Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kalusukovalani (2002)



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: కులశేఖర్
గానం: దేవీ శ్రీ ప్రసాద్, కల్పన
నటీనటులు: ఉదయ్ కిరణ్, గజాల, ప్రత్యూష
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: ఆర్ రఘురాజ్
నిర్మాతలు: రాజు, ప్రవీణ్ , గిరి
విడుదల తేది: 08.02.2002

చెలియా చెలియా సింగారం
చిటికెడు నడుమె వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావ బావ బంగారం అతిగా నాన్చకు యవ్వారం
ఈ పూటైనా తీర్చెయవా నా భారం

ఓ చెలి అరె అలా పొడిగించకే కధే ఇలా
చాటుగా అదీ ఇదీ మరియాదా
రా ప్రియా అదేంటలా అరిటాకుల మరీ అలా
గాలి వాటుకే ఇలా భయమేలా

చెలియా చెలియా సింగారం
చిటికెడు నడుమె వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం

సోకులను ఆరేసి నా మదికి వల వేసి
లాగకికా వన్నెల వయ్యారీ
కొరికలు రాజేసి కోక నను వదిలేసి
నాకు ఇక తప్పదు గొదారి
ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు
అమ్మమ్మా నిన్నింక నమ్మేదెలా
ముద్దుల్లో ముంచెత్తి నా మొక్కు చెల్లించు
ముద్దయిలా నువ్వు కుర్చోకలా
వాగల్లే వస్తావు వాటేసుకుంటావు
చీ పాడు సిగ్గంటూ లేదే ఎలా
దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు
ఈ మాయ చెప్పేదెలా

మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి
పెట్టకిక నాతో ఈ పేచీ
కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి
ఆడెనటా మనతో దోబూచి
అబ్బబ్బా అబ్బాయి జుబ్బాల బుజ్జాయి
యెన్నెన్ని పాఠాలు నెర్పాలిలా
అందాలా అమ్మాయి మోగిస్త సన్నాయి
అందాక హద్దుల్లో ఉండాలలా
కల్లోకి వస్తావు కంగారు పెడతావు
నాకర్ధమె కాదు నీ వాలకం
ఒళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు
అయ్యాగా నీలో సగం

చెలియ చెలియ సింగారం
చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావా బావా బంగారం అతిగ నాంచకు యెవ్వారం
ఈ పుటైనా తీర్చెయ్యవా నా భారం





********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: దేవీ శ్రీ ప్రసాద్

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే  ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే

మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే
గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని
నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ
నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ

హే ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే  ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే




********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరంగం వేణు, సుమంగళి

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా
ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది




********    ********   ********




చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి

పదే పదే వెంటాడే కల
ఇదే ఇదే కాదంటే ఎదా
ఇవ్వాళ నీకోసమే
వరాల సావసమై
చేయ్యందుకోమన్నది
వెయ్యేళ్ళ ఈ పెన్నిధి
ఎన్నాళ్ళని నిరీక్షణం
ఫలించినట్టున్నది






********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి

ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చేయగా
యుగాలు గల కాలమా
ఇలాగే నువ్వాగుమా
దయుంచి ఓ దూరమా
ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం
అయ్యేట్టు దీవించుమా




********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: సుమంగళి, సత్యా (కిడ్)

చికి చికి చికి చం చాం  చికి చికి చికి చం (4)

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి
రేయంతా తెగ అల్లరి చేయాలి
ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి
అవి రేపోమాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి
అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యలి

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి
రేయంతా తెగ అల్లరి చేయాలి

చికి చికి చికి చం చాం  చికి చికి చికి చం (4)

ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి - చం
తారలన్ని నాకు హారం కావాలి - చికి చికి చికి చం
మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి - చం
చందమామ నాకు చందనమవ్వాలి - చికి చికి చికి చం
రంగులతో కళ్ళాపే చల్లాలి
ఆ రంగులనుండి లాలించే ఒక రాగం పుట్టాలి

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి హొయ్

చికి చికి చికి చం చాం  చికి చికి చికి చం (2)

నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి
నాతో ఉంటూ ఎన్నడైనా సరే
పసిపాపల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి - చికి చికి చికి చం
ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమ తోటి కలిపి
చిన్న తప్పు చేస్తే నన్ను తీయగ తిట్టాలి  - చికి చికి చికి చం
ఏనాడూ నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి

హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి
రేయంతా తెగ అల్లరి చేయాలి

చికి చికి చికి చం చాం  చికి చికి చికి చం (4)




********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిణి, యస్. పి.బి. చరణ్

తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి

లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించని
ఇంతకాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని
పాపం ప్రియురాలే తాపం అణిగే ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏంకావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలి
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి
నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో

పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు ఉన్నా నీ దారి
తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ

లోలో రుసరుసలు రేపే తహ తహాలు ఆపే సమయం ఇది
నాలో గుసగుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇది
అందుకోని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలని
కానీ నిలువెల్ల నాటే కొన గోరు మీటే  కొంటె ఆటని
ముద్దులు పెట్టక నిద్దర పట్టక బిత్తరపోయిన కోమలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పని తప్పులు చేయాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి


********    ********   ********



చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: కులశేఖర్
గానం: దేవన్, మతాంగి జగదీష్

దేవా రంభా ఊర్వశి మేనక బరితెగించి
భూలోకంగాని ఒళ్ళుపొచ్చిసినారేటి
చెస్ పల్లకోరా మరి అలెవలేటి మామా

షకిలా  షకీలా,  షకిలా  షకీలా
ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా
అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా
హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా
పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా
టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా
నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్

షకిలా  షకీలా,  షకిలా  షకీలా

ఎంకిని పాపం ఎక్స్ పోజింగ్ అని ఎన్నో నిందలు వేస్తారు
F TV లో డ్రెస్సులు మాత్రం ఇట్టే ఫాలో అవుతారు
ఓయ్ ఫ్యాషన్ గీషన్ అంటూ లేని లోకం ఉండదు అంటారు
మాయ మర్మం ఏమి లేని చోటే బలే చూపిస్తారు

హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె
యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె

అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొహోయ్ హొహోయ్ హొయ్
అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో
జమకు జమా జ్యోతిలక్ష్మినీ మీ బాబులకే కలల రాణిని

షకిలా  షకీలా,  షకిలా  షకీలా

నేను చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
భూగోళంలో నేనీ భూగోళంలో
చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా

ఊరు వాడా ఎమనుకున్నా పాపలు డోంట్ కేర్ అంటారు
ఊహాల్లో తెగ విహరిస్తూ కాలక్షేపం చేస్తారు
కాలేజీలో కుర్రోళ్లంతా పాపల వెంటే పడతారు
అరె నిక్కర్లేసుకు వచ్చారంటూ నిద్దర పట్టక చస్తారు

హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె
యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె

ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్...
ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో
పైన చూసి మోసపోకు తీయ్ అది చైనా బజార్ గోల్డ్ బ్యాటరీ

షకిలా  షకీలా,  షకిలా  షకీలా

ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా
అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా
హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా
పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా
టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా
నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్

షకిలా  షకీలా,  షకిలా  షకీలా

ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా
అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా
హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా
పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా
టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా
నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్

Most Recent

Default