Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tanya Hope"
Idhe Maa Katha (2021)



చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీజిత ఘోష్ , తన్య హోప్, భూమిక, శ్రీకాంత్
దర్శకత్వం: గురు పవన్
నిర్మాత: మహేష్ గొల్ల
విడుదల తేది: 19.03.2021



Songs List:



ప్రియా ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: సునిల్ కశ్యప్, హరిణి

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే
మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి, ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

నిన్న మొన్న నా కలలో నువ్వెప్పుడూ రాలేదే
నిన్నూ నన్నూ కలిపేసే నిజం ఇలా బాగుందే
ఇన్నాళ్ళు మోసా నా ప్రాణం
ఈరోజే చూశా దానందం
నాలో ఉండని ఓ మనసు
నిన్నే చూశాకే తెలుసు
నేర్పింది ప్రేమే నీ ఊసు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్నిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా
గపగరిసా గప గప గరిసా

చిన్ని చిన్ని ఆశలతో చిగురిస్తూ నీ బంధం
నన్నే నేను వదిలేసి అయిపోయా నీ సొంతం
నీతోడే చూస్తూ ఈ లోకం ఇంకెంతో బాగుందీ అందం
లోలో తీసాలే పరుగు నీవైపేసేలా ఆ అడుగు
వేస్తున్నా ఎదపై నీ ముసుగు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే
తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

మనసంతా చేరి మార్చావే దారి
దారే మారి, ప్రియా ప్రియా ప్రియా ప్రియా
యే సిల్సిలా తూనే కియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
తూ జానేమన్ ఓ సాథియా





కలలా కథ మొదలవతోంది పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: విష్ణు ప్రియ 

కలలా కథ మొదలవతోంది
అలలా ఎద ఎగురుతూంది
మనసే నిను కలవక ముందే ఏదో తొందర
క్షణమే తెగ నస పెడుతోంది
అడుగె నిను కలవమనంది
నడిచిన ప్రతి దారి నీదిరా
ఏమో ఏమో ఏం చేసావో గుండెను కలబడి
నాలో నిన్నే ఊహించాను ఒంటిగా నిలబడి
ఈ ప్రేమంటే సంద్రమంత… మనసేమో ముత్యమంత
ఇటు దాచుకుందో వింత… కోరాక నిన్ను జత

చూపుతో పంపనా… కళ్ళలో ప్రేమని
మౌనమే నింపనా… మాటలే నీవని
తిడుతు తీయగ పడమంటావా
అలకలు పోయినా బ్రతిమాలాలిగా
ఈ ప్రేమంటే సంద్రమంత… మనసేమో ముత్యమంత
ఇటు దాచుకుందో వింత… కోరాక నిన్ను జత
కసిరినా కొసురుతూ… కబురులే చెప్పుకో
తప్పు నే చేసినా… నీదని ఒప్పుకో
తోడై నీడగా నాతో ఉండిపో
నేనేం చేసినా… నీలా చూసుకో



Just Go for It పాట సాహిత్యం

 
Song Details




కన్నుల్లో కలలుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇదే మా కథ (2021)
సంగీతం: సునిల్ కశ్యప్
సాహిత్యం: మంగు బాలాజి
గానం: యజిన్ నిజార్

ఓ ఓ, కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
నువ్వెవ్వరో నేనెవ్వరో… స్నేహాన్నిలా ముడేద్దాం
నవ్వేందుకే పుట్టామని… ప్రపంచమే చాటేద్దాం

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం
ఓ, నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం
ఓ వ్, నీతో నువ్వుంటే… మనసునైనా మరచిపోవా
నీలో ప్రేముంటే… నిను నువ్వే వదులుకోవా
కధ నడవదు ఎపుడూ… నువ్వనుకొను దారిలో
చిరు అలజడి ఉండదా… ఈ బ్రతుకను తీరులో

కన్నుల్లో కలలుంటే వెతికేద్దాం, ఓ ఓఓ
నిన్నల్లో కలతల్నే వదిలేద్దాం, ఓ
లైఫే ఒక వింత… ఉరకలేద్దాం బ్రతికి చూద్దాం
లోకం మనసెంతో అడిగి చూద్దాం, కలిసిపోదాం
ప్రతిచోటొక గమ్యం… ఎవరెవరికో సొంతం
మన గెలుపుకు సూత్రం… ఇక మరువకు నేస్తం

Palli Balakrishna Thursday, October 28, 2021
Appatlo Okadundevadu (2016)
చిత్రం: అప్పట్లో ఒకడుండేవాడు (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: శ్రీ విష్ణు , నారారోహిత్, తన్య హోప్
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
విడుదల తేది: 30.12.2016

Palli Balakrishna Sunday, February 28, 2021

Most Recent

Default