Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mani Sharma"
Anaganaga O Ammayee (1999)



చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య, అబ్బాస్, పూనమ్ 
దర్శకత్వం: రమేష్ సారంగన్ 
నిర్మాత: కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 02.09.1999



Songs List:



స్వాతి చినుక పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సామవేధం షణ్ముఖశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

స్వాతి చినుక



ఉల్లె ఊళ్ళే ఉయ్యాలాలే పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

ఉల్లె ఊళ్ళే ఉయ్యాలాలే



కాకినాడ కాలేజీ పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: ఓరుగంటి ధర్మతేజ 
గానం: యస్.పి.బాలు 

కాకినాడ కాలేజీ 




నేనా నువ్వే నేనా పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుజాత

నేనా నువ్వే నేనా



టూ మచ్ టూ మచ్ పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: దేవి శ్రీ ప్రసాద్, కోరస్

టూ మచ్ టూ మచ్

Palli Balakrishna Sunday, December 3, 2023
Bedurulanka 2012 (2023)



చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: కార్తికేయ , నేహ శెట్టి 
దర్శకత్వం: క్లాక్స్
నిర్మాత: రవిచంద్ర బెనర్జి ముప్పనేని 
విడుదల తేది: 25.08.2023



Songs List:



వెన్నెల్లో ఆడపిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: హారిక నారాయణ్ , JV సుధాన్స్

వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా

చాలు చాల్లే గాలిమాటలాపు
పనేమి లేదుగాని నీకు
పలకరించే వెన్నెల్లో ఓ జాబిలమ్మా
పులకరించే కబుర్లు విందామురామ్మా

ఈ వేళ కాని వేళా
నీ దారి మారిపోదా
నిజాయితీగా ఉన్న
మగాడ్ని నమ్మరాదా
నా నీడ కూడా
నిన్ను తాకి ఉలికిపడెనుగా

వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా ఓ ఓ

దాయి దాయి అంటూ
నను పిలిచిందే కలా
ఇంత రాతిరేలా
నలుగురు చూస్తే ఎలా

ప్రపంచానికేం వేరే పని లేదుగా
మన పనేదో మనదే కదా
ఇదే మాట నానుంచి రాలేదుగా
మగువపైనే నిందేయగా
జోలాలిగా… సమయం కాదుగా
నిదుర ఈపూట దరిచేరునా

వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా

రేయి దాచుకున్న మెరుపుల జాబిల్లినీ
దొంగచాటుగానే నేలకు తెచ్చేదెలా
అరే నువ్వు ముందుంటే నిను చూడగా
చందమామే ఓడేనుగా

ఇలా కారుకూతల్ని చెబితే ఎలా
మనసు నీకే రాసివ్వనా
నీ వైపుగా…. కధ మారిందిగా
వెలుగు నీడల్లే నీ నా జత

వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా



Solluda Siva పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృద్వి చంద్ర 

భోగమంత ఇడువనే ఇడువవు
వింతగుందిరా
నువ్వేవడివి సొల్లుడా సివా
నువ్వేవడివి సొల్లుడా సివా

లోకమన్న లెక్కలకు అందవు
గొప్పగుందిరా
నువ్వేవడివి సొల్లుడా సివా
నువ్వేవడివి సొల్లుడా సివా

హోయ్ శివ బాధలే లేవా ఏంటి
శివ పైకి నువ్వు చూపవా ఏంటి
శివ భయమంటూ లేదా ఏంటి
శివ శివశివ శివశివ
శివ శివ శివ శివ

ఆడు ఈడు ఎవడు
పోటీ కాదంటాను
పొలుస్తూనే బతకద్దంటాను
ఉంటె ఉన్నన్నాళ్లు
నచ్చిన పని చేస్తాను
చస్తూ బ్రతికితే శాపం అంటాను

ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్

వచ్చిందనుకో కోపం
చూపించెయ్ నీ కోసం
మొయ్యనే మొయ్యకు
దాచే ఏం చేస్తాం

కలిగే నీ ఆనందం
కాసేపేగా నేస్తం
చివరికి ఏది కాదే నీ సొంతం

రానే రావు, ఇయ్యే ఇయ్యే ఇయ్యే
రాతిరి కలలే యే యా
చెయ్యని పనులే, ఇయ్యే ఇయ్యే ఇయ్యే
లేవో ఏంటో ఓ ఓ ఓ

ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్




దొంగాడే దొరగాడు పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సాహితి చాగంటి 

దొంగాడే దొరగాడు 




చిత్తడి చిత్తడి పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: మణిశర్మ , శంకర్ బాబు 

