Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nabha Natesh"
Maestro (2021)




చిత్రం: మాస్ట్రో (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 2021



Songs List:



ఓ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ట్రో (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీజో
గానం: అనురాగ్ కులకర్ణి

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా
మొదలిక మెల్ల మెల్లగా
ఎం చూశానో నీలో అని అడిగే లోపే
మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే
నీ వల్లే…..
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే
లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా
గడవదు కథ ఇంకా నిజంగా…
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హారిస్ గోయింగ్ దివానా
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా…
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే


Palli Balakrishna Tuesday, July 20, 2021
Nannu Dochukunduvate (2018)
చిత్రం: నన్ను దోచుకుందువటే (2018)
సంగీతం: బి. అజనీష్ లోక్ నాథ్
నటీనటులు: సుధీర్ బాబు, నభ నటేష్
దర్శకత్వం: ఆర్ యస్. నాయుడు
నిర్మాత: సుధీర్ బాబు
విడుదల తేది: 20.09.2018

Palli Balakrishna Saturday, March 6, 2021
Disco Raja (2020)



చిత్రం: డిస్కో రాజా (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, పాయల్ రాజ్ పుత్
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్ 
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేది: 24.01.2020



Songs List:

Palli Balakrishna Saturday, January 23, 2021
Solo Brathuke So Better (2021)


 







చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: విశాల్ దాద్గాని
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

ఓఓఓ... హేయ్, హేయ్...
ఓఓఓ... హేయ్, హేయ్

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్
తగని పీకులాటలో... తగులుకోకురో
నిను విడిపించే దిక్కెవరు..?
ఉన్నపాటుగా ఊబిలోకి దిగి పోతావా డియర్
అసలు ప్రేమనేది ఓ ముళ్లదారి కదా నువ్వనేది ఎవరూ
కనుక కళ్లు మూసుకొని వెళ్లి పోకు అది చాలా డేంజర్ నమ్మరేమి ఎవరు

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

ఏ.... సన్యాసంలోనే కదా... 
ఇహముంది, పరముంది
సంసారం ఏమిస్తుందయ్యా... నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దాల్లెవరికి  తెలియనిదా చెప్పండి
తెలిసున్నా మనతో ఆ సత్యం చెప్తారు చూడండి

సోలో బ్రతుకే సో బెటర్... 
వినరమంట బ్యాచిలర్
బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

బోలో బోలో బ్యాచిలర్... 
సోలో బ్రతుకే సో బెటర్

బాయ్స్ అండ్ గర్ల్స్...

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

సున్లో సున్లో 
జస్ట్ బి సోలో
ఫిర్ సే బోలో
సోలో బ్రతుకే సో బెటర్

హేయ్...








చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నకాష్ అజిజ్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

బల్బు కనిపెట్టినోడికే... 
బ్రతుకు సిమ్మసీకటై పోయిందే
సెల్లు ఫోను కంపినోడికే... 
సిమ్ము కార్డ్ బ్లాకై పోయిందే
రూటు సూపే గూగులమ్మనే... 
ఇంటి రూటునే మర్చిపోయిందే
రైటు టైం సెప్పే వాచ్ కే... 
బ్యాడు టైమే స్టార్టై పోయిందే

అగ్గిపుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే... 
సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నాదే
పాస్ట్ లైఫ్ లో నేను చెప్పిన ఎదవ మాటే... 
బైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు వెళ్ళిపోతే ఒంటరైపోతా

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించ... 
చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్సయ్... 
చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే... 
చెయ్యే రావట్లేదే
హుగ్గు చేసుకొని చెప్తామంటే... 
భగ్గుమంటావన్న భయమే
బండరాయి లాంటి మైండ్ సెట్టు మార్చి...
మనసుతోటి లింకు చేస్తే బాగుపడతవే....
నీ హార్ట్ గేటు తెరిచి... నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది... నాపై లవ్వుందే

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

ఒగ్గేసి పోకే అమృత... 
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్న అమృత... 
నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా








చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్ (2020)
సంగీతం: ఎస్.తమన్
సాహిత్యం: రఘురాం
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: సాయి తేజ్, నభా నటేష్
దర్శకత్వం: సుబ్బూ
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్
విడుదల తేది: 25.12.2020

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా...

మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజి సోదరా
నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల
సంసార సాగరం నువ్వీదలేవురా
నట్టేట్ల మునుగుతావురా
పెళ్లంటే టార్చరేరా... ఫ్రాక్చరేరా
పంచరేరా... రప్చరేరా... బీ కేర్ఫుల్ సోదరా

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి

భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన
ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన
పగోళ్ళకైన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటే ఫుల్లు రోదనా...

పెళ్లే వద్దంటే ఎల్లా... ఎందుకీ గోల
యు గాట్ ఆ మేక్ ఇట్ గొనా 
సీ ఇట్స్ షైన్...లైఫె ఈ కలర్ఫుల్ అంతే
అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే (పండగే...పండగే...పండగే)

నీ ఫ్రీడమే పోయేంతలా
నీ కింగ్డమే కూలి పోవాలా...!
డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా
లైఫ్ ఉండాలి వీకెండ్ లా
నీకున్న స్పేసుని... నీకున్న పేస్ ని
నీ కున్న పీస్ ని... డిస్టర్బ్ చేసుకోకు
ఎడారి దారిలో... ఒయాసిస్ వేటకై
ప్రయాణమెంచుకోకు
పెళ్లంటే కాటు వేసే నాగు పాము
నువ్వు గెలవలేని గేము
బీ కేర్ఫుల్ సోదరా

నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి
నో పెళ్లి... దాంతల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి



Palli Balakrishna Sunday, January 17, 2021
Alludu Adhurs (2021)


 









చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రిత్ జస్ట్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 14.01.2021

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

హోలా చిక నా... ?? వాట్ నాన్సెన్స్... ??
హలో పిల్లా... ఇట్ మేక్ సెన్స్

హోలా అంటే హలో... చిక అంటే పిల్ల
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా..?
తెలుగులో ఈ వర్డు చాలా వాడేశారు... 
అందుకని సారు, స్పానిష్ లో దిగారు.

హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

ఐదేళ్ళ వయసప్పుడు... 
ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా

తర్వాత ఇంకెప్పుడు... చూళ్ళేదు నేనంత అందం
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా
ఇన్నాళ్లకు చూసినాను నిన్నే... 
హోలా చిక హోలా హోలా చికా
స్టాచ్యులా స్టన్నైంది కన్నె... 
హోలా చిక హోలా హోలా చికా
ఇట్టా ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో... 
నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా... 
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా...
హోలా చిక హోలా హోలా చికా

హ... రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే... డేట్ ఇవ్వవే
ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే... 
ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే
న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే... 
లేటు చెయ్యకే
ఆవారా లాంటి వాణ్ని నేనే... 
హోలా చిక హోలా హోలా చికా
వాలెంటైన్ చేసినావే నన్నే... 
హోలా చిక హోలా హోలా చికా
ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో... 
నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా... 
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా

అవెంజర్స్ థార్... మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాలు... సిక్సరేసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే... ఇష్టమొచ్చినట్టు, 
ప్రేమ పంచవే
ప్లగ్గులోన వేలుపెడితే... ఒక్కసారి షాకు
ఓరచూపు తోటి... వంద షాకులివ్వమాకు
నాలాంటి వాడు... ఇంక దొరకడంట నీకు, 
నన్ను నమ్మవే

స్కూల్లోనే ఈల నేర్చినానే... 
హోలా చిక హోలా హోలా చికా
నీకోసం వెయ్యడానికేనే... 
హోలా చిక హోలా హోలా చికా
నువ్వు ఎస్సు అంటే లైఫు అబ్బో అబ్బో... నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో
హోలా చికహోలా హోలా చికా... 
ఓలమ్మో, నువ్వేలే నా మ్యాజిక్కా

హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా... 
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా... 
హోలా చిక హోలా హోలా చికా








చిత్రం: అల్లుడు అదుర్స్ (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లి, హేమచంద్ర

హే... సిల్క్ స్మిత, జయమాల్ని జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో రిలేటెడ్ టు మీ
హే... కత్తిరీనా, కర్రీనా సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ

హే కోకారైకా నేనేసాక  నాసాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలెయ్యక  ఎట్టాగ ఆగేది నేనొచ్చాక

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
హే రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక

హే... సిల్క్ స్మిత, జయమాల్ని  జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో  రిలేటెడ్ టు మీ
కక కత్తిరీనా, కర్రీనా  సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే  ప్లీజ్ బిలీవ్ మీ

హెయ్... దినక్కుతా కసక్కురో
దినక్కుతా... కసక్ కసక్ కసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా... ఫసక్ ఫసక్ ఫసక్ 
దినక్కుతా కసక్కురో
దినక్కుతా... ఫసక్ ఫసక్ ఫసక్ 

హే... ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి
రోల్ మోడలేదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే
హెయ్ పోరి... నా షర్టు పైన పూల ప్రింట్
నీ వల్లే సెంటల్లే మారిందే...
నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి... తాకగానే
నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నువ్విక

హే... లిక్కరంటి నీ పెదాల్లో నక్కి ఉంటదే
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే
మాట తేనె పూసుకున్న కత్తి వాటమే
నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్ 
ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు
నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు
ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు

రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
హా హా
హెయ్ రంభ ఊర్వశి మేనకా పూనకమే వస్తుంది మాకిక


Palli Balakrishna
iSmart Shankar (2019)



చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రామ్ పోతినేని, నబా నటేష్, నిధి అగర్వాల్, సత్య దేవ్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
విడుదల తేది: 12.07. 2019



Songs List:



ఇస్మార్ట్ శంకర్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

పతా హై మైం కౌన్ హుం
శంకర్ ఉస్సాదత్ ఇస్మార్ట్ శంకర్

గడ బిడా లకు బేఫికర్
సడక్ సడక్ కడక్ పొగర్
ఇస్టయిల్ దేఖో నీచే ఉపర్
ఇష్ ఇష్ ఇస్మార్ట్
నామ్ బోలెతో గల్లీ హడల్
డబల్ దిమాక్ ఉంది ఇదర్
కర్లె ఆపని నీచే నజర్
ఇష్ ఇష్ ఇస్మార్ట్
హైదరాబాద్ షహర్ మెయి
పుచో బే సాలె
చార్మినార్ చదర్ఘాట్
అంత నాదే
కిరి కిరి కిరి కిరి కిరి కిరి కిరి కిరి
జేస్తే మాకిరికిరి

హహహ ఇస్మార్ట్ శంకర్

ఎహ్ బీర్ ఏసుకుంటా బిందాసుగుంట
బాం భోలే శంభో శివ
నను వికెటోడు దునియాల లేడు
యడున్న నాదే హవ్వా
ఏదైనా గాని మ్యాటర్
చాయ్ బత్తి పే సెటిల్
తెగలేదంటే అగర్
సర్ పే పోడ్ దుం బాటిల్
ఇస్మైలే ఏమో కిర్రాక్ బ్రదర్
కట్ ఏమో గరం ఫిగర్
అక్కడ్ బక్కడ్ ఎక్ హీ టక్కర్
ఇస్మార్ట్ శంకర్
దిగిందంటే ఖతం మ్యాటర్
మక్కెలిరగదీసే మీటర్
కటక్ మటక్ చట్టర్ బట్టర్
ఇస్మార్ట్ శంకర్

హహహ ఇస్మార్ట్ శంకర్

ఏయ్ బొమ్మ
నువ్ హువు అంటే గోల్కొండ రిపేర్ చేసి
నీ చేతుల పెడ్తా
నిన్ను బేగం ని చేసి కీల మీద
కుసో బెడ్తా
హహహ క్యా బొల్తి ఆహ్

