-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Preethi Vijaykumar"



చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
నటీనటులు: శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రోజా, ప్రీతి, కోవై సరళ, రవితేజ, ప్రకాష్ రాజ్
దర్శకత్వం: రాజా వెన్నం రెడ్డి
నిర్మాత: ఎమ్.వి.లక్ష్మీ
విడుదల తేది: 04.02.2000



Songs List:



జోరు జోరుగా సంబరాలు చేయనా పాట సాహిత్యం

 
చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
గానం: సుఖ్విందర్ సింగ్, నిత్యశ్రీ 

జోరు జోరుగా సంబరాలు చేయనా 



ఒక్కరి కోసం అందరము పాట సాహిత్యం

 
చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
గానం: ఎస్. జానకి, హరిణి, లలితా సాగరి

ఒక్కరి కోసం అందరము
అందరికోసం ఒక్కరము



అప్పు చేసైనా పప్పు కూడు పాట సాహిత్యం

 
చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
గానం: ఎస్. జానకి, హరిణి, లలితా సాగరి

అప్పు చేసైనా పప్పు కూడు




లవ్ కి ఏజి బారుందా రంగనాయకి పాట సాహిత్యం

 
చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ 

పల్లవి:
లవ్ కి ఏజి బారుందా రంగనాయకి 
లైఫ్ కి వైఫ్ బోరేగా రంగనాయకి

హే మచిలిపట్నం మస్తాన నర్సిపట్నం నిరజాన 
నిన్ను తాకి మెరిసేనమ్మా రెక్సోనా
హే సోకు చూస్తే బారాణ సిగ్గు చూస్తే చారాణ
సందు చూసి దూకాలమ్మో రంగాన

అబ్బయో అబ్బయో అబ్బాయో (2)
అమ్మయో అమ్మయో అమ్మాయో (2)

లవ్ కి ఏజి బారుందా రంగనాయకి 
లైఫ్ కి వైఫ్ బోరేగా రంగనాయకి

చరణం: 1
ఆ స్విస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ వద్దుమరి నువ్వుంటే
నా ఫస్ట్ లింక్ బెస్ట్ రంకు సాగినది నీవంటే 
తిందాము గడ్డి కొందాము మిడ్డీ ఘాటైన ముద్దిస్తే
ఒంగోరు గడ్డి ఓ సెంటు బుడ్డి తేకుంటే ఇక పస్తే
మూడు షిఫ్ట్ లులో ముడుపులివ్వాలే
ఆదుకోగలను సెలవులిస్తాలే
నిన్ను మెచ్చాము వచ్చాము పెళ్ళాలనొదిలి
వెచ్చంగ చేరాలి శృంగార మజిలీ

అబ్బయో అబ్బయో అబ్బాయో (2)
అమ్మయో అమ్మయో అమ్మాయో (2)

లవ్ కి ఏజి బారుందా రంగనాయకి 
లైఫ్ కి వైఫ్ బోరేగా రంగనాయకి

చరణం: 2
మా ఇంటి కూడు వంటపడక ఒంటికిక విసుగొచ్చే
నీ వడ్డు పొడుగు కట్టె పడక పైటకిక బొగ్గొచ్చే
బిజీగా ఉందాం మజాలు చేద్దాం బజారు అభినేత్రి
భరించి ఉందాం భరించుకుందాం భలేగా వన్ బై త్రీ
వైఫ్ ఒకరైతే చెలియ చెరుకేలే 
ముగ్గురొకటైతే మంచమరుపేలే
ఇక తియ్యాలి ఇవ్వాళ కరెంట్ ఫ్యూజ్
కావాలి రావాలి మరింత క్లోజ్

అబ్బయో అబ్బయో అబ్బాయో (2)
అమ్మయో అమ్మయో అమ్మాయో (2)

