Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Priyuralu Pilichindi (2000)




చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
నటీనటులు: ముమ్మట్టి, అజిత్, అబ్బాస్, టబు, ఐశ్వర్యారాయ్
దర్శకత్వం: రాజీవ్ మీనన్
నిర్మాత: ఏ.ఎమ్.రత్నం
విడుదల తేది: 05.05.2000



Songs List:



గంధపు గాలిని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం, శివ గణేశ్ 
గానం: శంకర్ మహదేవన్

లేదని చెప్ప నిమిషము చాలు 
లేదన్న మాట తట్టుకోమంటే 
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె 
ఏమి చేయ మందువే 

గంధపు గాలిని తలుపులు ఆపుట 
న్యాయమా.... న్యాయమా 
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె 
మౌనమా.... మౌనమా 
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే 
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు 
లేదన్న మాట తట్టుకోమంటే 
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె 
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట 
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె 
మౌనమా.... మౌనమా 
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే 
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే 

లేదని చెప్ప నిమిషము చాలు 
లేదన్న మాట తట్టుకోమంటే 
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని 
తెలిపేను హృదయం నీకు సొంతమనీ.... 
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి 
అద్దాల ఊయల బింబమూగె చెలీ.... 
నువు తేల్చి చెప్పవే పిల్లా 
లేక కాల్చి చంపవే లైలా 
నా జీవితం నీ కనుపాపలతో 
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు 
లేదన్న మాట తట్టుకోమంటే 
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే 

గంధపు గాలిని తలుపులు ఆపుట 
న్యాయమా.... న్యాయమ
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె 
మౌనమా.... మౌనమా

తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది 
వాసనలు వీచే నీ కురులే సఖీ.... 
లోకాన చీకటైన వెలుగున్న చోటేది 
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ.... 
విశ్వ సుందరీమణులె వచ్చి 
నీ పాద పూజ చేస్తారే 
నా ప్రియ సఖియా ఇక భయమేలా 
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే 
ఏమి చేయమందువే ఏమి చేయమందువే 
న్యాయమా... న్యాయమ
ఏమి చేయమందువే ఏమి చేయమందువే 
మౌనమా... మౌనమా 
ఏమి చేయమందువే 





తొంగి చూసే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్ 
గానం:  హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్

తొంగి చూసే



దోబూచులాటేలరా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్ 
గానం:  చిత్ర

దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాల 
నా మనసంత నీవేనురా 
దోబూచులాటేలరా గోపాల 
నా మనసంత నీవేనురా 
ఆ యేటి గట్టునేనడిగ 
చిరు గాలి నాపి నే నడిగ 
ఆ యేటి గట్టునేనడిగ 
చిరు గాలి నాపి నే నడిగ 
ఆకాశాన్నడిగ బదులే లేదు 
ఆకాశాన్నడిగ బదులే లేదు 
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా

దోబూచులాటేలరా గోపాల 
నా మనసంత నీవేనురా 

నా మది నీకొక ఆటాడు బొమ్మయ 
నా మది నీకొక ఆటాడు బొమ్మయ 
నాకిక ఆశలు వేరేవి లేవయ్య 
ఎదలో రొదాగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ 
నీ అధరాలు అందించ రా గోపాల 
నీ కౌగిళిలొ కరిగించ రా 
నీ తనువే ఇక నా వలువా 
పాలకడలి నాది నా గానం 
నీ వన్నె మారలేదేమి 
పాలకడలి నాది నా గానం 
నీ వన్నె మారలేదేమి 
నా ఏదలొ చేరి వన్నె మర్చుకో 
ఊపురి నీవై సాగ 
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా 

దోబూచులాటేలరా గోపాల 
నా మనసంత నీవేనురా 

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు 
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు 
పువ్వునకనే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపల 
అది తిలకించ కనులే లేవా 
నీ కలలే నేనే కాదా 
అనుక్షనము ఉలికెనా మనసు 
అరె మూగ కాదు నా వయసు 
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనికుండ 
యెప్పుడు నీవే అండ కాపాడ రా

దోబూచులాటేలరా గోపాల 
నా మనసంత నీవేనురా 





పలికే గోరింకా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్ 
గానం:  సాధనా సర్గమ్

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా...
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలును ఫలియించు కలలే దరీచేరవా

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా

నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం
భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ
బ్రతుకే బతికేందుకూ

పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితె రోజా నేడే పూయునే



నెలే పొడిచెనని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్ 
గానం:  చిత్ర , శ్రీనివాస్

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని 
తుళ్ళీ పడెనులే నా హృదయం 
నీడ చూసినా నువ్వేనంటు 
ఈ హృదయం పొంగీ పొరలును 

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని 
తుళ్ళీ పడెనులే నా హృదయం 
నీడ చూసినా నువ్వేనంటు 
ఈ హృదయం పొంగీ పొరలును 

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 
కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో 
కవిత నెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ 

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 

సంధ్య వేళలొ మనసు మూల 
మరుగైన మోము మది వెదికెలే 
మండుటెండలో నగర వీధిలో 
మసలి మసలి మది వాడెలే 
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు
మధ్య నిన్ను మది వెదికెలే 
అలల నురుగు లో కలల ప్రేమికుని 
గుచ్చి గుచ్చి మది వెదికెలే 
సుందర వదనం ఒక పరి చూచిన 
మనసే శాంతించూ...ఊ... 
ముని వ్రేళ్ళతో నువ్వక పరి తాకిన 
మళ్ళి మళ్ళి పుట్టెదనే..ఏ... 

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని 
తుళ్ళీ పడెనులే నా హృదయం 
నీడ చూసినా నువ్వేనంటు 
ఈ హృదయం పొంగీ పొరలును 

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 

ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే 
ముద్దులిచు మురిపాల సెగలను ఎల్ల వేళలా కొరులే
చెమట నీటీ నీ మంచి గంధముగ ఎంచ మని మది కోరెలే 
మోము పైన కేశములు గుచ్చిన తీపి హయి చెప్పుకోదులే ఆఆ... కోదు లే...ఏ.. 
రాయి తో చేసిన మనసే నాదని చెలియ కు తెలిపితినే 
రాయి మధ్యలో పెరిగిన లత లా నువు నాలో తొలచితివే 

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా 




స్మయి అయి అయి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం ,  శివ గణేశ్ 
గానం:  దేవన్ ఏకాంబరం, క్లింటన్ సెరిజో, డొమినిక్ సెరిజో

స్మయి అయి అయి

Most Recent

Default