
కథని కాస్త కదిలించు కాలమా
to be not to be debate ఎంతకీ తెగదా
కొత్త దారిలో నడక
ఇప్పుడిప్పుడే గనక
తప్పదేమో తడబడక
అలవాటు లేక

ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను
నువ్వొచ్చాక ఏమైపోయాను
నీతో ఇలా అడుగేస్తున్నాను
ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను
హత్తేరి చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దీపు, గాయత్రి 

హత్తేరి చింతామణి 
సమయమా చలించకే పాట సాహిత్యం

 
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుజాత మోహన్

సమయమా చలించకే బిడియమా తలొంచకే
సమయమా చలించకే బిడియమా తలొంచకే
తీరం ఇలా తనకు తానె తీరం ఇలా తనకు తానె
వెతికి జతకి చేరే క్షణాలలో

సమయమా చలించకే బిడియమా తలొంచకే

చంటిపాపలా అనుకుంటు ఉండగానే
చందమామలా కనుగొన్న గుండలోనే
తనలొ చిలిపితనం సిరివెన్నెలె అయ్యేలా
ఇదిగొ కలల వనం అని చూపుతున్న లీలలొ

సమయమా చలించకే బిడియమా తలొంచకే

పైడి బొమ్మలా నను చూసె కళ్లలోనే
ఆడ జన్మలా నను గుర్తించాను నేనే
తనకె తెలియదనీ నడకంటె నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలొ

సమయమా చలించకే బిడియమా తలొంచకే
సమయమా చలించకే బిడియమా తలొంచకే

ఎంతవరకు ఎందుకొరకు పాట సాహిత్యం

 
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఈ. యస్. మూర్తి, ఆర్. అనిల్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్ 

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతె బాట లోనె బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనె బదులు వుందె గుర్తు పట్టె గుండెనడుగు
ప్రపంచం నీలొ వున్నదని చెప్పెదాక ఆ నిజం తెలుసుకొవా
తెలిస్తె ప్రతి చొట నిన్ను నువ్వె కలుసుకొని పలకరించుకొవా

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతె బాట లోనె బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనె బదులు వుందె గుర్తు పట్టె గుండెనడుగు

కనపడె ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు
అడగరె ఒకొక్క అల పేరూ ఊఉ ఊ
మనకిల ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరె మనిషి అంటె ఎవరూ ఊఉ ఊ
సరిగ చుస్తున్నదా నీ మది గది లొ నువ్వె కదా వున్నది
చుట్టు అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరి లొ లేదా గాలీ, వెలుతురు నీ చుపుల్లొ లెదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితె నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలొ వున్నదని చెప్పెదాక ఆ నిజం తెలుసుకొవా
తెలిస్తే ప్రతిచోట నిన్ను నువ్వె కలుసుకొని పలకరించుకొవా

మనసులొ నీవైన భావాలె
బయట కనిపిస్తాయి ద్రుశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలొని లోపాలె
స్నేహితులు నీకున్న ఇష్టాలె
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలొని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం
పుట్టుక చావూ రెండే రెండూ
నీకవి సొంతం కావు పొనీ
జీవితకాలం నీదే నేస్తం
రంగులు ఎం వెస్తావో కానీ

తరరరరె తరరరరె తరరరరె తారారరె
తరరరరె తరరరరె తరరెరా తారరరె
తరరరరె తరరరరె తరరెరా తరరరరె

Most Recent

Default