లవ్ కి ఏజి బారుందా రంగనాయకి 
లైఫ్ కి వైఫ్ బోరేగా రంగనాయకి

హే మచిలిపట్నం మస్తాన నర్సిపట్నం నిరజాన 
నిన్ను తాకి మెరిసేనమ్మా రెక్సోనా
హే సోకు చూస్తే బారాణ సిగ్గు చూస్తే చారాణ
సందు చూసి దూకాలయ్యో రంగాన

అబ్బయో అబ్బయో అబ్బాయో (2)
అమ్మయో అమ్మయో అమ్మాయో (2)

లవ్ కి ఏజి బారుందా రంగనాయక
లైఫ్ కి వైఫ్ బోరేగా రంగనాయక




ఆడవాళ్ళమండి మేము పాట సాహిత్యం

 
చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గందవరపు సుబ్బారావు, చంద్రబోస్, సిరివెన్నెల
గానం: చిత్ర, మనో  & బృందం 

పల్లవి:
ఆడవాళ్ళమండి మేము 
మీ రెండు కళ్ళమండి మేము (2)
కూరే మీరైతే ఉప్పే మేమండి 
ఇదిగో..
కాఫీ మీరైతే కప్పే మేమండి
పట్టాలు లేకపోతే ఏ రైలు లేదండీ
పెళ్ళాలు లేకపోతే మగవాళ్ల బండి నడవదులెండి

ఆడవాళ్ళమండి మేము 
మీ రెండు కళ్ళమండి మేము (2)

చరణం: 1
ఆ... అందమున్నది మాకు ఆర్ట్ ఉన్నది
ఆట లోన స్టేఫిగ్రాఫ్ పాటలోన సబ్బలక్ష్మి ఆడజాతి మచ్చుతునకలే 
శెభాష్..
బ్యాట్ పట్టిన బాక్సింగ్ చేసినా 
ఎంత పెద్ద లేడీకైన తల్లకిందులైనా గానీ మొలవదమ్మ మూతి మీసమే
ఇండియా ను ఇందిరమ్మ ఎలలేదా ఆ లంక లోన చంద్రికమ్మ అడదేదా
పల్లె నుండి ఢిల్లీ దాకా ఎక్కడైనా భార్య కట్టుకున్న భర్త ముందు బానిసేగా
IPC చెట్ట ప్రకారం ఆడ మగలు ఒకటేనండి

ఆడవాళ్ళమండి మేము 
మీ రెండు కళ్ళమండి మేము (2)

చరణం: 2
ఆ... తాళి కట్టగా తైతక్క లాడగ 
వేలకొద్ది కట్నమిచ్చి సంతలోన తెచ్చుకున్న కీలుబొమ్మలండి మీరు
అదీ..
అత్తమామలే మా కాలు పట్టగా అరె పాపమంటు జాలి తలచి కన్యాదాన మందుకున్న పుణ్యపురుషలండిమేము
మూడు కళ్ళ దేవుడైన శివుడు కూడా 
తాను ఆడదాన్ని నెత్తి మీద మోయాలేదా
బోలెడంత సంపదున్న లక్ష్మీ కూడా తాను భక్తి కొద్ది భర్త కాళ్ళు నొక్కలేదా
మాతోటి గొడవే పడితే పడకింటిలోన పస్తేనండి

ఆడవాళ్ళమండి మేము 
మీ రెండు కళ్ళమండి మేము (2)
కూరే మీరైతే ఉప్పే మేమండి 
కాఫీ మీరైతే కప్పే మేమండి
పట్టాలు లేకపోతే ఏ రైలు లేదండీ
పెళ్ళాలు లేకపోతే మగవాళ్ల బండి నడవదులెండి

ఆడవాళ్ళమండి మేము 
మీ రెండు కళ్ళమండి మేము (2)

Palli Balakrishna Thursday, February 14, 2019




చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
నటీనటులు: తరుణ్ , స్నేహ, శివాజి, ప్రీతి విజయ్ కుమార్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 11.02.2001



Songs List:



మనసున ఉన్నదీ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది 
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి 
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే 
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే 
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో 
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది 
మాటలు రావే ఎలా

లలలా... లల లల లల లల లాలాలా...
లలలా... లల లల లల లల లాలాలా...