చల్ బే సాలె నీలాంటోళ్లని మస్తు చూష్ణ

దిల్ నే పతంగిల ఎగరేసుకా పోయే
కద్దు ఖ ఖీర్ లాడ్కి
నా కంట్ల వడితే ఇడిసేదే లేదు
పట్టేస్తా ఉరికి ఉరికి
బస్ హేయ్ ఎక్ నజర్
బజేగా దిల్ కి బజార్
దేదుంగ బంతి ఫ్లవర్
గుంగురు గుంగురు గల్ గల్
ఫిదా హువా దెక్ఖే షకల్
లవ్ జేస్త రాత్రి పగల్
కొనివెడతా కిలో నగల్
ఇశ్మర్ట్ శంకర్
నడుం చూస్తే సెంటీమీటర్
వెనకోస్త కిలోమీటర్
గిఫ్ట్ ఇస్తా 7 సీటర్
ఇస్మార్ట్ శంకర్

హే ఇస్మార్ట్ నువ్వు తురుం రా





జిందాబాద్ జిందాబాద్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శరత్ సంతోష్, రమ్య బెహరా

జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

వహ్వా వ వ వ వ వ
ఒక ముద్దు అప్పు కావాలా
వహ్వా వ వ వ వ వ
తిరిగి ఇచ్చేస్తావా
అరెరెయ్ ఒకటికి నాలుగు
వడ్డీతో ఇస్తానే
పెదవే కెవ్వు కేకలు
పెడుతున్న వదలనులే

దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే
దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

తొలిసారి గుండెలోన
జరిగే దారుణం
నీ సొగసెయ్ కారణం
వడగళ్ల వాన లాగ
నువ్వేయ్ దూకడం
అవుతుందా ఆపడం
నదిలో నిప్పులు పుట్టడం
రగడం జగడం
చలిలో చమటలు కక్కడం
మహా బాగుందే

దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే
దుంప తెంచేశావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే




దిమాక్ ఖరాబ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కీర్తన శర్మ, సాకేత్

వాని ఎద మీద ఉండేటి ఘమ ఘమ గంధాలు
సంద మామయ్యలో
నా రైక ముడి మీద రాలిన సాలయ్య రంగ
రామయ్యలో
వాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు
సంద మామయ్యలో
నా పట్టుకుచ్చుల కోకకంటిన సాలయ్య రంగ
రామయ్యలో

ఆ.. అరే ఏమయ్యింది కాక
హే డచ్చాగానివారా సంకి నా యాల 
డిజే కొట్టు డిజే

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా
ఉంటె దమ్ముంటే నీ పూల పక్క
ఏస్తా చల్లేసేయ్ నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా నీ సోకె గటక
ఏస్తా ఏయిస్తా నీ తోటే గుటక

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిసిసిసి సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

ఏందిరా బాయి పోరి మీద పోరి ఉంది
అది ఇది కాద్ అదే ఇది
అది ఇది కాద్ అదే ఇది

పట్టుకొని జోకిస్తే చేటాకే నడుము
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్తా పటాక్ అయ్యి తడుము
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
సత్తువని చూపిస్తే పిల్లోడ దినము
దత్తతనే ఇస్తారా మల్లెపూల వనము

ఇస్మార్టే  ఈ శంకరు
పేల్చేస్తా నీ బంకరు
వస్తావా నా సెంటరు
చూస్తారా నీ టెంపరు
అసలుకు నే కిరాకే నన్నే గెలక్కే
మసులుతుంది దిమాకే నువ్వే ఫసక్కే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక


ఒంపులలో దాచుంచా చెకుముఖి రాళ్ళు
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
నిప్పులనే పుట్టించు తాకించే వేళ్ళు
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
ఏన్నీళ్ళనే మింగేసి యమాగుంది ఒళ్ళు
తిన్నెలపై మంచేసా చలో జొన్న సేలు

ఇస్మార్టే ఈ శంకరు
సమరంలో యమకింకరు
అట్లైతే నువ్వు సూపరు
స్వర్గాలే మన ప్రోపరు
ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే
ఒద్దు అంటే సిరాకే తెల్ల వారాకే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక




ఉండిపో ఉండిపో పాట సాహిత్యం

 
చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా
ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే నా జీవితం
వదిలేసి వెల్లనంది ఏ జ్ఞాపకం

మనసే మొయ్యలేనంతగా పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటుందిగా
ఏదో చంటి పిల్లడిలా నేనే తప్పిపోయానుగా 
నన్నే వెతుకుతూవుండగా నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా

