Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Valluripally Ramesh"
Asadhyudu (2006)


చిత్రం: అసాధ్యుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఆర్ యకేందర్
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్,  దియా
దర్శకత్వం: అనీల్ కృష్ణ
నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు
విడుదల తేది: 16.02.2006

రక్కసి కోరలు చాచిన రౌడిమంది ఒకవైపు
శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు
ఆ చూపుల చింతనిప్పు  దుర్మార్గులకుంది ముప్పు
ఆ అడుగుల పిడుగుపాటు  దుండగీళ్ళ ఆట కట్టు

అదరడు బెదరడు చెదరడు
బిగిసిన పిడికిలినొదలడు
అతనొక అనుపమశూరుడు అసాధ్యుడు

అలసట ఎరుగని యోధుడు
అపజయమెరుగని విజయుడు
అసురుల కూల్చకమానడు అసాధ్యుడు

రక్షణ చేయు నృసింహుడు
రాక్షస కేళి సహించడు
దుర్జనశేషములుంచడు అసాధ్యుడు

సహనము తెలిసిన బుద్దుడు
సమరము నిలిచిన భద్రుడు
సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు

సమయము స్థలమిక చూడడు
కదనము అతనికి చెడుగుడు
శత్రుశిరస్సులనొదలడు అసాధ్యుడు

కనపడి దుడుకుగ సాగడు
తలపడి వెనకడుగెరగడు
తలచిన గురినిక వదలడు అసాధ్యుడు

కరుణతొ కరిగిన వరుణుడు
కొలిమిగ రగిలిన అరుణుడు
వీడు దహించక మానడు అసాధ్యుడు

అతడే అనితరసాధ్యుడు
అతడే అభినవ పార్ధుడు
అతడే అతడే అతడే అసాధ్యుడు

Palli Balakrishna Thursday, November 16, 2017
Avunu Valliddaru Ista Paddaru (2002)




చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, కళ్యాణి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు
విడుదల తేది: 02.08.2002



Songs List:



వెన్నెల్లో హాయ్ హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: చక్రి

హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

చరణం: 1
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన
వదల తరమా మదికి వశమా చిలిపి తనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

చరణం: 2
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికే ం చెప్పాలి ఏం చేయాలి
అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస
మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ
మంచి పద్ధతంటూ ఉందిమదిని లాగుతున్నది
ఎంత ఎంత వింతగున్నదీ
వెన్నెల్లో హాయ్ హాయ్
మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి



రా రమ్మని పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కౌసల్య, యస్. పి. బాలు

రా రమ్మని రారా రమ్మని... 
రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా 
మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా 
చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో 
మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో 
కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో

రా రమ్మని రారా రమ్మని... 
రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం: 1
పెదాల్లో ప్రథమ పదము నువ్వే 
ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే 
జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా
ఇదేగా ప్రేమపండుగ...

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం: 2
ఫలించే పడుచు ఫలము 
నీకే బిగించే కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే 
శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా
సుఖిస్తాను నీ పంచన...

రా రమ్మని రారా రమ్మని... 
రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా 
మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా 
చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో 
మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో...



నాలో నేను లేనే లేను పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: సందీప్, కౌసల్య

హే...లాలా హే...లాలా
లాలా లల లలలా లాలా లల లలలా
లాలా లల లలలా లాలా లల లలలా
నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

మొన్నా నిన్నా తెలియదె అసలూ
మొన్నా నిన్నా తెలియదె అసలూ
మదిలోన మొదలైన ఈ గుసగుసలూ
ఏం తోచనీకుంది తియ్యని దిగులూ
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కోరిన వరమా
ఎందాక సాగాలి ఈ పయనాలూ
ఏ చోట ఆగాలి నా పాదాలూ

నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

ఎన్నో విన్నా జంటల కథలూ
ఎన్నో విన్నా జంటల కథలూ
నను తాకనే లేదు ఆ మధురిమలూ
కదలించనే లేదు అలలూ కలలూ
గత జన్మలో తీరని ఋణమా
నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసతో నిన్ను పెంచిందేమో

నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా




పొగడ మాకు అతిగా పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: యస్. పి. బాలు, కౌసల్య

పొగడ మాకు అతిగా
చేసేయ్యమాకు పొగడ పూల లతగా
రాసినావు చాల ఆ రాతలంత నేను ఎదిగి పోలా
నువ్వని వచ్చింది నా నోట చనువుగ
పిలుపులు తడబాటు ఆ మాట పలుకగ
తెకుసుకుంది పొరపాటు

నువ్వు అంటు పిలుపు
నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు
దాచేసుకున్న మాటలన్ని తెలుపు
చిగురులె వేసేన ఈ కొమ్మ హొయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చదవగ
ఊహాలే ఉదయించే...

నువ్వు అంటు పిలుపు
నాకెంతో నువ్వు దగ్గరైన తలపు




సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: చక్రి , కౌసల్య

జింగిలాల  జింగిలాల (8)

సీతాకోక చిలుక సోయగాల చినుకా
ముద్దు ముద్దు గున్నవే నువ్వు
ఓసి కన్నె గోపికా తుళ్ళి తుళ్ళి పడక
కొంగుముడి వేసుకో నువ్వు
కోనిక కెమెరా లో బందీలే అవుదామా
కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా

జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ
జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ

సీతాకోక చిలుక
సోయగాల చినుకా
సీతాకోక చిలుక సోయగాల చినుకా
ముద్దు ముద్దు గున్నవే నువ్వు
ఓసి కన్నె గోపికా తుళ్ళి తుళ్ళి పడక
కొంగుముడి వేసుకో నువ్వు

ఓ రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి
నింగిని చూసేద్దామా
జాబిలమ్మను చేరి జోల పాడేద్దామా
చేపలనడిగి మొప్పలు తెచ్చి ఈతలు కొట్టిద్దాము
సాగరాలే దాటి సాటిలేరందామా
మొదటి చూపుకే అలలా పుట్టుకొచ్చు ఈ ప్రేమ
చివరివరకు ఊపిరిగా తోడు ఉండదా ప్రేమ
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
పంచ వన్నెల చిలక రెక్కపై పచ్చతోరణం ప్రేమ
తామరాకుపై నీటి బొట్టులా తళుకు మంటదీ ప్రేమ

సీతాకోక చిలుక
సోయగాల చినుకా
సీతాకోక చిలుక సోయగాల చినుకా
ముద్దు ముద్దు గున్నవే నువ్వు
ఓసి కన్నె గోపికా తుళ్ళి తుళ్ళి పడక
కొంగుముడి వేసుకో నువ్వు

ఓ వాన జల్లులో దోసిలి పట్టి గజ గజ వనికేద్దామా
పడవల బొమ్మలు చేసి చిటుకున వదిలేద్దామా
చిరుతల వేగం అరువుకు అడిగి గబ గబ ఉరికేద్దాము
ఊరులన్ని తిరిగి జోరు చూపేద్దామా
రెండు గుండెల నడుమ రాయభారమీ ప్రేమ
నిండు కుండలా ఎపుడు తొణికి పోదులే ప్రేమ
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
కోనసీమలో కొబ్బరాకులా ముద్దుగుంటది ప్రేమ
అరకులోయలో చిలిపి గాలిలా కుమ్ముకుంటది ప్రేమ

సీతాకోక చిలుక
సోయగాల చినుకా
సీతాకోక చిలుక సోయగాల చినుకా
ముద్దు ముద్దు గున్నవే నువ్వు
ఓసి కన్నె గోపికా తుళ్ళి తుళ్ళి పడక
కొంగుముడి వేసుకో నువ్వు
కోనిక కెమెరా లో బందీలే అవుదామా
కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా

జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ
జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ
జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ
జింగి చక ఆ జింగి జింగి చక
ఆ జింగి జింగి చక ఆ జింగి జింగి చక చ