చిత్తడి చిత్తడి 



కొట్టర డప్పు పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: క్లాక్స్
గానం: ప్రుద్విచంద్ర, సురేష్ 

ఓరబ్బో, ఓర్నాయ్నా
ఇదేంట్రో ఈ మాయా

ఆయ్ బాబోయ్, ఆగలేంరోయ్
వచ్చేయండ్రో, వెయిటింగ్ ఇక్కడా

ఓరబ్బో, ఓర్నాయ్నా
ఇదేంట్రో ఈ మాయా

ఆయ్ బాబోయ్, ఆగలేంరోయ్
వచ్చేయండ్రో, వెయిటింగ్ ఇక్కడా

Palli Balakrishna Sunday, October 8, 2023
Vidyardhi (2004)



చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రమేష్ , అదితి అగర్వాల్
దర్శకత్వం: బాలచారి
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 09.12.2004


(ఆర్.బి.చౌదరి కొడుకు రమేష్ హీరోగా తొలి సినిమా)



Songs List:



సై సై సైటే వేద్దామా పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: గణపతి 

సై సై సైటే వేద్దామా



హైదరాబాద్ హైరబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఎల్.నవీన్
గానం: కృష్ణరాజ్ & కోరస్

హైదరాబాద్ హైరబ్బ 



ఒకే ఒక్కసారి పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఎల్.నవీన్
గానం: యస్.పి.చరణ్

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా 

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా 

ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ 
నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని 

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా 

పగలు రేయి నీ ధ్యాసే ఉంటు
ఏమి తోచక ఉన్నది
పదే పదే నీ మాటలు వింటు
పరవశించాలనున్నది

పగలు రేయి నీ ధ్యాసే ఉంటు
ఏమి తోచక ఉన్నది
పదే పదే నీ మాటలు వింటు
పరవశించాలనున్నది

ఓ హృదయమా పలకరించుమా
మెరుపల్లే రాక తెలుపుమా 

నీ స్నేహమే అందించుమా
ఒక చూపుతో ఓదార్చుమా
తెలుసుకో నేస్తమా నాలోన ఉన్న స్వరమా 

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా 

ప్రతిక్షణం మది పద పదమంటు
నీ వెంట వస్తున్నది

ప్రతిదినం నువ్వు నేనే అంటు
నీ నీడ నాతో అంటున్నది

ప్రతిక్షణం మది పద పదమంటు
నీ వెంట వస్తున్నది

ప్రతిదినం నువ్వు నేనే అంటు
నీ నీడ నాతో అంటున్నది

ఓ మౌనమా మాటాడుమా
ఒక ఊసుతో శాసించుమా
ఏదలోని రూపమే సుమ
నీలువెల్లా చీల్చి చూడుమా

చేరుకో ప్రాణమ నువ్వు లేక
నేనుండతరమా

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా

ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ
నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా 
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా




ఏం పిల్లా మాట్లాడవ పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: మల్లికార్జున్ & కోరస్

ఏం పిల్లా మాట్లాడవు 




విరిసే ప్రతి పువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: హరి హరన్ 

విరిసే ప్రతి పువ్వు 



ఆంధ్రా ఖిలాడి పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్థి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బండారు దానయ్య 
గానం: టిప్పు , మహలక్ష్మి 

ఆంధ్రా ఖిలాడి 

Palli Balakrishna Friday, October 6, 2023
Raa Raa Penimiti (2023)



చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: నందిత శ్వేతా 
దర్శకత్వం: సత్యా వెంకట్ 
నిర్మాత: శ్రీమతి ప్రమీలా గెద్దాడ
విడుదల తేది: 28.04.2023



Songs List:



ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: నీలకంఠ రావు 
గానం: రమ్యా బెహ్రా

ఈ వేళ



విన్నావంటే పాట సాహిత్యం

 
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: నీలకంఠ రావు 
గానం: సాహితి చాగంటి 

విన్నావంటే



వయసా ఆగవే పాట సాహిత్యం

 
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: నీలకంఠ రావు 
గానం: చారుమతి పల్లవి 

వయసా ఆగవే 



తలపుల దాయిలి మీద పాట సాహిత్యం

 
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: నీలకంఠ రావు 
గానం: కాల భైరవ 

తలపుల దాయిలి మీద
కంటీ కడవ పెట్టి
కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు
కోరస్:  కాసుంచారా నీకు

గుండె గుండెకు రాసి
సెమటా నలుగు పెట్టి
తానాలు సేయిత్తా
తరలి రారా నువ్వు
కోరస్: తరలి రారా నువ్వు

