Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Okariki Okaru (2003)




చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: శ్రీరామ్, ఆర్తి చాబ్రియా
దర్శకత్వం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: కిరణ్
విడుదల తేది: 09.10.2003



Songs List:



వెళ్ళిపోతే ఎలా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్. యమ్. కీరవాణి, శ్రేయ ఘోషల్

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా 
అయినా ఎందుకని ఇలా తడబాటు అంతలా 
తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట 
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట

వెళ్ళిపోతే ఎలా...  వెళ్ళిపోతే ఎలా...

చరణం: 1 
ఆమె వలలో చిక్కుకుందా సమయం 
ప్రేమ లయలో దూకుతోందా హృదయం 
నేనిప్పుడెక్కడున్నానంటే 
నాక్కూడా అంతు చిక్కకుంటే 
గమ్మత్తుగానే ఉన్నాదంటే 
నాకేదో మత్తు కమ్మినట్టే 
రమ్మంది గాలి నను చేరి మెరుపు సైగ చేసి 
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి 
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా 
వెళ్ళనంటే ఎలా ఎలా... 

చరణం: 2 
తానూ కూడా రాకపోతే నాతో 
నేను కూడా ఆగిపోనా తనతో 
నా ప్రాణం ఉంది తన వెంటే 
నా ఊపిరుంది తననంటే 
కళ్ళారా చూసానంటూ ఉంటె 
ఎల్లా నమ్మేది స్వప్నమంటే 
వెనక్కి వెళ్లి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని 
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని 
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా 
వెళ్ళనంటే ఎలా ఎలా...





నాదిరిదిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్, గంగ

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
నచ్చిన దాని కోసం నా తపన 
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
మెచ్చిన పూల సందేశం విననా 
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
నచ్చినదాని కోసం నా తపన 
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
మెచ్చిన పూల సందేశం విననా
సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే 
వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా

నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3)
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా...

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
నచ్చిన దాని కోసం నా తపన 

చరణం: 1 
చిగురే పెదవై చినుకే మధువై 
ప్రతి లతలో ప్రతిబింబించే 
నదులే నడకై అలలే పలుకై 
ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన

నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3)
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా...

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
నచ్చిన దాని కోసం నా తపన 
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
మెచ్చిన పూల సందేశం విననా 

చరణం: 2 
కురిసే జడిలో ముసిరే చలిలో 
ప్రతి అణువు కవితలు పాడే 
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో 
ప్రతి క్షణము శాశ్వతమాయే 
ఈ వెలుగే నీ వలన నీ చెలిమే నిజమననా

నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా (3)
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా...

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
నచ్చిన దాని కోసం నా తపన 
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా 
మెచ్చిన పూల సందేశం విననా 
సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే 
వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా

నాదిరిదిన్నా నాదిరిదిన్నా  నాదిరిదిన్నా 




ఎక్కడున్నావమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా 
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరంలాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో...
నా యదపై ఎప్పుడు నిదురిస్తావో

సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకూరి 
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని 
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి సానా 
సుబ్బలక్ష్మి కోడూరి...

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా 
ఏది అనుకోనమ్మా నీ చిరునామా

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరువాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫోను నంబరేమిటో
అక్కడి చిలకను అడిగితే 
నువు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ ఇంగ్లీష్ చిలక 
నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి

సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి...

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా

ఫస్టుటైము డైలు చేయగా అష్టలక్ష్మి పలికెరా
రెండోసారి రింగు చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా
హోయ్.. మరోమారు ట్రైలు వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురుదెబ్బలే తగిలినా 
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాన్లే
కరి మబ్బులెన్ని నను కమ్మినా 
నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా

సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాలా

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా 
ఏది అనుకోనమ్మా నీ చిరునామా





నువ్వే నా శ్వాస పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయ ఘోషల్

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

చరణం: 1 
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బులోన చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా...
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

చరణం: 2 
సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని
ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...




ఘాటు ఘాటు ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, నిత్య సంతోషిని

ఘాటు ఘాటు ప్రేమ - నీకు నాకు నడుమ 
ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా 
నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా 
చేరానుగా ఓకే మరి - ఈ చేరువ సరిపోదేమరి 
నాలో నువ్వు నీలో నేను ఇంకా ఇంకా ఉండాలంటే 
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి...

ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా 
నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా 

చరణం: 1 
చూడు - నిను చూసినకొద్దీ చూడందేదో 
చూడాలంటూ బ్రతిమాలుతుంది వయసు 
చెప్పు - అని పలికిన కొద్దీ చెప్పందేదో 
చెప్పాలంటూ చెలరేగుతోంది మనసు 
నా పసిడి ప్రాయాలు ఒంపినా...
నా పట్టపగ్గాలు తెంపినా...
నువ్వో సగమై నేనో సగమై ఇద్దరమొకటై ఉండాలంటే 
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి...

ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా 
నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా 

చరణం: 2 
ముద్దు - నువ్వు పెట్టిన కొద్దీ దాహం పెరిగి 
దావనలమై నను కాల్చుతుంది ఒట్టు 
పట్టు - నువ్వు పట్టిన కొద్దీ మత్తుగా నాలో 
కమ్మిన మైకం ఎక్కింది ఆఖరి మెట్టు 
కౌగిళ్ళ లోగిళ్ళు చేరినా...
సరసాల శిఖరాలు తాకినా...
నేనే నువ్వై నువ్వే నేనై నువ్వు నేను ఉండాలంటే 
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి  ఏం చెయ్యాలి...

ఘాటు ఘాటు ప్రేమ...
నీకు నాకు నడుమ...




అల్లో నేరేళ్ళో పాట సాహిత్యం

 
చిత్రం: ఒకరికి ఒకరు (2003)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. కీరవాణి, గంగ

అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో
అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో
జనకుని కూతురు జానకి అల్లోనేరెల్లో 
జాజుల సోదరి జానకి అల్లోనేరెల్లో 
మిధిలానగరిని జానకి అల్లోనేరెల్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెల్లో 
అందాల రాముని పరిణయమాడి 
అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో

అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో
అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో
జనకుని కూతురు జానకి అల్లోనేరెల్లో 
జాజుల సోదరి జానకి అల్లోనేరెల్లో 
మిధిలానగరిని జానకి అల్లోనేరెల్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరెల్లో 
అందాల రాముని పరిణయమాడి 
అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో

అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో 
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో 

చరణం: 1 
ఏటిపాయల పాపిటకి కుంకుమ బొట్టే ఆభరణం 
ఎదురు చూపుల కన్నులకి కాటుక రేకే ఆభరణం 
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం 
పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం 
మగువ మనసుకి ఏనాడూ మనసైన వాడే ఆభరణం

అందాల రాముని పరిణయమాడి 
అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో
అందాల రాముని పరిణయమాడి 
అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో

చరణం: 2 
చేయి జారిన చందమామని అందుకోగలనా 
రాయలేని నా ప్రేమలేఖని అందజేయగలనా 
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా 
చేరువై నా మనోవేదన మనవి చేయగలనా 
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా

అందాల రాముని పరిణయమాడి 
అయోధ్య చేరును జానకి అల్లోనేరెల్లో

Most Recent

Default