సరికొత్త తడబాటే మారింది అలవాటు లాగ
ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా
మెడవంక తాకుతుంటే మునివేళ్ళతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా సన్నజాజిలా నవ్వగా
ప్రాణం లేచివచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా కాటుక కళ్లనే తిప్పగా
నేనో రంగులరాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా

తల నిమిరి చనుబాత నువుగాని పొలమారుతుంటే
అమాటే నిజమైతే ప్రతిసారి పొలమారి పోతా
అడగాలిగాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా
ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాంకదా 
విడిపోయి ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
నిండా ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయిందిగా 
అంతం కాదులే మనకథ




బోనాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్ , మోహన భోగరాజ్ 

నీ ముక్కు పోగు మెరుపొలోన
పొద్దు పొడిసే తూరుప్పోలన
మైసమ్మ

యర్రా ఎర్రని సూరీడే
నీ నుదుటన బొట్టయ్యే
ఓ సళ్ళని సూపుల తల్లి
మాయమ్మా

అమ్మలగన్న అమ్మారన్న
పచ్చి పసుపు బొమ్మరన్న
యాప చెట్టు కొమ్మరన్న
ధూపామేసే దుమ్మురన్న

ఆషాడ మసమన్న
అందులో ఆదివారమన్న
కొత్త కుండల బోనమన్న
నెత్తి కెత్తెను పట్నమన్న

యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో

హే రాయే రాయే
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ
బల్కంపేట ఎల్లమ్మవే
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయిని మంకాలివే మా యమ్మ
ఊరూరా పోచమ్మవే

యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో

అరేయ్ రేవుల పుట్టిందమ్మ
రేణుక ఎల్లమ్మ
జేరిపోతులా తీసి జడల చుట్టింది
నాగు పాములా తీసి నడుమున కట్టింది
ఏడుగురు అక్క చెల్లెల్లు యెంట రాంగా
ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మ
మావురాల ఎల్లమ్మ
దండాలు తల్లి

థిస్ ఇస్ బార్క్ బార్క్ బర్కత్ పురా
డీజే ఇస్మార్ట్ డిస్ డిస్ డిస్కో బోనాల్

పెయ్యి నిండా గవ్వల్ని పర్సుక్కున్నవే
వెయ్యి కండ్ల తల్లి
నీకు యాట పొత్తులేయ్
నిమ్మకాయ దండల్లో
నిండుగున్నవే
కళ్ళు కుండా తెచ్చి
ఇంత సక్కా పోస్తమే

అరేయ్ చింత పూల
చీర కట్టినవే
చేత శూలం
కత్తి పట్టినవే
మొత్తం దునియానే
ఏలుతున్నవే

హే రాయే రాయే తల్లి
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ
జూబిలీ హిల్స్ పెద్దమ్మవే మాయమ్మా
జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే మాయమ్మా
లష్కర్ కె నువ్ రాణివే

యో సే యో సే
హే పోత రాజురో
అరేయ్ జజ్జనకర జజ్జనకర
తీన్ మారురో

యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో

ఏస్కో మామ తీన్ మార్

అగ్గి గుండాలలో నువ్వు బగ్గుమన్నవే
జుట్టు ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే
పుట్టలోన ఉన్నట్టు మట్టి రూపమే
బాయిలోన పుట్టి అల్లినవు బంధమే

హే గాలి ధూళి అంత నువ్వేలెయ్
జాలి గళ్ళ తల్లి నువ్వేలెయ్
ఈ జనమంతా నీ బిడ్డలెయ్

హే రాయే రాయే
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ

బెజవాడ దుర్గమ్మవే మా తల్లి
కలకత్తా మహాంకాలివే
కాంచీలున్న కామాక్షివే మాయమ్మా
మధురోలోన మీనాక్షివే

యో సే యో సే
అరేయ్ ఈరగోళ రో
అరేయ్ తొట్టెళ్లతో పొట్టేళ్ల
బండి కదిలేరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
థిస్ ఇస్ హమారా కిరాక్ బోనాల్ బోనాల్ బోనాల్

Palli Balakrishna Sunday, June 30, 2019

Most Recent

Default