Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rashi Khanna"
Sardar (2022)



చిత్రం: సర్దార్ (2022)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
నటీనటులు: కార్తి, రాశీ ఖన్నా, లైలా
దర్శకత్వం: పి.యస్.మిత్రన్ 
నిర్మాత: యస్.లక్ష్మణ కుమార్ 
విడుదల తేది: 21.10.2022



Songs List:



సేనాపతి నేనే పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (2022)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాగ్ కులకర్ణి, జి.వి.ప్రకాష్ కుమార్ 

ఈ కొండ కోనలలో, ఓఓ ఓ ఓఓ ఓ
షణ్ముఖుడే గలడంటా, ఆఆ ఆ ఆఆ
మా ఆట పాటలలో, ఓఓ ఓ ఓఓ ఓ
మోగిందే హరోం హర
హరోం హర హరోం హర

చిమ్మని చీకటిలో తెల్లని రేఖలలో
వల్లి నీ వైభోగం డమ్ముకు డియ్యాలో, ఓ ఓ
వద్దన్న పోలేనమ్మ డుమ్ముకు డుప్పాలో

చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో
వల్లితో ఉల్లాసం డమ్ముకు డియ్యాలో, ఓ ఓ
వదిలేస్తే రాబోదమ్మ డుమ్ముకు డుప్పాలో

సూర్యబింబంలాంటి ఎర్రాని ముక్కుపుడక
పెట్టుకొని కనబడితే… ఏంచక్క సిరి చిలక
చేరుకుంటా డోలు కట్టి ఏలుకుంట తాళి కట్టి
వెంట ఉంటా వేలు పట్టి… ఎత్తుకుంటా చుట్ట చుట్టి

సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై… సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై… శుభములే వర్షిస్తానే

మురుగ మురుగా, శివుని కొమరూడ పెట్టేను దండం
నిండుగా కొలవంగా పోయేను గండం
(ఏయ్ జరుగు, జ్ఞానఫలమే కావాలబ్బా)
నీ మహిమే పాటలుగా పాడేము నిత్యం
భువిలో వరదలుగా పారే సంతోషం
అనుమానం మాని పడితే నీ చరణాలే
అవరోధం వదిలి ప్రతిరోజు తిరణాలే

సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే

అహా, అరేయ్..! సూరపద్మ
సంకెళ్ళు కళ్ళాలు నాకేంటబ్బా
గిరి దాటి, ఝరి దాటి వస్తానబ్బా
లోకాన్ని కాపడగా పుట్టానబ్బా
శత్రువుని చెండాడగా వచ్చానబ్బా

గుడిసెలలోనే ఉంటానబ్బా
గుండెల సడినే వింటానబ్బా
మొదలే కానీ తుది లేదబ్బా
కన్నుల తడినే తుడిచేస్తానబ్బా

సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే




మేరే జాన్ పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (2022)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: భాస్కర్ భట్ల 
గానం: నకాష్ అజీజ్ 

మేరే జాన్



ప్రతీ తోటలోన పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (2022)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఆదిత్య RK, బద్ర రజిని 

ప్రతీ తోటలోన 




తూఫానై వచ్చాడమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సర్దార్ (2022)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: భాస్కర్ భట్ల 
గానం: అనురాగ్ కులకర్ణి

తూఫానై వచ్చాడమ్మా

Palli Balakrishna Thursday, December 15, 2022
Pakka Commercial (2022)



చిత్రం: పక్కా కమర్షియల్ (2022)
సంగీతం: జాక్స్ బిజోయ్
నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీ వాస్ 
విడుదల తేది: 20.05.2022



Songs List:



పక్కా కమర్షియలే… పాట సాహిత్యం

 
చిత్రం: పక్కా కమర్షియల్ (2022)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జాక్స్ బిజోయ్, హేమచంద్ర 

పూజలు పునస్కరాలౌ నమస్కారాలు
అన్నీ పక్కా కమర్షియలే
దేవుడు జీవుడు భక్తులు అగరతులు
అన్నీ పక్కా కమర్షియలే
గురువులు శిష్యులు చదువులు చట్టబంధాలు
అన్నీ పక్కా కమర్షియలే
పక్కా పక్కా పక్కా కమర్షియలే