చింత నిప్పైన చల్లగ ఉందని 
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని 
లేత గుండెల్లొ కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు 
నా ఎద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ 
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది 
మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లొ అతని బొమ్మని 
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని 
వేల ఊహల్లొ ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు 
ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ 
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది 
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి 
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే 
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే 
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో 
తెలపక పోతే ఎలా... ఆ...

లలలా... లల లల లల లల లాలాలా...
లలలా... లల లల లల లల లాలాలా...



నచ్చెనురా నచ్చెనురా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: వసంత్
గానం: శంకర్ మహదేవన్, హరిణి, కృష్ణ రాజ్

నచ్చెనురా  నచ్చెనురా ఈ ఫిగరు నచ్చెనురా
ఓ లుక్కు వేసెయ్ సోదరా...
కాశ్మీరీ యాపిల్లే తలదన్నే ఈ కన్నే 
అందానికి అందం చూడరా
బీ హ్యాపీ  బీ హ్యాపీ బాయ్ బాయ్
లైఫంత చేసెయ్ రా ఎంజాయ్
టీనేజీ పవరేంటో చూపెయ్

వచ్చిందే క్యాట్ వాకింగ్ లేడీ
సైయ్యంటే కట్టెయ్నా జోడీ
నిను చూస్తే వేడెక్కే నాడీ

ఫ్యాషన్ కే నే న్యూ ఓషన్
సృష్టించేయ్నా ఓ సెన్షేషన్
నేనంటే యూత్ కి టెంప్టేషన్

నీ చూపులు చేసే మేజిక్ 
నీ మాటలు లవ్ కే లాజిక్
నిను చేసిన బ్రహ్మ ఎదురైతే 
బ్లాంక్ చెక్ రాసిచ్చెయ్ మా 

మీ మాటలు హయ్యో టూ మచ్
మీ చూపులు చేసేయ్ గిమ్మిక్స్
మీ నూగు మీసాలకి  నే పాస్ బుక్ రాసిచ్చెయ్నా

చెంతకొస్తే ఓ సోనా చార్మినారే రాసేయ్ నా
బోలో బోలో బోలో బోలో
మాపటేల మస్తాన సోకులన్ని ఇచ్చెయ్ నా
చెలో చెలో చెలో చెలో
స్ట్రాబెర్రీ కళ్లకు ఓ ఫ్లాట్ క్యాడ్బరి కౌగిలికో ఫ్లైట్
నేను రాసేయ్ నా ఊ అంటే ఓహో నా సోనా
ఒక్క స్మైలిస్తే అదిచాలు మాకది ఖాతా పదివేలే
లుంబుకే పోదాం ఖండాల నువ్వుంటే చాలే

హాయ్యో రామ హైరామ 
అని అల్లరికే పెట్టెయ్ కామా
వీధుల్లో ఏంటి హంగామా

హిస్టరీ కే అందని ఓ మిస్టరీ యే ఈ ప్రేమ
బోలో బోలో బోలో బోలో
పెను తూఫానే ఎదురైనా
ప్రేమతో అది గెలిచెయ్నా
బోలో బోలో బోలో బోలో
శాటిలైట్ కాలంలో అయినా
ఈ ప్రేమ మారదురా నాన్న
ప్రేమలేకుంటే ఓ భాయి సృష్టే లేదురా
ఎవరైన లవ్వే చేసుంటే అడ్డంకులేమైనా ఉంటే
చేయూత నిచ్చి ఓదార్చి కలిపేద్దామురా

నచ్చెనురా  నచ్చెనురా ఈ ఫిగరు నచ్చెనురా
ఓ లుక్కు వేసెయ్ సోదరా...
కాశ్మీరీ యాపిల్లే తలదన్నే ఈ కన్నే 
అందానికి అందం చూడరా
బీ హ్యాపీ  బీ హ్యాపీ బాయ్ బాయ్
లైఫంత చేసెయ్ రా ఎంజాయ్
టీనేజీ పవరేంటో చూపెయ్

