Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Amma Cheppindi (2006)

     


చిత్రం: అమ్మ చెప్పింది (2006)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ప్రణవి ఆచార్య
నటీనటులు: శర్వానంద్ , శ్రీయరెడ్డి, సుహాసిని
దర్శకత్వం: గంగరాజు గుణ్ణం
నిర్మాత: ఊర్మిళ గుణ్ణం, సాయి కొర్రపాటి
విడుదల తేది: 28.07.2006

అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ

హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే చిన్ని కన్నా
హాపి బర్త్ డే టు యు

అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ


చరణం: 1
కలతలెరుగనీ లోకంలో కాలమాగిపోతే
వన్నె తగ్గనీ చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే
ప్రతీ నెలా ఒకే కలా నీ పాల నవ్వుతో
తారలే నీకు అక్షితలై తల్లి దీవెనలు హారతులై
నూరేళ్ళూ జరపాలనీ నువు పుట్టినా రోజునీ

హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే చిన్ని కన్నా
హాపి బర్త్ డే టు యు

చరణం: 2
ఎదురు చూడనీ కానుకలే దాచి ఉంచేనురా
మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా
నువ్వే కదా ఈ అమ్మకీ ఒక పెద్ద కానుకా
నీకు ఏమివ్వగలనంటా నేను ఆశించడం తప్ప
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ

హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే టు యు
హాపి బర్త్ డే చిన్ని కన్నా
హాపి బర్త్ డే టు యు

తరర రా రా రా
తరర రా రా రా
తరర రా రా రా
తరర రా రా రా



*********   *********   **********


చిత్రం: అమ్మ చెప్పింది (2006)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం:  శివశక్తి దత్తా
గానం: బోంబే జయశ్రీ

ఎవరేమైనా అననీ వినకూ
అ అ అ అ.. మ్మ్ మ్మ్
నువ్వేరా అమ్మ కన్నుల వెలుగూ
ఎండల్లో వానల్లో నేనేగా నీ గొడుగూ
చూస్తుందీ లోకం మెచ్చే నువు వేసే ప్రతి అడుగూ
అ అ అ అ.. మ్మ్ మ్మ్

ఎవరేమైనా అననీ వినకూ

చరణం: 1
పది తలలున్నా... ఏమిటి లాభం
తలపులు రాక్షసమైతే
వెయ్యి మాటలతో... పనేముందిరా
నువ్వే రాముడివైతే
తుడుచుకోరా కన్నీళ్ళనీ...
చెరుపుతాయి నీ నవ్వునీ
దిద్దుకోరా ఈ మాటనీ...
నీకు నువ్వే సాటీ అనీ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్

ఎవరేమైనా అననీ వినకూ

చరణం: 2
ఎంతో దూరం... ఎగర లేదుగా
తన రెక్కలతో ఆ పక్షీ
చుక్కల దాకా... ఎదుగుతాడురా
అసలెగరలేని ఈ మనిషీ
అమ్మ పైనా నీ నమ్మకం...
నిలుపుతుందీ  నిన్నెప్పుడూ
అందరాని అంతెత్తునా...
అంబరాన ధ్రువతారగా
అ...అ... మ్మ్...మ్మ్...

ఎవరేమైనా అననీ వినకూ
అ...అ... మ్మ్...మ్మ్...
నువ్వేరా అమ్మ కన్నుల వెలుగూ



*********   *********   **********



చిత్రం: అమ్మ చెప్పింది (2006)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ప్రాణవి ఆచార్య

మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతంతో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం

మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం

చరణం: 1
కాగితాలలో నిదరపోయే కమ్మని మాటే
కాస్త లెమ్మని ఇళయరాజా ట్యూను కడుతుంటే
పాటల్లే ఎగిరి రాదా...
నీ గుండె దూదై పోదా
సంగీతంతో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం

మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం

చరణం: 2
గోరుముద్దలు కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాట
ఊయలని ఊపును పాటే...
దేవుడును లేపును పాటే
సంగీతంతో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం

మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం



*********   *********   **********



చిత్రం: అమ్మ చెప్పింది (2006)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి, శివశక్తి దత్తా
గానం: శ్రేయ గోషల్, హరీష్ రాఘవేంద్ర

ప్రామిస్ చేస్తున్నా ఫర్గెట్ దెమో
నువ్వే నా బాయ్ ఫ్రెండ్ నేనే నీ గర్ల్
లెట్స్ గో అనదర్ డే దేర్ పార్టీ అండ్ మై క్లౌడ్

వస్తావా నాతో సమ్ వేర్ దాకా
ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా
వస్తావా నాతో సమ్ వేర్ దాకా
ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా

చరణం: 1
తూర్పుకి పోతూ పోతూ ఉంటే పడమర వస్తుంది
అండర్ స్టూడ్ - అండర్ స్టూడ్, అండర్ స్టూడ్
కిందకు దిగుతూ దిగుతూ ఉంటే ఉత్తరం వస్తుంది
అండర్ స్టూడ్ అప్పర్ స్టూడ్
కష్టాలు ఈదుతుంటే సుఖతీరాలు చేరుకుంటా
ఔనంటావా కాదంటావా
ఈస్ట్ ఆర్ వెస్ట్, యు ఆర్ ద బెస్ట్
ఐ యామ్ వెరీ హాపీ హాపీ

వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా
ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా
లేటయ్యిందని అమ్మ నన్నే పిలిచేదాకా

చరణం: 2
నీడగ ఒంటరి తనమే నీతో ఉంటుంటే
నీక్కూడా ఫ్రెండున్నట్టే
నీ ఫ్రెండే నా ఫ్రెండైతే నువ్వూ నేను ఫ్రెండ్సేగా
ఎవ్రీ డే ఫ్రెండ్ షిప్ డే
గడియారం ముళ్ళు లాగా చుట్టి వేద్దామా కాలమంతా
ఆ ఆగక అలవక
ఈస్ట్ ఆర్ వెస్ట్, యు ఆర్ ద బెస్ట్
ఐ యామ్ వెరీ స్లీపీ స్లీపీ

వస్తాలే నీతో ఉఁ దాకా
ఉంటాలే నీతో ఉఁ  దాకా
ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా

వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా
ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా
లేటయ్యిందని అమ్మ నన్నే పిలిచేదాకా

Most Recent

Default