ఎయిర్ ఫ్రీ ఆహ్ నో
ఫైర్ ఫ్రీ ఆహ్ నో
నీరూ ఫ్రీ ఆహ్ నో
నువ్వు నిల్చునా జానెడు జాగా ఫ్రీ ఆహ్ రా
నో నో..
పక్కా కమర్షియలే…

జన్మించిన మరనించిన అవదా కర్చు
జీవించడం అడుగుడుగున కార్చె కర్చు
తప్పు తప్పు అంటావా అనకూడదు అంటావా
ఎంత మొత్తుకుని చెబుతున్నా చెవి పెట్టాను అంటావా
విత్తానికిండే వైభవం మన జగత్తులో ఏం ఉంటుంది రా
పైకానికి లోకం బాంచన్ అంటూ సాష్టాంగ పడుతోంది రా

ఎంతకీ నువ్వు సెప్పెడి ఎండన్నా
పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియల్లీ
చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియల్
పక్కా కమర్షియల్… అవును

నోటు లేని ఓటు వుంటుందా పైసా లేకుంటే పవర్ వుంటుంది
ధనం కాని ధర్మం కాని కర్చె లేకుండా అయిపోతుంది
దండం తో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా
హుండీకి అంతో ఇంతో రేటు కట్టంధేయ్

నీతులు రాసే పుస్తకమైనా ఉచితంగా ఇచ్చేస్తారా
ఫీజు ఇవ్వందే స్వాములు సైతం ఫ్రీగా దీవించేస్తారా
వ్యాపారాలన్నీ వ్యాపారలేగా గీతోపదేశం ఇదే కదా అనే స్మరిస్తు..
తరిస్తు విజయాలని పొందు

పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే
చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియలే
పక్కా కమర్షియల్… అవును

మంచోళ్లని చాడోల్లని తేడలోడు
అయినోళ్ళకి కానోళ్ళకి ఒకటే పద్దు
చిప్ప చేతిలో పెట్టె గొప్ప సంగతులు మనోకొద్దు
కోట్ల సొమ్ము కూడబెట్టు అధి గొడ్డునైనా కొనిపెట్టు
ఆ కళ్లేకేమో గంథాలుండి అన్యాయం అయిన చూడొద్దంటూ
అవకాశలే ఎదురొచ్చాయంటే రెండు చేతులతో కొల్లగొట్టు

పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే
చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియలే




అందాల రాశి పాట సాహిత్యం

 
చిత్రం: పక్కా కమర్షియల్ (2022)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సాయి చరణ్ భాస్కరుని, రమ్యా బెహ్రా

అందాల రాశి మేకప్పేసి
నాకోసం వచ్చావే
స్వర్గం లో కేసే నామీద ఎసి
భూమీద మూసావే
నరుడా వకీల పని నేర్పుతారా
నను చేర్చుకోరా రెడీగా ఉన్నారా
పే వద్దు లేదా ఫేమస్సు కార
ఇక నా సేవ చేసేసుకో

ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాధే
పాప పక్కన నువ్వుంటే (2)

అందాల రాశి మేకప్పేసి
నాకోసం వచ్చావే

బుల్లి తెరనే ఏలే  బిగ్ స్టార్ని నేనే
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే
అన్ని వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో
మొహమాటాలు ఏమి లేక ఫాలో చేసుకో

బ్లాక్ అండ్ వైట్ హాల్ కి
మొత్తం కలరింగ్ వచ్చిందే

నా కండిషన్సే నీకిష్టమైతే
ఇంకా వచ్చేయ్  లేటెందుకే

కాంబో కుదిరిందే
మనిద్దరి కాంబో కుదిరిందే
ఎండ్ లేని సీరియళ్ల  వందేల్లుండాలే (2)

అందాల రాశి మేకప్పేసి
నాకోసం వచ్చావే
స్వర్గం లో కేసే నామీద ఎసి
భూమీద మూసావే

ఆగేటట్లుందే నా గుండె
హిప్సేయ్ చూస్తుంటే
ఏది గుర్తుకురాధే
పాప పక్కన నువ్వుంటే (2)



అదిరింది మాస్టారు పాట సాహిత్యం

 
చిత్రం: పక్కా కమర్షియల్ (2022)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: శ్రీకృష్ణ , సాహితి చాగంటి 

అదిరింది మాస్టారు




లెహంగాలో లేడీ డాను పాట సాహిత్యం

 
చిత్రం: పక్కా కమర్షియల్ (2022)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: విజయ్ ప్రకాష్ , యం.యం,శ్రీలేఖ 

