Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shivani Rajasekhar"
Kota Bommali PS (2023)



చిత్రం: కోటబొమ్మాళి (2023)
సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ 
నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్ 
దర్శకత్వం: తేజా మార్ని
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
విడుదల తేది: 24.11.2023



Songs List:



లింగ్ లింగ్ లింగ్ లింగిడి పాట సాహిత్యం

 
చిత్రం: కోటబొమ్మాళి (2023)
సంగీతం: మిధున్ ముకుందన్
సాహిత్యం: పి.రఘు 
గానం: పి.రఘు

తరినాన తరినాన
తాని తందన నానా
తరినాన తరినాన
తాని తందన నానా

ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమిది
కుసుమిది పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు

నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా

నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ రఘన్న వచ్చి పాటపాడితే
నిన్న వచ్చి నాట్యమాడితే
నారాయణరావు స్టెప్పులేస్తే
నాయుడన్న వచ్చి మొగలేస్తే
పాట మొత్తం ఊపే
తరువాయి పూసిన వంకాయ బద్ద
బ్యాటరీకాలు టైకుటుయి
గాబి గిబి సుర్రు సుర్రు

తాననా తనినానా
తాని తందన నానా
తాననా తనినానా
తాని తందన నానా

ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ

తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని
తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని

ఉట్టయ్య ఉట్టో ని నిమ పీలి ఉట్టి
ని శాసన పిలి బట్టి
ని జింగిడి పీలి పెట్టి
ని ఎండూ గొలుసుల పెట్టీ

తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని
తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని

నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమిది
కుసుమిది పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
హిరమండలం గుర్తులు



కోటబొమ్మాళి పాట సాహిత్యం

 
చిత్రం: కోటబొమ్మాళి (2023)
సంగీతం: రంజిన్ రాజ్ 
సాహిత్యం: రాంబాబు గోసాల  
గానం: Benedict Shine,Ranjin Raj

ఉత్తరాంధ్ర ఊపేసేలా
సీకాకుళం సిందేసేలా
పలాసోల్లె పొంగిపోయేలా
టెక్కలి టెక్కే చుక్కలంటేలా
కాశీబుగ్గే మురిసేలా
కొత్తపేటే దునికిపోయేలా

కోట బొమ్మ, కోట బొమ్మ
కోటబొమ్మాలంటా
కొత్తమ్మ తల్లే కొలువై ఉన్న
కోటబొమ్మాలంటా
ఏటా ఏటా జాతర జరిగే
కోటబొమ్మాలంటా

సూడు చూడు చిత్రం చూడు
ఎన్నికలే వచ్చాయి చూడు
జెండాలే మోసుకుంటూ
జిందాబాదులే కొట్టుకుంటూ
ఖద్దరు చొక్కాలే తొడుక్కుంటూ
కల్లబొల్లి హామీలిస్తూ

దండలేసుకొని దండాలెట్టే
దండే వచ్చేనంటా

అమ్ముడుపోయేటి ఓటర్లే ఉండగా
లీడర్ల తప్పెంటిలే తప్పేంది
డబ్బులు ఎవరికి చేదని వాదించు
ఓటర్లకెల్తాయిలే ఇది కరెక్టే

రెక్కాడితే గాని
డొక్కాడనటువంటి
పేదోడి బతుకెప్పుడు మారధే

కొత్తమ్మా తల్లే కోటబొమ్మలిని
కాపాడుకోవాలిలే
అవును నిజమిదే

ఎవడు గెలిచినా ఎవడు ఓడినా
ఒరిగేదేమి లేదంట
చివరాఖరికి సామాన్యుడికి
మిగిలేది చిప్పేనంట

అయిదు వందలే జేబులోపెట్టే
క్వార్టర్ బాటిల్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
బిర్యాని పొట్లం ముందరబెట్టే
బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టే
పార్టీ గుర్తే పోస్టర్ గొట్టే
వీధి వీధికి ఫ్లెక్సీలు పెట్టె

