-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijay Kanakamedala"



చిత్రం: భైరవం (2025)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కె. కె. రాధామోహన్
విడుదల తేది: 30.05.2025



Songs List:



ఓ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: తిరుపతి జావన 
గానం: అనురాగ్ కులకర్ణి, యామిని గంటసాల

అరె గుండెలోన చప్పుడే
లవ్వు గంట కొట్టెరో
హే నేలపైన అడుగులే
కొత్త స్టెప్పులేసేరో

అరెరెరే నీలిరంగు నింగిలోన
గువ్వల గుంపు ఎగిరినట్టు
ఊహలన్ని ఒక్కసారి రెక్కలిప్పెరో

ఎహె గాలిలోన దూది లాగా
తేలి తేలి పోయినట్టు
గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో

ఓ వెన్నెలా నీ మాయిలా
నా పైనిలా చల్లి పోకలా
ఓ వెన్నెలా నా రాణిలా
నూరేళ్లిలా ఉండిపో ఇలా

ఓ ఓ ఓ ఒసేయ్ అందాల చిట్టి
ఓహో కాలికున్న మువ్వల పట్టి
ఆహా మనసునే బాగా చుట్టి
లంగరేసి లాగేస్తున్నావే

కళ్లకే కాటుక చుట్టి
ఓహో కాలరే గట్టిగా పట్టి
ఆహా మెల్లగా మత్తులో నెట్టి
నన్నే ఇలా ముంచేత్తున్నావే

ఓయ్ మాటల మారి
నీ పక్కన చేరి
నా దిక్కులు మారి
కొత్తగా అయిపోయా

నువ్వంటే నాకు ఎంతో నచ్చి
చెప్పలేనంత ఎక్కింది పిచ్చి
తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి
నీ కోసమే పుట్టానురో

హ హ ఓ వెన్నెలా
ఈ హయిలా
నా పైనిలా
చల్ల గాలిలా

ఓ వెన్నెలా
నీ రాణిలా
నూరేళ్లిలా
ఉండనా ఇలా

ఒసేయ్
వెన్నెల
ఓయ్ అరెరెరే
యహే ఉండిపో ఇలా
ఉండనా ఇలా




డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రేవంత్‌, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల

డుమ్‌ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే



గిచ్చమాకు పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: 	కాసర్ల శ్యామ్‌
గానం: ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల

గిచ్చమాకు



Theme of Varada పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: 	పూర్ణాచారి 
గానం: ప్రుద్వి చంద్ర 

Theme of Varada



Bhairavam Theme పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శంకర్ మహదేవన్ 

భం భం భం శివ బ్రూస్థలి జననం
భౌ భౌ భౌకృత భీకర నినధం
ధిం ధిం ధింపద భీషణ చలనం
ఢం ఢం ఢంమృత ఢమరుక రణనం

ప్రళయ ప్రాభవా శివ తేజోద్భవా
అరి గర్వాపః రిపు సంహారక
పాప వినాశక సాక్షాత్ సాంబశివా

భైరవం అగ్నిఫాలం
భైరవం దీర్ఘరసనం
భైరవం క్షాత్రతేజం
భైరవం రణబీషణం

గం గం గర్విత దుర్జన దమనం
ధం ధం దర్పిత కంట విదలనం
టం టం ఆర్బట కరాల ధంష్ట్రం
ధిగ్ ధిగ్ ధిగ్ భిత్ ధీర్ఘ నిశ్వసనం
విచలద్వీక్షణా రణ రక్తేక్షణా

శ్రితజన రక్షక బలరిపు భక్షణ
షిత షిత నకముఖ
ఉద్యత్ మృత్యుమఖా

భైరవం వికృత వదనం
భైరవం శత్రు నిధనం
భైరవం భీమ రూపం
భైరవం భయ కారకం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ



Theme of Gajapathi పాట సాహిత్యం

 
చిత్రం: భైరవం (2025)
సంగీతం: 	శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: శ్రీ చరణ్ పాకాల, క్రాంతి కిరణ్ 

Theme of Gajapathi

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: ఉగ్రం (2023)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్
దర్శకత్వం: విజయ్ కనకమేడల 
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది 
విడుదల తేది: 05.05.2023



Songs List:



దేవేరి పాట సాహిత్యం

 
చిత్రం: ఉగ్రం (2023)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
సాహిత్యం: శ్రీమణి 
గానం: అనురాగ్ కులకర్ణి 

దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

ఎప్పటికప్పుడు నువ్వలా
ఎదురై నవ్వుతు ఉంటె
అప్పటికప్పుడు గుండెకే
చప్పుడు పెరుగుతూ ఉందే
ఎం చేసిన ఎం చూసినా
నీ ఊహలే నను ముంచెనే
నీ కోసమే నిలబడమని
నా ప్రాణమంది వినవె
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

సాగే పయనాన ఎన్ని సంగతులో లెక్కపెట్టగలమా
జారే నిమిషాలే ఆగే మన తీపి గురుతు వలనా
పెదవికి నిదుర కనులకి కలుకు
చెవులకు చూపు నేర్పినావులే
స్పర్శలు కలిపి సైగలు చెరిపి
కొత్త బాషా రాసావులే
హృదయము కదిపి
కుదురుని కుదిపి
బ్రతుకున జతపడి శ్రుతులతో ముడిపడి
నిలబడమంది నిలకడగా నీతోడై
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

Palli Balakrishna Tuesday, April 4, 2023



చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
నటీనటులు: అల్లరి నరేష్ , వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి , ప్రవీణ్, నవమి
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సతీశ్ వేగేశ్న
విడుదల తేది: 19.02.2021

గమనిక: డైరెక్టర్ సతీశ్ వేగేశ్న , నిర్మాత సతీశ్ వేగేశ్న వేరువేరు ఇద్దరు ఒకటి కాదు 
వీళ్లిద్దరి ఫొటో కోసం ఇక్కడ క్లిక్చేయండి



Songs List:



చెలీ... చెలీ... పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: శ్రీమణి
గానం: యన్. సి. కారుణ్య , హరిప్రియ మరన్గంటి

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే
ఊహించనిదే నా ఊపిరికెదురై
సంతోషమిలా వరదై ముంచినదే

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...