లెహంగాలో లేడీ డాను
లెవలిస్తే ఏమైపోను
లేటెస్టు పూలన్ దేవేరా

అందమేమో మస్తుగుంది
అందుకుంటే కస్సుమందిరా

కట్టౌటు హీరోగున్నా
విల‌న‌ల్లే చూపే తేడ‌
ఫైటొద్దు నాతో పోరడా
చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది
 
ఓ హో టెక్కు ఎక్కువున్న
అమ్మాయంటే సరదా వేరే
తేలిగ్గా తెగిపోతుంటే కిక్కేముందే

వేల మందే వెంటపడ్డ చూడలేదు
రేంజు వేరే పో
గాలమేసే సీను నీకు లేనే లేదు
నేనే సైకోరో

అబ్బబ్బబ్బబ్బా ఏం తిమ్మిరుందే

జున్నుముక్క జున్నుముక్క పిల్ల
కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా
జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల
వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా
 
కోపమొచ్చినా నీకే
కొంపముంచుతూ రాకే
కోరి కోరి పడిపోకే
బల్కులోన మిల్కుతోటి
బ్రహ్మగారి వర్షనే నువా

హే, కట్టౌటు హీరోగున్నా
విల‌న‌ల్లే చూపే తేడ‌
ఫైటొద్దు నాతో పోరడా
చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది

కోటి కట్నమిస్త
ఒక్క మంతు చాలదంట
ఇల్లరికము వస్తా
ఇంటి పేరు మార్చనంట
తెచ్చి వేస్తా నగలు
ఆపెయ్ ఇంకా వగలు

కచితంగా ఎర్రంగా పండుతుంది మెహందీ
నాలాంటోడే నిన్నే కట్టుకుంటే సామిరంగా
పోదింక పండగందే
తేనంటుగుంటు రోజు మనతోనే

నీటుగాడ మాటతోటే ఘాటు కాను
ప్లాను ఫ్లాపే పో పో పో
రాటుదేలి ఉన్న కంచుపాప టైపు
నేను సైకోరో

జున్నుముక్క జున్నుముక్క పిల్ల
కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా
జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల
వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా

కోపమొచ్చినా నీకే
కొంపముంచుతూ రాకే
కోరి కోరి పడిపోకే
బల్కులోన మిల్కుతోటి
బ్రహ్మగారి వర్షనే నువా

అబ్బబ్బబ్బా, కట్టౌటు హీరోగున్నా
విల‌న‌ల్లే చూపే తేడ‌
ఫైటొద్దు నాతో పోరడా
చుట్టు చుట్టు తిప్పుకుంది
మీదకొస్తే తప్పుకుంది

Palli Balakrishna Sunday, July 10, 2022
Venky Mama (2019)



చిత్రం:  వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశిఖన్న, పాయల్ రాజ్పుత్
దర్శకత్వం: కె. ఎస్. రవీంద్ర
నిర్మాతలు: డి. సురేష్ బాబు, టీ. జి. విశ్వప్రసాద్
విడుదల తేది: 13.12.2019



Songs List:



వెంకీ మామ పాట సాహిత్యం

 
చిత్రం:  వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీకృష్ణ , మోహన భోగరాజు 

 వెంకీ మామ 




ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో పాట సాహిత్యం

 
చిత్రం:  వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: పృద్వి చంద్ర, ఎస్. తమన్

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో

ఎడారిలో గోదారిలా 
కుడికాలు పెట్టి, అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో

ఈఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా

హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో

హియర్ వి గో
హీ ఈజ్ ద బ్రాండ్ న్యూవెంకి మామ 
వాటె చేంజ్ మామ
హే భామా మామ భామ మామ

హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి
సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే
పైరగట్టు చూడు పిల్లగాలి తోటీ
ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ గొడుగు కిందచోటు కూడా
ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే
మండు వేస వేళ వెన్నెలంటి ఊసు వింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే

హే ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి అలలు జల్లుతోందిరో
హే ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో

ఈఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా

హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో...
మొలకలేసెరో...