వచ్చిందే క్యాట్ వాకింగ్ లేడీ
సయ్యంటే కట్టెయ్నా జోడీ
నిను చూస్తే వేడెక్కే నాడి
నచ్చెనురా  నచ్చెనురా ఈ ప్రేమే నచ్చెనురా
ప్రేమను ప్రేమించేయ్ సోదరా



వేయి జన్మాల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి
నిను దాచే ఈ నిషి  నిలిచేనా ప్రేయసి
నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూవున్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతువున్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి

గాలితో నువ్వు పంపిన వలపు ఊసేమిటో
పూలలో నువ్వు పంపిన తీపి తలపేమిటో
నిన్నదాక నను చేరలేదని నమ్మదా చెలి నీ మౌనం
నా శ్వాసలో రగిలే గాలులతో నిను వెతికేస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా
ఎద సవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూవున్నా
అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి

ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలని
కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలని
నీవు కలవని కలవు కాదని రుజువు చేయని అనురాగం
నను నేనే శిలగా మోస్తున్నా ఎద బరువైపోగా
చిరునవ్వుల్నే వెలివేస్తున్నా నిను చూసే దాకా
ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా పెనుజ్వాలైపోగా
ఏడబాటు పొరబాటు కరిగించేదాక

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి
కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి
నిను దాచే ఈ నిషి  నిలిచేనా ప్రేయసి
నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూవున్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతువున్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి





మస్తు మస్తు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిణి, శంకర్ మహదేవన్ 



You are a Man
I'am your Woman
Look into my eyes
Look deep into my eyes
You are Loving me
You are Entering Love

Common...Common...
Love me.. Love me...

మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు
చూపెయ్ మగధీర 
రారా రారా అందాల ప్యార్ వీర
రారా రారా రతి నీదే రాకుమారా
హేయ్ ఏంటే మీ హంగామా Y2K భామా
రేపగలు ముద్దుల్లో ముంచేస్తానమ్మా
కల నిజమైన కథ మొదలైన
హేయ్ మళ్ళి మళ్ళీ ఎందీ మాంగీమో

రారా రారా అందాల ప్యార్ వీర
రారా రారా రతి నీదే రాకుమారా
మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు
చూపెయ్ మగధీర 

హే వేసెయ్నా వయుసులు కోరే మంత్రం
నా కసి కసి గువ్వా జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
హో చేసెయ్ నా టమకము తీరే తంత్రం
నా మగసిరి నువ్వా జుం 
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
ఓ... వయ్యారాల వీణను పట్టి శృతించేయ్న
అంగాంగాలు అందాలన్నీ అందించేయ నా
నచ్చావే చిన్నారి చుపించెయ్ దారి 
చేద్దాం చలో ఖుషీ

పదరా మగడా సొగసైన చిలక నీదే
యమహో చెలియా ఎదురీదు వయసు నాదే
మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు
చూపెయ్ మగధీర 

జారింది జివు జివు లాడే పైట
పద పద పదమంటు జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం

ఓ సాగిస్తా మధువతి కోరే వేట
సుఖమస్తు అని అంటూ జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
అ జుం  జుం జుమకు జుమకు జుం  జుం
నయాగరా జలపాతంలా నన్నే కమ్ముకో
వసంతాల ఉల్లాసాలే చెలి నింపుకో
వారేవా కిల్లాడి నువ్వేలే నా జోడి అందం రెడీ రెడీ
ఆజా ఆజా అందాల రాణి ఆజా
లేజా లేజా ఈ సోకు నీదే లేజా

మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు
చూపెయ్ నా చెలియా
రారా రారా అందాల ప్యార్ వీర
రారా రారా రతి నీదే రాకుమారా
హేయ్ ఏంటే మీ హంగామా Y2K భామా
రేపగలు ముద్దుల్లో ముంచేస్తానమ్మా
కల నిజమైన కథ మొదలైన
హేయ్ మళ్ళి మళ్ళీ ఎందీ మాంగీమో

ఆజా ఆజా అందాల రాణి ఆజా
లేజా లేజా ఈ సోకు నీదే లేజా

ఆజా...