కాబోయేవాడే ప్రేమిస్తే ఆనందం ఆగేనా
మనువాడే వాడే మనసిస్తే ఆ బంధం తొణికేనా
నీవే పంచు ఈ ప్రేమకి కాలం చాలునా
వందే ఏళ్ళు ఈ గుండెకి వేలే కోరనా...

నా నువ్వుంటే నా వెంటే చాలంటున్నా
ఏ జనమ్మెనా నీ జంటై అడుగే వేసే
భాగ్యం నాకే కావాలంటున్న...

ఓ కలలా మొదలై  ఓ కథలా కదిలే

చెలీ... చెలీ...  చెలీ... చెలీ...




ఇదే నాంది...పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: విజయ్ ప్రకాష్

ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా
దౌర్జన్యాల జ్వాలా...
న్యాయం కోసం ధర్మం కోసం
సాగాలమ్మా మీలా....

నిరాశలా నిశీధులే 
నిరంతరం ఆవరించినా...
ప్రభాతమై ప్రకాశమై
ప్రశాంతమై సాగుమా...

ఇదే నాంది...
ఘాతుకాన్ని గోతిలోన పాతడానికీ
ఇదే నాంది...
నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ
ఇదే నాంది...
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది...
రాక్షసాన్ని కూల్చడానికి

భయపడితే భవిత లేనే లేదు
పిడికిలినే వీడరాదు
సమరములో సాహసాలే తోడు
వెనకడుగే వేయరాదు
సవాలుకెదురుపడు సయ్యంటూ తిరగబడు
సహించి నిలబడితే మార్పే రాదు
దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ
జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడు

ఇదే నాంది...
కంటి నీరు మంట లాగ మారడానికీ
ఇదే నాంది...
రక్తమోడ్చి కొత్త బాట వేయడానికీ
ఇదే నాంది...
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది...
కోరుకున్న కొత్త చరిత రాయడానికీ



దేవతలంతా ఉలిక్కిపడేలా పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా

చూపుల బాణం వేసి కన్నులతో లాగే 
కొంటె పనే చెయ్యకే బాలా
హాయ్ గుండెలలోన కుడికాలు పెట్టేసావే నువ్వెవరే మల్లెలమాల
అరె కోవెలలో దీపములే చిన్నబోయెనే
నువ్వే కనులతో నవ్విన వేళా
గుడి గంటలుగా నా మనసే మోత మోగెనే
కథే తారుమారుగా చేసి వెల్లకే

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా

సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు
నీ కోసమే వెతుకుతు ఉసూరంటుంటే
హఠాత్తుగా ఎదురుగ ఇలా వస్తే నువ్వు
హడావిడే పడి మది హుషారయ్యిందే

రానే రాదు కదా నిద్దర నా వైపు
నువ్వే పగటికలై రాతిరొస్తుంటే
పోనేపోవు కదా ఊహలు ఆ లోపు
నిన్నే నా ఎదలో దాచుకుంటుంటే

మళ్ళీ ఏ నిమిషం దూరంగా వెళ్ళిపోనని
నువ్వే సంతకమే పెట్టావే పిల్లా
ఇలా నా ఎదుటే దగ్గరగా ఉండిపొమ్మని
నాపై ఒట్టు పెట్టి బెట్టు చెయ్యనా

దేవతలంతా ఉలిక్కిపడేలా
దేవుడు కూడా మైమరిచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా
జాబిలి చెల్లా...




గుండెలోనా మండుతోందా పాట సాహిత్యం

 
చిత్రం: నాంది (2021)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కరిముల్లా

గుండెలోనా మండుతోందా మందు లేని గాయం
ముందరంతా ఉన్నదంతా అంతు లేని శూన్యం
కరిగెరా కరిగెరా బంధాలన్నీ కలగా
కదలదీ హృదయమే బండబారె శిలగా

నడిచే... ఎదవు నీవు కదా
గృహమే... శిథిలమాయెనుగా

మురిసిపోయిన జ్ఞాపకాలే
ముసురుకున్నవి నేడిలా
చిగురువేసిన రోజులన్నీ 
చెదలు బూజులే ఆయెగా

తిరిగెలే ఇచటనే అమ్మానాన్నలుగా
మిగిలెలే ఇపుడిలా పటము బొమ్మలుగా
బతుకులే చితుకులై మండాయి ఓ చితిగా
వెలుగునే నిలువునా మార్చాయి చీకటిగా

ఆఆ...మనసే...పగిలిపోయెనుగా
దిగులే... పొగిలి ఏడ్చెనుగా
కలలే... రగిలిపోయెనుగా
బతుకే...మిగిలే బూడిదగా

Palli Balakrishna Monday, March 8, 2021

Most Recent

Default