కోకో కోలా పెప్సీ పాట సాహిత్యం

 
చిత్రం:  వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: సింహ, రమ్యా బెహ్రా, అదితి భావరాజు, హనుమాన్ 

కోకో కోలా పెప్సీ 





నువ్వు నేను పాట సాహిత్యం

 
చిత్రం:  వెంకీ మామ (2019)
సంగీతం: ఎస్. తమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, నందిత 

నువ్వు నేను 

Palli Balakrishna Tuesday, October 15, 2019
Anjali CBI (2019)


చిత్రం: అంజలి సి.బి.ఐ (2019)
సంగీతం: హిప్ హప్ తమీజ్
సాహిత్యం: బండారు దానయ్య
గానం: జతిన్ రాజ్
నటీనటులు: అనురాగ్ కశ్యప్, నయనతార, రాశిఖన్నా
దర్శకత్వం: ఆర్. అజయ్
నిర్మాత: సి.జె.జయకుమార్
విడుదల తేది: 22.02.2019

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

కొత్త కొత్త ఫేసుల్ని ఫ్రెండని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు వాళ్ళు
కొత్త కొత్త ఫేసుల్ని ఫేసుల్ని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

తను నేను ఉన్నప్పుడు లవ్ ట్రాక్ సూపరు
పిడుగులాగా వచ్చే తన ఫ్రెండ్ ఒక జోకరు
చెప్పినా నువ్వు మారకుంటే చస్తావుర శేఖరు
నువు మారావా లైఫ్ కొంచం
మిగులునురా ఖాదరు
కష్టాలుంటాయ్ తనకుతానే
వచ్చి ఫిగరు దొరుకుతుంది
ఖాయం ఖాయం దొరకడము ఖాయం
మస్తు ఉంది ఫిగరు అని
ఫ్రెండ్ ఫిగర్ కి లైన్ వేస్తే
నీ ఫిగర్ కన్ఫర్మ్ గా జంపగుట ఖాయం

ఏమి ఖర్మరా  ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

అందమైన పువ్వులిచ్చి చెప్పే ప్రేమని
ఇపుడు ఇంటర్నెట్లో టెండర్ పెట్టె తీరు రాంగమ్మ
సెల్ ఫోన్ వచ్చాక సొల్లు పెరిగెరా
నేడు ఫేసుబుక్ పబ్బులంటు ట్వీట్ మారెరా
ఏమి ఈ గతి భయమేస్తున్నది
వచ్చే వాళ్ళ పోయే వాళ్ళ ముద్దుపద్దులేమిటి
నీటుగా బ్రెయిన్ రా హార్ట్ లో కుదురుగా
అయ్యో అయ్యయ్యో ఎంత మాయ ప్రేమరా

ఏమి ఖర్మరా  ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా

Palli Balakrishna Friday, March 1, 2019
Joru (2014)



చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: సందీప్ కిషన్ , రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మారాజ్
దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
నిర్మాతలు: అశోక్ , నాగార్జున్
విడుదల తేది: 07.11.2014



Songs List:



మనసా పాట సాహిత్యం

 
చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: పూర్ణాచారి
గానం: సునీల్ కశ్యప్

మనసా 



పూవులకు రంగేయేల పాట సాహిత్యం

 
చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: శ్రేయఘోషల్

అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నా
కనురెప్పల మాటున ఉన్నా
తన చప్పుడు నీదేనా
చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా
పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్నా
తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా హా
అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా
ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హ హా

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయల తేలిపోనా
పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన

హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా
సంతోషాన్ని నేను ఎలా దాచుకోనా
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూటగట్టి ఇవ్వాలి
నా బుల్లి బుల్లి అడుగులు అల్లిబిల్లి దారులన్ని దాటేల
నేనింక నీ దాన్ని అయ్యేలా...

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా..

హో మరోజన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయం ఒక్కటే
పరిపరి విధములు లాలించే
ఆ పరిణయమెపుడని
మనసిపుడిపుడే ఊరించే
చేయి చేయి కలపమని

పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హా
పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల
గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన



హవ్వాయి తువ్వాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: వనమాలి 
గానం: హేమచంద్ర 

హవ్వాయి తువ్వాయ్ 




కోడంటె కోడె కాదు పాట సాహిత్యం

 
చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో
గానం: భీమ్స్ సిసిరోలియో, భార్గవి పిళ్ళై 

కోడంటె కోడె కాదు



జోరు పాట సాహిత్యం

 
చిత్రం: జోరు (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో
గానం: రాశిఖన్న

