Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sreedhar Surapaneni"
America Ammayi (1976)





చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
నటీనటులు: రంగనాథ్, దీప, శ్రీధర్ సూరపుణేని
కథ: ఎ. పి.నాగరాజన్
మాటలు: గొల్లపూడి మారుతీరావు
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస్
నిర్మాత: 'నవత' కృష్ణంరాజు
విడుదల తేది: 19.11.1976



Songs List:



ఆమెతోటి మాటుంది పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు

హే...రూరూ రూ.... తూరూరు.....రూరూరు

పల్లవి : 
ఆమెతోటి మాటుంది పెదవి దాటి రాకుంది
ఏమున్నదో ఆ చూపులో

చరణం: 1 
చిరుగాలి తరగల్లె నడకలు నేర్చిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
నవ్వు నన్ను పిలిచింది. కళ్ళతోటి కాదందీ
దట్స్  లవ్...లవ్....లవ్....లవ్....

చరణం: 2 
తనకైన లోలోన అశగ వుంటుందీ
పై పైకి నాపైన అలకలు పోతుందీ
మనసు తెలుపనంటుందీ మమత దాచుకుంటుందీ
దట్స్ లవ్...లవ్....లవ్....లవ్....




ఆనంద తాండవమాడే పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల 

ఆనంద తాండవమాడే



జిలిబిల సిగ్గుల పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం 

ఆహా....ఆ....ఆ...ఆ....ఆ....
అహ....ఆహ... అహ....అహ....
జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
ఆడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ.. ఓ... ఓ... బెదురును చేరెను చిలకమ్మా

కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోసల కోయిల పాడెను సంగీతం
మధువులు అనుచు మత్తుగ పాడుచు
తుమ్మెద ఆడెను సల్లాపం.. .
జిలిబిలి సిగ్గుల-చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురును చేరెను చిలకమ్మా
ఓ.. ఓ... ఓ... బెదురును చేరెను చిలకమ్మా

పచ్చనిపసరిక పానుపుపరిచెనుపొదరింట్లో
వెచ్చనివలపుల ముచ్చటతీరగ
తనువులు కరిగెను కౌగిట్లో . ఓ ..ఓ....ఓ. . .
గలగల పారుచు కిలకిల నవ్వెను సెలయేరు
తొలి తొలి కలయిక జంటను చూసి
దీవించినదీ ప్రతి ఆణువు ... ఊఁ . . .ఊ ...,




ఒక వేణువు వినిపించెను పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: జి.ఆనంద్

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక




పాడనా తెలుగు పాట పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: సుశీల 

పాడనా తెలుగు పాట 
పాడనా తెలుగు పాట 
పరవశమై  మీ ఎదుట..మీ పాట
పాడనా తెలుగు పాట 

కోవెల గంటల గణ గణలో గోదావరి తరగల గలగలలో (2)
మావులు తోపుల మూపులుపైన  మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట.. మధురామృతాల తేట

ఒక పాట..పాడనా తెనుగు పాట
పరవశమై..నే పరవశమై.. మీ ఎదుట..మీ పాట

త్యాగయ్య..క్షేత్రయ్య..రామదాసులు
త్యాగయ్య..క్షేత్రయ్య..రామదాసులు

తనివితీర వినిపించినది
నాడునాడులా కదిలించేది
వాడ వాడలా కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట

ఒక పాట..పాడనా తెలుగు పాట

ఒళ్ళంత ఒయ్యారి కోక..కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత ఒయ్యారి కోక..కళ్ళకు కాటుక రేఖ

మెళ్ళో తాళి..కాళ్ళకు పారాణి..
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్ల నల్లన నడయాడే
తెలుగు తల్లి పెట్టని కోట..
తెలుగు నాట ప్రతిచోట

ఒక పాట..పాడనా తెలుగు పాట




Tell Me, Tell Me, పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, జానకి 

పల్లవి: 
ఓ టెల్ మి.. . బెల్ మి.. .. చెలిమి. ..ఆస్క్ మి బేబి
డుయు లవ్ మి....లవ్ మి....లవ్ మి లవ్ మి సర్టేన్లి స్వీట్ -హార్ట్
డోంట్ లీవ్ మి ... లీవ్ మి. ... లీగ్ మి
కామన్.... కామన్.... కామన్....కామన్....కామన్....
చాటు చేయవద్దు నీ అందాలు
వేస్ట్ చేయవద్దు  నీ సరదాలు
చేయి చేయి కలుపు. నీ హాయి ఏమొ తెలుపు
నీ మనసంతా నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దాం-కవ్వించి నవ్వుకుందాం
ఈ రేయి మనం ఒళ్ళు మరచిపోదాం - టెల్ మి టెల్ మి
వేయలేవు గాలికేమొ సంకెళ్ళు
ఆపలేవు పడుచుదనం పరవళ్ళు  (వేయలేవు)

ఈ సిగ్గు నీకు వద్దు అహ లేదు మనకు హద్దు
ప్రతి వలపు  జంట లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు-ఈ సుఖము తప్పుకాదు
ఈ పరదాలకు సరిసాటే లేదు.కమాన్ కమాన్ కమాన్ 



డార్లింగు లింగు లిటుకు పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేష్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: రమేష్, వసంత 

డార్లింగు లింగు లిటుకు ఆ మాటకు ఏమిటి కిటుకు
మిస్సమ్మా నువు నా కిస్సమ్మా
డార్లింగు ఆంటే ప్రియుడు  - వాడే అవుతాడు మొగుడు
చంటయ్య పిప్పర మెంటయ్య
తానో తందాన తాన తానో తందాన తాన
తానో తందాన తాన తానో త దాన తాన తందానో.. తానో తందాన
నా పేరు  జెల్లీ నీతో పెళ్ళి తొడగాలి రింగు అదేవెడ్డింగు (నా పేరు జెల్లీ)

బాజాలు మోగొద్దా బంధూలు రావొద్దా
జీలకర్ర పెట్టొద్దా నే తాళి కట్టొద్దా
ఆఁ సింగినాదం జీలకర్రా ఎందుకూ
అవును ఎందుకు దండగ...తానో తందాన తాన
డార్లింగు లింగు లిటుకు 
డార్లింగు అంటే ప్రియుడు 

అందాల పెళ్ళాం-ఆహ తాటి బెల్లం
అలిగితే మాత్రం అవుతుంది అల్లం  (2)

చెప్పింది వింటావా నా తోటి ఉంటావా
కోరింది. కొంటావా. . పెట్టింది తింటావా 
నువ్వు నా మెగుడివా....పెళ్ళామా  డార్లింగు లింగు లిటుకు!
నో నో నో నో ఇద్దరం బాసులం దాసులం 

Palli Balakrishna Monday, March 4, 2019

Most Recent

Default