-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vellake"



పాట: వెళ్ళకే (2023) సంగీతం: భరత్-సౌరభ్ నటీనటులు: అలేఖ్య హారిక, సుగి విజయ్ దర్శకత్వం: వినయ్ షణ్ముఖ్ నిర్మాణ సంస్థ - Sony Music Entertainment India Pvt. Ltd. విడుదల తేది: 22.05.2023

వెళ్ళకే పాట సాహిత్యం

 

పాట: వెళ్ళకే (2023)
సంగీతం: భరత్-సౌరభ్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: యాజిన్ నిజార్ 

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే

నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే

అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తు
ఎదురయ్యేది మనమే

నీతోడు నేననీ
నా నీడ నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే

నీ చెంత ఏదనీ
నీ వెంట లేదని
గతమంతా అడిగితే
నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారిపోకలా

వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే

నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే
వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే
వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా

జారకే కన్నులలో నీరులా
వెళ్ళకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా

Palli Balakrishna Monday, May 29, 2023

Most Recent

Default