జోరు 

Palli Balakrishna Thursday, March 22, 2018
Touch Chesi Chudu (2018)



చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: JAM 8 (Apprentice band of Pritam)
నటీనటులు: రవితేజ , రాశిఖన్నా ,సీరత్ కపూర్
కథ: వక్కంతం వంశీ
మాటలు ( డైలాగ్స్ ): శ్రీనివాస రెడ్డి, రవిరెడ్డి, కేశవ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీమోహన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్ , చోటా. కె.నాయుడు
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేది: 02.02.2018



Songs List:



టచ్ చేసి చూడు పాట సాహిత్యం

 
చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: బ్రిజేష్ శాండిల్య , శ్రీరామాచంద్ర 

టచ్ చేసి చూడు




రాయే రాయే పాట సాహిత్యం

 
చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: కాసర్ల శ్యాంమ్ 
గానం: నకాష్ అజీజ్, మధుప్రియ 

రాయే రాయే 



మనసా మనసా పాట సాహిత్యం

 
చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: రెహ్మాన్
గానం: బెన్నీ దయాల్ , నీతి మోహన్

మనసా మనసా విన్నా నీ పదనిస
తెలుసా తెలుసా నువ్వే నా తొలి నిషా
నీ పెదవి దాటి నా ఎదను మీటి
నన్నల్లుకుంది నవ్వేలే
నీ కలలు కోటి నా కనులనంటి
నా లోకమంత నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నేనుకూడా నువ్వేలే

చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా

మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్య

హో రంగుల్లో పొంగుల్లో తారంగం అడింది నా ఊపిరి
నీవైపు వస్తూనే సారంగి మోగింది లోలో మరి
ఓ ఓ ఓ...
నీ ఒంపుల్లోని ఎన్నో మెరుపుల్ని
నే చూస్తున్నానే కల్లే మూయలేక
నీ కన్నుల్లోని ఎన్నో మాటల్ని
నే వింటున్నానే బల్లో పాఠం లాగ
ఇకపై ఏమీ చెయ్యాలో నేర్పించవే సరిగా


చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా

మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్య

నా చిన్ని ప్రాణంలో నిప్పేదో రేగింది ఆర్పేదెలా
నీ కొంటె కోణంలో ముప్పేదో దాగుంది ఆపేదెలా

ఓ ఓ ఓ..
ఆకాశమంత అందం నీకుందే
భూకంపమై నన్ను ఊపేస్తు వున్నాదే
దూరాన్ని దూరం తోసేస్తూ ఉన్నాదే
సూదంటు లా నన్ను లాగేస్తు ఉన్నాదే
ఇపుడేంచేయమంటావు చెప్పెయ్యవే త్వరగా

చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియ..
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయా
మమ మమ మమ మమ మనుషులు లేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సదియ్య





రంగ్ బర్సే పాట సాహిత్యం

 
చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: రెహ్మాన్
గానం: అకాష్ దీప్ శంగుప్త  

రంగ్ బర్సే 



ఓయ్ పుష్పా పాట సాహిత్యం

 
చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: ప్రీతమ్
సాహిత్యం: రెహ్మాన్
గానం: నకాష్ అజీజ్ , 

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...

ఓయ్ పుష్పా నువ్వేమో క‌న్నె బంగారం
తాకావో దుమ్ము దుమారం.
హా పంతం ప‌ట్టేసి.. పైపై కొకచ్చేసి త‌ప్పిస్తున్నావే ఆచారం.. ..
అప‌చారం..నాపై నీకేంటి అధికారం..

హాయ్ హాయ్ హాయ్
ఓయ్ పుష్పా అయిపోయా నీకే దాసోహం
పెంచొద్ధే ఇంకా వ్యామోహం
కవ్వించే నారి, కన్నె గోదారి
ముంచేలా ఉందే యవ్వారం, నీ భారం
నాపై  నీకేంటి అధికారం

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...

