-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Venkatesh Nimmalapudi"



చిత్రం: సుందరకాండ (2025)
సంగీతం: Leon James
నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవి, వ్రితి వఘని 
దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపుడి 
నిర్మాత: సంతోష్ సిహ హెచ్
విడుదల తేది: 27.08.2025



Songs List:



బహుశా బహుశా పాట సాహిత్యం

 
చిత్రం: సుందరకాండ (2025)
సంగీతం: 	Leon James
సాహిత్యం: శ్రీ హర్ష ఇమాని 
గానం: సిద్ శ్రీరాం

బహుశా బహుశా బహుశా 
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా

నీ చెంపలనే కెంపులతో
నింపావనుకున్నా… బహుసా
నువ్వు నచ్చేసా…
నీ చెక్కర మాటల్లో
నే చిక్కుకుపోయానని తెలుసా…
నన్నే ఇచ్చేసా…

ఎగిరే తారాజువ్వ
చూస్తే అది నీ నవ్వా
పొగిడే మాటలు
ఎన్నున్నా సరిపోవా…?
కళ్లతో నవ్వే కలువ
ఊహలకందని విలువ
ఓ కనికట్టల్లే ఏమ్మాయో చే–సా–వా

మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే…

మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరికి ఎటు చూడు
నువ్వే నువ్వే…

బహుశా బహుశా బహుశా 
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా

పలుకుల దారా… గుణగణమే ఔర
నలుగురిలో నడిచే ఓ తారా
తెలిసిన మేరా… ఒకటే చెబుతార
ఆలయమే లేని దేవతారా…

నీ లక్షణం చెప్పనీ
అక్షరాలేమైనా వద్ధింకా, నాకొద్ధింకా
ఏ వంకలు పెట్టలేనంతగా
నచ్ఛావే నెలవంకా
చాలే చాలింకా

మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే…

మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరికి ఎటు చూడు
నువ్వే నువ్వే…

బహుశా బహుశా బహుశా 
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా

Palli Balakrishna Saturday, April 18, 2026

Most Recent

Default