చిత్రం: F3 (2022)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ ఫిర్జదా
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 28.04.2022
Songs List:
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో పాట సాహిత్యం
చిత్రం: F3 (2022)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: రామ్ మిరియాల
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
(క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో)
లబ్ డబ్ లబ్ డబ్… లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
కాసులుంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో
చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో
(రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో)
ఏ, పాకెట్ లోన పైసా ఉంటే
ప్రపంచమే పిల్లి అవుతుంది
పులై మనం బతికెయ్యొచ్చు విశ్వదాభిరామ
వాలెట్ లోన సొమ్మే ఉంటే
పాకెట్ లోకి వరల్దే వచ్చి
సలామ్ కొట్టె మామ… వినరా వేమా
అరె, గళ్ళా పెట్టెకేమో గజ్జల్ కట్టినట్టు
ఘల్ ఘల్ మోగుతుంది డబ్బు
ఏ పెర్ఫ్యూమ్ ఇవ్వలేని
కమ్మనైన స్మెలునిచ్చే అత్తరురా డబ్బూ
అరె, తెల్లా మబ్బునైనా నల్లమబ్బు చేసి
వానల్లే మార్చుతుంది డబ్బు
ఫుల్ లోడెడ్ గన్స్ ఇవ్వలేని గట్స్
లోడెడ్ పర్సు ఇవ్వదా..??
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
(క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో)
(డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో)
మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా
దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాల
అరె హ్యాకర్స్ తో పొత్తు పెట్టుకోవాలా
ఆన్లైన్ లోన అందినంత నొక్కాలా
ఎవడి నెత్తినైన మనం చెయ్యి పెట్టాల
అడ్డదారిలోన ఆస్తి కూడ బెట్టాల
ఎన్ని స్కాములైనా తప్పులేదు గోపాల
ఒక్క దెబ్బతోటి లైఫు సెటిలవ్వాల
ఏ, చేతిలోన క్యాషే ఉంటే
ఫేసులోకి గ్లో వస్తుంది
ఫ్లాష్ బ్యాకు చెరిపెయ్యొచ్చు
విశ్వదాభిరామ
పచ్చనోటు మనతో ఉంటే
రెచ్చిపోయే ఊపొస్తుంది
కుట్టదంట చీమా వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
(క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో)
(డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో)
అరె అంబానీ, బిల్ గేట్స్, బిర్లాల
లెక్కకందనంత డబ్బులోన దొర్లాల
కారు బంపర్ బంగారందై ఉండాల
కొత్తిమీరకైనా అందులోనె వెళ్ళాల
ఇప్పుడెందుకింకా తగ్గి తగ్గి ఉండాల
లక్ష బిల్లు అయితే టిప్పు డబల్ కొట్టాల
మనము ఎంత రిచ్చో దునియాకి తెలియాల
జనం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ సావాల
హే, దరిద్రాన్ని డస్ట్ బిన్ లో
విసిరిగొట్టే టైమొచ్చింది
అదృష్టమే ఆన్ ది వే రా విశ్వదాభిరామ
కరెన్సీయే ఫియాన్సీలా
ఒళ్ళో వాలి పోతానంది
రొమాన్సేగా రోజూ వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
(క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో)
రా దిగిరా నిన్ను సంచుల్లో కట్టేసి
గుడ్డల్లో కప్పేసి దాచేస్తే… దండెత్తిరా
రా దిగిరా… ఊపిరాడకుండా
చీకట్లో చెమటట్టి పోతావు
స్విస్ బ్యాంకు గోడ దూకిరా
బలిసున్న కొంపల్లో సీక్రెట్టు లాకర్లు
బద్దలు కొట్టుకుంటూ రా
నీకు ప్రాణాలు ఇచ్చేటి ఫాన్స్ ఇక్కడున్నారు
బుల్లెట్టు బండెక్కి రా
రా బయటికిరా… రా దిగిరా, రా దిగిరా
రా దిగిరా..!!!!