ఎన్నెన్నో వర్ణాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: యస్. పి. బాలు, కౌసల్య

ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే
బాటలు వీడక మీరు సాగిపోండిక
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా

ఎన్నెన్నో వర్ణాలు

నేనంటు ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి
బాగుంది మీ టేస్ట్ నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకనే దిగివచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
అందుకనే దిగివచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే

నేనంటు ప్రత్యేకం నా దంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి




మది నిండుగ మంచితనం పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: యస్. పి. బాలు, కౌసల్య

మది నిండుగ మంచితనం
అది మమతల మంచుతనం
వలికించిన తియ్యదనం
తలవంచని నిండుదనం
చిగురించే నయనం
ఫలియించే పయనం
ఇక నీతో జీవనం

నువు పంచిన చల్లదనం
సిరి మల్లియ తెల్లదనం
సిరసొంచను వెచ్చదనం
పులకించెను పచ్చదనం
వికసించే కిరణం
విరబూసే తరుణం
చిందించే చందనం

నువు పంచిన చల్లదనం
సిరి మల్లియ తెల్లదనం




ఏమి ఈ భాగ్యము నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: కౌసల్య

ఏమి ఈ భాగ్యము నేస్తమా
ఏమి ఈ భాగ్యము నేస్తమా
నీళ్లే నిండగా ఆ ఎండే పండగా
ఈ వేసవే కోమలం సీతలం
ఆ చల్లని చంద్రుని మండలం
ఈ మందిరం సుందరం మందళం
ఆ అంబరం సంబరం సంగమం

ఏమి ఈ భాగ్యము నేస్తమా




నూజివీడు సోనియా పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: రవివర్మ

పల్లవి:
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా

చరణం: 1
హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా
హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా
నుడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా
స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా
బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వ స్తను పిల్లో
తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా

చరణం: 2
కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా
కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా
దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా
మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా
నువ్వెసయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనెపిల్లా
రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా




ఓ నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: యస్.పి.బాలు, కౌశల్య

ఓ నేస్తమా 



ప్రేమ గెలుపు పాట సాహిత్యం

 
చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: కౌశల్య

ప్రేమ గెలుపు

Palli Balakrishna Thursday, July 27, 2017
Ashok (2006)



చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డి
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
విడుదల తేది: 14.07.2006



Songs List:



గోల గోల రంగోల పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవి వర్మ , సుజాతా మోహన్ 

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
ఓ పువ్వుల బాల

గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా
వేలా వేవేల విరహాల తెర దించాల
నీలా నవనీలా మువలీల జరిపించాలా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా 

తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన

ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా

అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
వింటున్న ప్రియమైన  నీ ఆలాపనా వింటానే ఇకపైన కసిప్రేలాపనా
సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా





నువ్వసలు నచ్చలే పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ , చిత్ర 

నువేసుకున్న డ్రెస్సు నచ్చలే




ఏకాంతంగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా 
నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా 
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా ఎద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా 
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా 
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా...




ఒక చిన్ని నవ్వే నవ్వి పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: KK

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)
చిరునవ్వుల దీపం వెలిగించూ… నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ… శత్రువులే ఉండరు గమనించూ

మనిషన్నోడే మనసారా… తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని… కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును… చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ…

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా… పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా… అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి… నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి… ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు… నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు… పది మందికి నువ్వే చాటించూ

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ… కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి…కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి… మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి… ధైర్యం చూపెట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ… ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ… సంచలనం నువ్వే సృష్టించు

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)




జాబిలికి వెన్నెలనిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, శ్రీ వర్ధిని

జాబిలికి వెన్నెలనిస్తా



ముంతాజ్ మహల్ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవన్ ఏకాంబరం, తన్విషా

ముంతాజ్ మహల్  కట్టించాడే షాజహాను 

Palli Balakrishna Wednesday, July 12, 2017

Most Recent

Default