Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Subhakankshalu (1997)చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: చిత్ర
నటీనటులు: జగపతిబాబు, రవళి, రాశి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
నిర్మాతలు: యన్. వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 14.01.1997

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె**********   **********   **********


చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమ
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే

చూస్తునే మనసు వెళ్ళీ నీ ఒళ్ళో వాలగ
నిలువెల్లా మారిపోయానే నీ నీడగ
నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే
కదలదు సమయం కనపడుతుంటే
నువ్వోస్తూనే ఇంద్రజాలం చేసావమ్మ
కవ్విస్తూనే చంద్రజాలం వేసావమ్మ
పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమ

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఏన్నెన్నెన్నో గాదల్లున నీ బాసని
ఉన్నటుండి నేర్పినావు ఈ రోజు నీ
నీ జతలో క్షణమైన బ్రతుకులు చరితగ మర్చేస్తుందమ్మా

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామ ప్రేమ**********   **********   **********


చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

నాలో కులుకుల కులుకులు రేపి
లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి రాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహతహ దూకి
నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

ఆడే మెరుపుల మెలికల జాన
పాడే జిలిబిలి పలుకుల మైనా
రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా
రేగే తనువుల తపనలపైన
వాలే చినుకుల చమటల వాన
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన
బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందార హారాలతో నీవుండే రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ

Most Recent

Default