Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vakkantham Vamsi"
Extra Ordinary Man (2023)



చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
నటీనటులు: నితిన్, శ్రీలీల 
దర్శకత్వం: వక్కంతం వంశీ 
నిర్మాత: యన్.సుధాకర్ రెడ్డి, నితిన్ రెడ్డి 
విడుదల తేది: 23.12.2023



Songs List:



డేంజర్ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అర్మాన్ మాలిక్

అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా
చీకట్లో తిరగని మిణుగురు తలుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా

కలలు కనదట.. కన్నెత్తి కనదట
కరుకు మగువట, హొయ్
నగలు బరువట… గుణమే నిధి అట
ఎగిరి పడదట, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా
హార్టే మాయం చేసావెల్లా?

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా

అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే

హో ఓ నచ్చిందే చేస్తుంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా, హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా, హోయ్

డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెల్లా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా, మునుపులా

ఓ ముద్దు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే

అమ్మాయి హగ్గిస్తావా
దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే

రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ

ప్రేమ ప్రేమ… రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నా
చాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నా
సరిపోతుందా నాకో జన్మా

పెట్టెయ్ పేరేదైనా
పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే
అంతం చేసే హంతకీ

డేంజర్ పిల్లా పిల్లా
ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా
హార్టే మాయం చేసావెళ్ళా

టచ్చే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా
ఓహొ హో ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
అరె నువ్వొచ్చాక
ఏదీ లేదే మునుపులా



బ్రష్సే వేస్కో పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: సంజిత్ హెగ్డే

ఎట్టా చూస్తావ్ ఎగ్గులోని
చికెన్ చికెను
ఫట్టా ఫట్టని ఎట్టా
చూపగలను చూపు

అయ్యానిపుడే లైఫులోకి
లాగిన్ లాగిను
రెసిల్టెంటాని పెట్టమాకు
టెన్షన్ టెన్షను

నేనేంటో ఏమవుతానో
నాకేగా తెల్సు
ఏ నోళ్లు ఏమన్నా
తగ్గదంట ఫోర్సు

దిల్ అంతా డల్ అయ్యేలా
ఎన్నో కామెంట్సు
డీల్ పిక్ చేయందే
నెగ్గదంట రేసు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

ఐన్‌స్టీన్ అయినా అబ్దుల్ కలాం
అయినా అయినా
గొప్పోళ్ళయ్యే ముందు
ఒక్కసారైనా అయినా

పక్కా వాళ్ళ డాడీ తిట్టుంటాడ్రా
నాయనా నాయనా
ఏందీ పనులని చెప్పుంటారు
శానా శానా

గజినీలా కింద మీద పడితే
ఏం తప్పు తప్పు
ఏంటో ఆ కంగారేంటో సక్సెస్
అయ్యేలోపు లోపు లోపు

వద్దన్నా పడిపోతాందే
ఫెయిల్యూర్ నలుపు నలుపు
తుడిచేయకుంటే దాన్ని
రాదు కధా గెలుపు

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

పుట్టే జిందగీలన్నీ
డిట్టో బాట పట్టాలా
సేమ్ టు సేమ్ లెక్కల్లో
చేరి క్యూ కట్టాలా

ఏ కల నేను చూడాలో
వేరే వాళ్ళు చెప్పాలా
నవ్వే లేని నవ్వులో
నన్ను దాపెట్టాలా

మనకిష్టమైనదేదో కష్టపడి చేరుకునే
ఆలోచనైనా చెయ్యొద్దా
అంతో ఇంతో మనం కూడా
కాలర్ ఎత్తి చెప్పుకునే
సొంత హిస్టరీ రాయొద్దా

అరె వాళ్ళు వీళ్ళు చెప్పేదేంది
నీ దారేదో నువ్వే చూస్కో
హే మామ హే మామ
హే మామ మామ మామ

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో

హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో




ఒలె ఒలె పాపాయి పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, ప్రియా 

హేయ్ హేయ్ హేయ్ హెయ్
ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

హెయ్ హెయ్ హెయ్

ఓసి కీసుపిట్ట నువ్వు కాపుకొచ్చే పంట
కోరమీసమెట్టి నిన్ను కోసుకుంటా
ఓరి కోడెగిత్త ఈ కుమ్ములాట కొత్త
కావాలనే ఉంది కూసింత