మొక్కే లేని నేలల్లో
మొగ్గే ఉంటాదా
నువ్వే లేక నీ నీడ
నిలిసి ఉంటాదా

సినుకే పెను సిలయై
తల మీద పడ్డాదా
అణువే అనుఅస్త్రమై
నిను ఎంటా పడ్డాదా

సినుకే పెను సిలయై
తల మీద పడ్డాదా
అణువే అనుఅస్త్రమై
నిను ఎంటా పడ్డాదా

తలపుల దాయిలి మీద
కంటీ కడవ పెట్టి
కన్నీరు గోరెచ్చగా కాసుంచారా నీకు
కోరస్: కాసుంచారా నీకు

గుండె గుండెకు రాసి
సెమటా నలుగు పెట్టి
తానాలు సేయిత్తా
తరలి రారా నువ్వు
కోరస్: తరలి రారా నువ్వు

ఇంకాసేపు ఊపిరి ఉగ్గబెట్టా రా
నా ఊపిరినే నీకిచ్చి నిలుపుకుంటా రా

ఒడిలో పాపడిలా
నిను ఎత్తుకుంటా రా
మగడా కడవరకు నిను హత్తుకుంటా రా

ఒడిలో పాపడిలా
నిను ఎత్తుకుంటా రా
మగడా కడవరకు నిను హత్తుకుంటా రా



ప్రాణేశ పాట సాహిత్యం

 
చిత్రం: రారా పెనిమిటి (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: నీలకంఠ రావు 
గానం: సాహితి చాగంటి 

ప్రాణేశ

Palli Balakrishna Friday, June 2, 2023
Shaakuntalam (2023)



చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: దేవ్ మోహన్, సమంతా, అనన్య నగాళ్ళ, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్ 
నిర్మాత: నీలం గుణ 
విడుదల తేది: 14.04.2023



Songs List:



మల్లికా మల్లికా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి 
గానం: అర్మాన్ మాలిక్ , శ్రేయా ఘోషల్ 

మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలికా
మల్లికా మల్లికా మాలతి మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక

హంసికా హంసికా జాగునే సేయకా
పోయిరా పోయిరా రాజుతో రా ఇక
అతనికో కానుక ఈయనా నేనిక
వలపుకే నేడొక వేడుకే కాగా

మహ నీలవేణి పూచే పూల ఆమని
రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వనసీమ
మరుని శరము పరమా
మధుర సుధల సుమమా ఆ ఆ
మనసు నిలుపతరమా

స్వప్నికా చైత్రికా
నా ప్రియ నేత్రికా
చూడవా చూడవా
ఏడి నా ఏలికా

సాగుమా మేఘమా మేఘమా
సాగుమా మేఘమా స్వామినే చేరుమా
వానలే వీణలై మా కథే పాడుమా
నీ చెలీ నెచ్చెలీ చూలు దాల్చిందని
శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా

మిల మిలా మెరిసెలే శారదాకాశమే
వెలవెలా వెన్నెలై వేగే మా ప్రేమే
తార తోరణాలై తీర్చే నింగి దారులే
నేలే పాలపుంతై నింపే ప్రేమ దీపాలే

మరుల విరుల రసఝరి లోనా
మనసు తడిసె లలనా
అమల కమల నయనా
తెలిసె హృదయ తపనా

ఆకులో ఆకునై ఆశ్రమ వాసివై
ఆశగా చూడనా ఆతని రాకకై

ఓ చెలి ఓ చెలీ ఎందుకే ఈ చలి
భూతలం నా మది శీతలం అయినది
మంచులే ముంచిన ఎంత వేధించినా
ఆతని అంశనే వెచ్చగా దాచని
శిశిరమే ఆశలా ఆకులే రాల్చిన
చిగురులే వేయగా చైత్రమే కానా

హేమంతాలు ఏలా సీమంతాల వేళలో
చిందే ఏలా బాల వాసంతలే నీలోనా
నెలలు గడచినవి నెలబాల
కదలి కడలి అలలా
అమర విమల సుమమా
సుగుణ మణిని కనుమా

కన్నులే వేచేలే కాయలే కాచేలే
ఆశగా చూడగా ఆతని రాకకై




ఋషివనంలోనా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీమణి 
గానం: చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం
ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా
మనువు కార్యానా వనము సాక్ష్యంలా

స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలచినాడు
చెఱుకు శరమే విసిరినాడే
చిగురు ఎదనే గెలిచినాడే

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం

వనములో నేను పూలకోసమే అలా
వలపు విరిసింది నిన్ను చూసిలా
అడవిలో నేను వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా

చుక్కల్ కొక చిలుకలే అలిగే
చుక్కందాలు మావని
కత్తుల్ తోటి తుమ్మేదే దూకే
పువ్వుల్ తేనె తమదని
చిక్కెన్ గాంత దక్కేనని నాకే
చక్కంగానే తగవులాడే
నీవే నాతో రా