ఇటు సూడే  నీ చెయ్యి తగిలితే 
లోలోన పెరిగెను హాయ్ హాయే
అరె హాయే అరె హాయే 
జర ఆగే ఈ హాయే ముదిరితే
ఆపేటి వీలే లేదు  మాయే మాయే 
పెను మాయే పెను మాయే
నీ గాలి సోకిందంటే ఉయ్యాలూగే ప్రాణం
పొనంది నిన్నే వీడి పోరి
నన్నిట్ఠా లాగేస్తుంటే ముద్దొచ్చే నీ రూపం
ఆగేది ఎట్టాగే వయ్యారి

ఓయ్ పుష్ప, నీ సైగే మేఘ సందేశం
వచ్చేస్తా ధాటి ఆకాశం
హ్మ్మ్ ఓహ్, ఓ కైట్ లాగ
రాకెట్  లాగ అయ్యావే నువ్వే ఆధారం
ఓ దారం, నాపై నీకేంటి  అధికారం

ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ...
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ...

Palli Balakrishna Monday, January 22, 2018
Tholi Prema (2018)



చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: వరుణ్ తేజ్ , రాశిఖన్నా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర 
విడుదల తేది: 10.02.2018



Songs List:



నిన్నిలా నిన్నిలా చూసానే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్ , యస్.యస్.థమన్

నిన్నిలా నిన్నిలా చూసానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే

నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే

నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

తొలి తొలి ప్రేమ దాచేయికల
చిరు చిరు నవ్వే ఆపేయకీలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)




Break the rules పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రఘు దీక్షిత్

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

సోడియ రేడియ రోడియ హీలియం బేరియం తోరియం ఉంది ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
మన పాటల్లొ లిరిక్స్ మాటల్లొ ఎతిక్స్ గుండెల్లొ ఫ్రీడంకి లేదు ఫార్ములా 
ఫార్ములా...ఫార్ములా...ఫార్ములా 
క్షణాల జిందగీలో no compromise అనేలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా

మోహన మురలిని వలచిన వాడూ 
తియ్య రాధని పిలిచిన వాడూ 
కమ్మని వేలల కురిసిన ఆడు 
పరిమల వనమున ప్రియమగు వాడు 

చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 
చిన్ని కృష్నుడు మా చేతికందాడు 
చిలిపి కృష్నుడు మా మనసు వదలడు 

హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 
హరే హరే మురారే...హరే హరే మురారే 

క్లాసు రూంలో బెంచీకే అతుక్కు పోకురా 
రెక్కలే విప్పి చూడరా 
ఓ ర్యాంకు కోసం పోటినే కాసేపు ఆపరా 
రొమాన్సుకీ స్పేసు ఇవ్వరా 
తీయ్ పరదా...చేయ్ సరదా 
వెలిగి పోదా కలల పరదా 

ఆ ఫైరుకి లైఫుకి నీరుకి జోరుకి 
స్పీడుకి ఉందొక ఫార్ములా 
మనలో తెగువ పొగరు జిగురు వగరు లేదంట ఫార్ములా 
యుగాల యువతరంలో సరైన హిష్టరీలా 
మన విరగ బరువు తరగ నురగ తిరుగు లేని గోలా 

Break the rules Break the rules 
Just break the rules 
రోదసీ లో దూసుకెల్లు రాకెట్ లా
Make the rules make the rules 
Lets make the rules 
మనము కోరుకుంటె దొరికె చాక్లెట్ లా




సునోనా సునైనా పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ నంబియర్

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 
నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా 
సునైనా నీతో రానా 

సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా 
సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా 

ఈ ఏజే పోతె మళ్ళీ రాదె నువ్వేం చేసినా 
ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా 
ఓ లవ్లి లేడి నువ్వే ఎంత బెట్టే చేసినా 
మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా 
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా 
ఆతో పాటుగ నాతో పాటగ మారవ నువ్ పాడవా 

నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింకవ్వనా 
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా 
నీ సింపుల్ సింపుల్ లైఫులో వండరవ్వనా 
సునైనా నీతో రానా 





అల్లసాని వారి పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయా ఘోషల్

అల్లసాని వారి



విన్నానే విన్నానే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరన్

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్ ఫ్లై చేసా 
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా 
కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా 
ఆకాసాన్నే దాటేశా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా 
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా 
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా 
మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే

నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే 
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే 
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే 
నీ మెలుకువ కోసం వెలుతురులే పరిచాలే 

నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా 
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా 
నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా 
కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా 

అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పేశావుగా 
అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టేశావుగా 

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటె విన్నానే 
ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నానే




తొలిప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: కాలభైరవ

తొలిప్రేమ

Palli Balakrishna

Most Recent

Default