ఒడిసెల రాయిలెక్క
ఇసరకే సూపులట్ఠా
నడుమును తాకుతుంటే
సరిగమలొచ్చెనటా

పెదవికి నేర్పిస్తా ప్రేమా
హోయ్

రాక రాక కోకిలొస్తే ఊరు కావ్ కావ్
ఓ కేకే పెట్టే సోకులన్నీ నీవి కావ్ కావ్

కొక రైక కాకరేపే సూడు కావ్ కావ్
ఈ చీకటింట సిగ్గులన్ని నావి కావ్ కావ్

ఒలె ఒలె పాపాయి
పలాసకే వచ్చెయ్యి

గుంట చూస్తె పూలగుత్తి
గుంటడేమో ఏట కత్తి
అంటుకుంటె అత్తి పత్తి
అంటుకుంది అగరుబత్తి

ఊరుకోదు నీ చెయ్యే
ఇచ్చావురా రావోయి

ఆపమాకే రంగబోతి
పెట్టమాకే బుంగమూతి
ఆరుమూరలుంది చాతి
ఆడుకోవే నువ్వు బంతి

ఒంపు చూస్తే ఒరిస్సా
ఊపుతానే హైలెస్స

తియ్యగుంది నీ హింసా
కన్నె దిల్లులో ధింసా

రయ్యిమని రాయే రాయే హంసా

ఎర్ర ఎర్ర ఎర్రగున్న
కొర్రమీనురో హెయ్
ఇది జర్ర జర్ర జారిపోయే
కుర్రమీనురో హెయ్

గర్ర గర్ర గర్ర గర్ర
గర్రమైతరో హెయ్
నీ కుర్ర బుర్ర జోరు
సూత్తె గుర్రమైతరో హెయ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్

కావ్ కావ్ కావ్ కావ్
ఊరు కావ్ కావ్
కావ్ కావ్ కావ్ కావ్
నీవి కావ్ కావ్





చిరాకు తాండవం పాట సాహిత్యం

 
చిత్రం: Extra Ordinary Man (2023)
సంగీతం: హరీష్ జయరాజ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
గానం: రామ్ మిరియాల

చిరాకు తాండవం 

Palli Balakrishna Sunday, October 8, 2023
Naa Peru Surya (2018)



చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
నటీనటులు: అల్లు అర్జున్, అనుఇమాన్యుయేల్ , అర్జున్ సార్జా
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాతలు: శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు, కె.నాగబాబు
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
విడుదల తేది: 27.04.2018



Songs List:



ఓ సైనిక పాట సాహిత్యం

 
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విశాల్ దద్లాని

సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటినిండుగా
నిదురపోదురా నిదురపోదురా
నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే
జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవక ఓ సైనిక
పనిలో పరుగే తీరిక ఓ సైనిక
ప్రాణం అంత తేలిక ఓ సైనిక
పోరాటం నీకో వేడుక ఓ సైనిక

దేహంతో వెలిపోదే కథ
దేశంలా మిగులుతుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనిక
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనే
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది
నీ శక్తిని నమ్మింది

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనిక
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బ్రతుకే వందేమాతరం ఓ సైనిక
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక




i am lover also fighter also పాట సాహిత్యం

 
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ - శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శేఖర్ రవ్జియాని

అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే

గురిపెడుతూ చూపులతోనా నువు పేల్చకె బొమ్మ తుపాకీ
సరిహద్దులు తెంచుకురానా నే నీ జిందగీలోకీ
i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
నొ సెప్పి కూర్చున్న నీ హార్టు బుక్కు పై
love story మల్లి రాసె writer also
i am lover also fighter also

ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చేశావని వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చలో చెరో సగం తప్పుగా
మరో కతై కలుద్దామ కొత్తగా
flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో
patchup అవదానికెంత చాన్సో
i am lover also fighter also

ఆ ఇను ఇనవే హేయ్ హేయ్ మాట వినవే మంచి పిల్లవే
సిన్న గొడవే హేయ్ హేయ్ సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగదెంపులుగా ఎల్లిపోకే break up లోకీ
గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ

i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
సీకట్లొ దాక్కున్న నీలోని ప్రేమని
పట్టుబట్టి బయటపెట్టె lighter also
i am lover also fighter



బ్యూటిఫుల్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం:‌ నాపేరు సూర్య (2018)
‌సం‌గీతం:‌ విశాల్ శేఖర్
సాహిత్యం:‌ సిరివెన్నెల
‌గానం:‌ అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి
‌
పెదవులు దాటని పదం పదంలో
కనులలొ దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికె స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ
ఏం జరగనుందో ఏమో ఈపైనా

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్

నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో
నా తలపె వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్




మాయ మాయ పాట సాహిత్యం

 
మాయ మాయ 



ఎన్నియల్లో ఎన్నియల్లో పాట సాహిత్యం

 
ఎన్నియల్లో ఎన్నియల్లో  ఎన్ని నాళ్ళకి 



ఇరగ ఇరగ పాట సాహిత్యం

 
ఇరగ ఇరగ

Palli Balakrishna Wednesday, January 31, 2018

Most Recent

Default