ఊ ఆ అహ అహ పాట సాహిత్యం
చిత్రం: F3 (2022)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాగర్, సునిది చౌహాన్, లవిత లోబో, యస్.పి. అభిషేక్
ఓ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ
నీ కోరా మీసం చూస్తుంటే
నువ్వట్టా తిప్పేస్తుంటే, ఊ ఆ అహ అహ
నీ మ్యాన్లీ లుక్కే చూస్తుంటే
మూన్ వాకే చేసే నా హార్టే, ఊ ఆ అహ అహ
ఎఫ్1 రేస్ కారల్లే… పక్కా స్ట్రాంగ్ బాడీ, ఊ
రై రైమంటూ రాత్రి కలల్లో… చేస్తున్నావే దాడి, ఆ
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్నా తగ్గట్లేదే వేడి, ఊ
దూకే లేడీ సింగంలా… నేను రెడీ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
ఫ్రెంచు వైను, ఊ… నీ స్కిన్ను టోను, ఆ
నువు ట్విన్ను బ్రదరో ఏమో మన్మథునికే
చిల్డుగున్న, ఊ… నా డైట్ కోకు, ఆ
నువ్వు టిన్నులోనే సోకు దాచమాకే, అహ అహ
కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి
క్యాండీ క్రష్షే నీతో చెకచెక ఆడేస్తా
జున్నూ ముక్క నిన్ను జిన్నులో ముంచేసి
టేస్టే చూసి జల్దీ కసకస కొరికేస్తా
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
నీ టచ్ చాలు, ఊ… ఓ టన్ను పూలు, ఆ
స్టెన్ను గన్నుతోటి… నన్ను పేల్చినట్టే, అహ అహ
నా కన్ను వేసే, ఊ… ఓ స్పిన్ను బాలు, ఆ
నీ సన్న నడుమే బాటింగ్ చేస్తనంటే, అహ అహ
అ ఆ ఇ ఈ అంటూ చక్కగ మొదలెట్టి
ఏ టూ జెడ్ నిన్నే చకచకా చదివేస్తా
జీరో సైజే చూశావంటే రాతిరికి
వంద మార్కుల్ వేస్తావ్ పదా పదా గదికి
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ… ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే… ఊ ఆ అహ అహ
లైఫంటే ఇట్టా ఉండాల పాట సాహిత్యం
చిత్రం: F3 (2022)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి
అధ్యచ్చా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
హాత్ మే పైసా… మూతి మే సీసా
పోరితో సల్సా… రాతిరంతా జల్సా
ఆయిరే పూజ… ముళ్ళు లేని రోజా
తియ్యి దర్వాజా… పార్టీ మే లేజా
డోరు ఖోల్ కే… కార్లో బైట్ కే
గేరు డాల్ కే… తీస్కపోతా నిన్ను హెవెన్ కే
ఆస్మాన్ మీదికే… తాడు ఫేక్ కే
మబ్బు తోడ్ కే… మూన్ తేరా బొట్టు బిళ్ళకే
అధ్యచ్చా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
(చెంతలో… చెంతలో)
పిట్ట గోడ మీద పెట్టే
పిచ్చాపాటి ముచ్చట్లే
చైనా వాల్ మీద
చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం
అయ్యంగారి కొట్టు లోన
కొట్టే చాయే పక్కనెట్టి
ఈఫిల్ టవర్ మీద ఐసు టీ కొట్టేద్దాం
హే, తాజ్ మహల్ కే
రంగుల డాల్ కె
వాలెంటైన్ రోజుకే
గిఫ్టులిస్తా నా రాణికే
ఈజిప్ట్ లేజాకె
పిరమిడ్స్ మీదికే
జారుడు బండలే
జారిపిస్త నా బేబీకే
అధ్యచ్చా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
అధ్యక్షా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
వరల్డ్ లోన ఉన్న మొత్తం
గోల్డునంత తెప్పించి
స్విమ్మింగ్ పూల్ కట్టి
మామ అటు ఇటు ఈదేద్దాం
హే, స్విట్జర్లాండ్ లోని మంచుని
షిప్ లో వేసి రప్పించి
రాజస్థాన్ ఎడారిలో నింపి
స్కేటింగ్ చేసేద్దాం
హే, షార్జాహ్ గ్రౌండ్ మే
డే అండ్ నైట్ మ్యాచ్ మే
డైమండ్ రాళ్లతో
గోళీలాడుదాం ఎంచక్కా
లండన్ బ్రిడ్జికే
కళ్ళు కుండల్ బాంద్ కె
బోనాల్ పండుగకే
జాతర చేద్దాం జజ్జనక
అధ్యక్షా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
అధ్యచ్చా..!
లైఫంటే మినిమం ఇట్టా ఉండాల
అధ్యచ్చా..!
లైఫ్ ఫ ఫ ఫట్ అంటే
మినిమ్ మిన్ మిన్ మిన్ ఇట్టా ఉండాల