మైక్ సెట్టు సౌండ్ బాక్సలు
సిదంగున్నాయంట
ఇంటింటికి ప్రచారమే
జోరుగా సగేనంటా

చాటుమాటుగా నోట్లకట్టలు
పంచేస్తున్నారంట
ఓట్లు గుదే ఓటర్లెపుడు
ప్రత్యేక్ష దైవాలంట




ఎందుకో పాట సాహిత్యం

 
చిత్రం: కోటబొమ్మాళి (2023)
సంగీతం: రంజిన్ రాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, బద్ర రేజిన్, జార్జ్ పీటర్ 

ఎందుకో 

Palli Balakrishna Thursday, October 5, 2023
WWW (Who Where Why) (2021)




చిత్రం: WWW (Who Where Why) (2021)
సంగీతం: సిమాన్ కె.కింగ్
నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ 
దర్శకత్వం: కె.వి.గుహన్
నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల
విడుదల తేది: 2021



Songs List:



నైలు నది పాట సాహిత్యం

 
చిత్రం: WWW (Who Where Why) (2021)
సంగీతం: సిమాన్ కె.కింగ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరాం,  కళ్యాణి నైయర్

నైలు నది 




లాక్ డౌన్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: WWW (Who Where Why) (2021)
సంగీతం: సిమాన్ కె.కింగ్
సాహిత్యం: రోల్ రైడ
గానం: రోల్ రైడ, పద్మజ 

లాక్ డౌన్ సాంగ్ 



కనులు చెదిరే పాట సాహిత్యం

 
చిత్రం: WWW (Who Where Why) (2021)
సంగీతం: సిమాన్ కె.కింగ్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: యాజిన్ నిజార్

పల్లవి:
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూశానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే
నన్నిక నీలో విడిచానే
నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నేమళ్ళీ పుట్టానే
నీకురుల కెరటములోన
చూపులిలా మునిగినవేమో
చిక్కానే చెపైనే.. తీగలు లేని ఈ వల్లో
నెమ్మదిగా నువ్వొదిలే నవ్వులగాలాల్లో

			|| కన్నులుచెదిరే||

అనుపల్లవి:
నీనుంచి ఓసైగే చాలే
చీకట్లో ఎన్నో వర్గాలే
నీ నుంచి ఓ మాటే చాలే
నాపై పన్నీటి వరాలే

		   || కన్నులు చెదిరే||

చరణం: 01
నువ్వొచ్చినా ప్రపంచమౌతుంటే
ప్రపంచమే వెనక్కి పోతుందే
నువిచ్చిన కలల్లో నేనుంటే
వసంతమే తలొంచుకుంటుందే
అడగాలే గాని జీవితమైనా
ఆక్షణమే నీకై రాసిచ్చేయెనా
నీ మౌనం పంపించే
ఈలేఖ బాగుందే... లలనా...

			|| కన్నులుచెదిరే||

చరణం: 02
వయస్సులో యెరక్క నేనున్నా
సొగస్సులో ఇరుక్కు పోతున్నా
మనస్సులో నిజంగ నీ పేరే
తపస్సులా స్మరించుకుంటున్నా
ఎదురై నీ రూపం నించుని ఉంటే
ఎగిరెళ్ళి నింగి అంచున ఉంటా
తాకే వీల్లేకున్నా
నిన్నందుకుంటున్నా..... తళుకా ...

			|| కన్నులుచెదిరే||

చరణం: 3
మహత్తుకే మహత్తులా ఉందే
గమ్మతుకే గమ్మత్తుగా ఉందే
శరత్తులో సరితులాగుందే
మరింతగా జతైనా ఈ గుండె
నువ్వు నాతో ఉంటే ఈపై జన్మ
కాగితమే లేని పుస్తకమమ్మా
నీ స్నేహం సాయంగా
నా ఊహాలోకాన్నే ... గెలిచా...

		   || కన్నులుచెదిరే||

తుండు పల్లవి:
ఎవ్వరు ఎమేమంటున్నా
నివ్వెరబోతూ వింటున్నా
నువ్వే ఆ గొంతె పలికావనుకుంటున్నా
ఇద్దరుగా కనబడుతున్నా
ఒక్కరుగా కనుగొంటున్నా
నువ్వు- నేనంటే మనమయ్యే వైనాన్నే..

Palli Balakrishna Tuesday, June 29, 2021

Most Recent

Default