నేలనడిగా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి యేదని
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అని

అయినా ఇంతవరకు ఆచూకీలేక
తెగిన గాలిపటమై తిరిగా
ఎటూ దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా

నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి యేదని

చరణం: 1
ఇపుడే ఇటు వెళ్లిందంటు చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమళముంది
ఇందాక చూశానంటు సిరిమల్లే చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడి గంటల్లో తన జాజుల సడి వింటుంటే
తను ఈ కోవెల్లో ఇప్పటివరకు ఉన్నట్టే
ఎటుచూసినా తన జాడలే
ఎటు వెళ్లిందో ఈ లోపునే

నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి యేదని

చరణం: 2
నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండి పోతుంది
నడకైన నాట్యంలాగే అనిపించే తనవెంటే
దివిలోవుండే మెరుపే దిగివచ్చిందనిపిస్తుంది
ఎందరు చూశారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే
తను ఉందంటే నను నమ్మరే


నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి యేదని
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలుక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అని

అయినా ఇంతవరకు ఆచూకీలేక
తెగిన గాలిపటమై తిరిగా
ఎటూ దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ
ఏనాటికి చూపునో చిరునామా

నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి యేదని




మనసున ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

మనసున ఉన్నది  చెప్పేది కాదని
మాటున దాచేదెలా
మనదను కున్నది చేజారిందని
నమ్మకపోతే ఎలా

మరి మరి తలచి ఊహలలోనే దాచి
చాటుగ చూసేదెలా
తగదని తెలిసి తలపే ఆపలేని
తప్పును చేసేదెలా
ఇకనైన చెరగాలి నల్లని నీడలా
నను వెంటాడే కలా

మనసున ఉన్నది  చెప్పేది కాదని
మాటున దాచేదెలా

నేలకందించి ఆకాశ గంగని
నింగి గుండెల్లో నలుపు కడగని
కురిసే చల్లని వాన జల్లుతో
కళ్ళు ముందున్న సత్యాన్ని చూపని
రెప్ప చాటున్న నిదుర కరగని
ఉబికే వెచ్చని కన్నీళ్ళతో
అందిస్తున్నా  నా ప్రియమైన నీకు
అక్షింతలుగా నా ప్రతి ఆశని
కలకాలం నీ నవ్వే నిను నడిపించనీ
నను వెంటాడే కలా

మనసున ఉన్నది  చెప్పేది కాదని
మాటున దాచేదెలా

నను రమ్మన్న చెలిమి వెన్నెల
దాటి రానంది చీకటి కాపలా
ఇకపై తెరలను తీసేదెలా

నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిల
జ్ఞాప కాలతో అల్లింది సంకెల
గతమే సిలువగ మోసేదెలా
ఇచ్చేస్తున్నా నా ప్రియమైన నీకు
నీకై వెతికిన నా ప్రతి శ్వాసనే
నిను చేరి సిగ పువ్వై కొలువై ఉండనీ
నను వెంటాడే కలా

మనసున ఉన్నది  చెప్పేది కాదని
మాటున దాచేదెలా
మనదను కున్నది చేజారిందని
నమ్మకపోతే ఎలా

మరి మరి తలచి ఊహలలోనే దాచి
చాటుగ చూసేదెలా
తగదని తెలిసి తలపే ఆపలేని
తప్పును చేసేదెలా
ఇకనైన చెరగాలి నల్లని నీడలా
నను వెంటాడే కలా...

Palli Balakrishna Tuesday, July 18, 2017

Most Recent

Default