Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vedhika"
Ruler (2019)



చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , వేదిక, చొనాల్ చౌహాన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాతలు: సి.కళ్యాణ్
విడుదల తేది: 20.12.2019



Songs List:



అడుగడుగో యాక్షన్ హీరో పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయిచరణ్ భాస్కరుని

అడుగడుగో యాక్షన్ హీరో  
అరె దేకొయారో అడుగడుగు తనదేమ్ పేరో 
మరి తనదేమ్ ఊరో
అడుగులలో అది ఏమ్ ఫైరో 
ఛలో సెల్యూట్ చేయ్ రో

జై కొడుతూ సీటీ మారో సెల్ఫీ లే యారో
కింగ్ ఆఫ్ ది జంగిల్ లా యాంగ్రీ అవెంజర్ లా
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా వచ్చాడు రా
చూపుల్లోనే వీడు క్లాసు 
మనసే బిసి సెంటర్ మాసు 
పక్కా వైట్ కాలర్ కార్పొరేటు లీడరు రా

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

లోకాలే తిరిగినా ఏ ఎత్తుల్లోకి ఎదిగినా
తను పుట్టిన మట్టిని వదలడు ఈ నేలబాలుడు
ఏ రాజ్యలేలినా ఏ శిఖరాలే శాసించినా
జన్మిచ్చిన తల్లికి ఎప్పుడు ఓ చంటి పాపడు

ఒకమాటలో గుణవంతుడు 
తన బాటలో తలవంచడు
ప్రతి ఆటలో ప్రతి వేటలో
అప్పర్ హ్యాండ్ వీడిదే
సక్సెస్ సౌండ్ వీడిదే...

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

అరెరే ఆ గ్లామరు అది హ్యాండ్సమ్నెస్ కె గ్రామరు
జర చూపించాడో టీజరు ఇక చూపు తిప్పరు
అమ్మాయి లెవ్వరు వీడు కంపెని ఇస్తే వదలరు
మరి తప్పదు కద ఈ డేంజరు మార్చాలి నంబరు

సరదాలకే సరదా వీడు 
సరదా అంటే అసలాగడు
సరసాలలో శృతి మించడు 
ఫన్ టైము క్రిష్ణుడు ఫుల్ టైము రాముడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు 
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడుమళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే  శృష్టిస్తాడు





పుడతాడు తాడుతాడు పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా, చాందిని విజయ్ కుమార్ షా

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
హ హ హా...
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా
హ హ హా...

హే సర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో జల్ది జల్దీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

అల్లావుద్దీన్ కే నేను అందని దీపాన్ని
నీ కోసం వచ్చేసా లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్కే దొరకని ఆపిల్ని
దర్జాగ దొరకేశ పట్టేసుకో

నువ్వు కెలికితే కెలికితే ఇట్టా
నా ఉడుకుని దుడుకుని చూపిస్తా
సరసపు సరకుల బుట్ట
నీ బరువుని సులువుగ మోసేస్తా

మిసమిస మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను ఊదేస్తా

సోదా చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

ఛాంపెను బాటిల్లో సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో
డైరక్టు అందాన్ని వాటెయడం కన్నా
అర్జెంటు పనులేంటి ఆపేసుకో

నీ ఇక ఇక పక పక వల్ల
నే రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్లా
నా ఎదిగిన వయసును పంపిస్తా

నిగ నిగ నవరస గుల్లా
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్ని 
నే టక టక లాగేస్తా

రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా...

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా

హే సర్ర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా




సంక్రాంతి పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: స్వరాగ్ కీర్తన్, రమ్యా బెహ్రా 

సంక్రాంతి 




యాల యాల పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , అనుషా మణి

యాల యాల 

Palli Balakrishna Sunday, January 12, 2020
Vijayadasami (2007)


చిత్రం: విజయదశమి (2007)
సంగీతం: శ్రీకాంత దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, వేదిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఈదర రంగారావు
విడుదల తేది: 21.09.2007

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
కలవై కలసి కథ మార్చావు
మెరుపై మెరిసి నను తాకావు

కుదురంటు లేకుంది మనసుకు
నిదరంటు రాకుంది ఎందుకు
అందర్నీ చూస్తున్నాను వింతగా
చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం
మొత్తంగా ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోకం
అటు నీవుంటే తెగ సంతోషం

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం

చంద్రుడు చేతికి అందెనా
మబ్బులు మాటలు నేర్చెనా
పువ్వులు పాటలు పాడెనా
కొండలు నాట్యములాడెనా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే
జగమంత వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్బుతమే
మాయలు చేసే మది సంబరమే

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో



******   ******   ******


చిత్రం: విజయ దశమి (2007)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: నవీన్, వసుంధరా దాస్

పల్లవి:
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే

చరణం: 1
ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ (2)
నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే

చరణం: 2
అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు (2)
సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే



Palli Balakrishna Thursday, March 22, 2018
Baanam (2009)



చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నారా రోహిత్, వేదిక
దర్శకత్వం: చైతన్య దంతులూరి
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 16.09.2009



Songs List:



కదిలే పాదం పాట సాహిత్యం

 
చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వనమాలి
గానం: శంకర్ మహదేవన్

కదిలే పాదం




నాలో నేనేనా ఏదో అన్నానా పాట సాహిత్యం

 
చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం : హేమచంద్ర ,  సైంధవి

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా...

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా...

అలా సాగిపోతున్న నాలోన 
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...

ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ
విధి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్ని
ఎదంత పదాల్లోన పలికేనా...
నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెల
మెళకువ కాని హృదయాన్ని, చిగురైపోనీ సిసిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు 
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం 

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపునా...
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా...




పదర పదర పాట సాహిత్యం

 
చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, ఖుషి మురళి

పదర పదర




మోగింది జేగంట పాట సాహిత్యం

 
చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయ ఘోషాల్

తననాన నానాన తననాన నానాన
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నను పిలిచినది పూబాట 
తనతో పాటే వెళ్లిపోతా...
ఆకాశం నీడంతా నాదేనంటోంది
అలలు ఎగసే ఆశ...
ఏ చింతా కాసింత లేనే లేదంది
కలత మరిచే శ్వాస...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

పదపదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా
తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా
ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగులు వేస్తున్నా
అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా
నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపున
ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

ఒక చలువన ఒక వెలువన జత కలిసినదో సాయం
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం
కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం
అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం
నా చుట్టూ అందంగా మారింది లోకం ఊహల్లోనైనా లేదీ నిజం
చిరునవ్వుతో ఈ పరిచయం వరమైయిలా నను చేరేనా
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా...
మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట
ఓ మనసంటోంది ఈ మాట




బాణం థీమ్ మ్యూజిక్ పాట సాహిత్యం

 
చిత్రం: బాణం (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, ఖుషి మురళి, నవీన్, హనుమంత్ రావు

బాణం థీమ్ మ్యూజిక్

Palli Balakrishna Tuesday, August 1, 2017

Most Recent

Default