స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడే

కలల సిరి వాగు ఆన దాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
మాలిని తీర లాలనింకా చాలిక
కొమ్మలను దాటి రావే కోకిలా

ఎల్లల్లేని యవ్వనవలోకం
మనకై వేచి ఉందిగా
కల్లల్ లేని కొత్త నవనీతం
మననే స్వాగతించగా
అడవిన్ గాయు వెన్నెలా రావే
రాజ్యాన్నేలు రాణివై నీవే
నీవే నేనై రా ఆ ఆఆ ఆ

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం



ఏలేలో ఏలేలో పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోన సాగే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దూరాలేవో చేరే తోవా

సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
ఓ ఓ ఓ ఓ దాయి

సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారే పట్టుకొచ్చిందే సందమామ
చెలికాని గూడే సేరగా

అమ్మే తాను అయ్యే వేళ
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా
తన పేనాలన్నీ తానే అయ్యేడా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఓరకంట సూసినావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దోర సిగ్గై నవ్వినావా

రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సూడంగానే బంటై ఉంటాడు హో ఓఓ
రాణిలాగ నిన్నే సూసేటోడు
నువు సేరంగానే దాసుడౌతాడు ఓ ఓ

మేళాలెన్నో తెచ్చి తను దరువే వేసీ
మేనాలెన్నో తెచ్చి నిను అతనే మోసి
పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా
ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
సంతోషంగా సాగే నావ
ఉయ్యాలై జంపాలై ఊగే నావ
ఊహల్లోన తేలినావా

తుపానైనా గిపానైనా రాని
రగిలేటి ఆశ దీపానార్పేనా హో
కోపాలైనా శాపాలైనా రాని
ఎదురీదే ఏటి కెరటాన్నాపేనా హో

ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్నా గాని మనసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి దారే దిబ్బయినా
దరి సేరాలమ్మ సాగే నావమ్మా
ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా

ఏలేలో ఏలేలో ఏలో యాలా
తీరాలెన్నో దాటే నావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సొంత గూడే సేరినావా





మధుర గతమా పాట సాహిత్యం

 
చిత్రం: శాకుంతలం (2023)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రమ్యా బెహ్రా

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగవే సాగక
అంగుళీకమా జాలైనా చూపకా
చేజారావే వంచికా

నిశి వెనుకే మెరుపు వలా
నిదురెనుకే మెళకువలా
నాలో నీ ఆశే ఓ శీతలం
మౌనంగా కూసే శాకుంతలం

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగావే సాగక
హృదయ సగమా నీ వెంటే తోడుగా
నేనే లేనా నీడగా

తారనే జాబిలె తోడునే వీడునా
రేయిలో మాయలే రేడునే మూసెనా
జ్ఞాపికే జారినా జ్ఞాపకం జారునా
గురుతులే అందినా అందమే ఎందునా
ఎదురవకా ఆ ఆ ఎన్నాళ్ళే ఏలికా
ఈ కన్నీళ్లే చాలికా

మధుర గతమా
కాలాన్నే ఆపకా
ఆఆ ఆ ఆ ఆగావే సాగకా

దూరమే తీయనా ప్రేమనే పెంచనా
తీరదే వేదన నేరమే నాదనా
ప్రేమనే బాటలో నీ కథై సాగనా
నీ జతే లేనిదే పయనమే సాగునా
కలయికలే కాలాలే ఆపినా
ఈ ప్రేమల్నే ఆపునా

మధుర గతమా
కాలాన్నే ఆపక ఆగవే సాగక
నిశి వెనుకే మెరుపు వలా
నిదురెనుకే మెళకువలా
నాలో నీ ఆశే ఓ శీతలం
మౌనంగా కూసే శాకుంతలం

Palli Balakrishna Tuesday, April 4, 2023
Yashoda (2022)



చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: సామంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ 
దర్శకత్వం: హరి హరీష్ 
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 11.11.2022



Songs List:



Baby Shower పాట సాహిత్యం

 
చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి 

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

లాయి లాయి చిన్నారి చెల్లాయి
కన్నకలలు నెరవేరనున్నాయి

డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ముద్దుగుమ్మకు మురిపాల సీమంతం
ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిద్దాం

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

పుట్టింటివారైనా అత్తింటివారైనా
నీ అక్కచెల్లెళ్ళం మేమే
హమ్మమ్మో చెయ్యొద్దు ఏ చిన్నిపనైనా
నీ మంచిమన్ననంతా మాదే

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
కన్నా రా నువ్వింకా హాయిగ నిద్దురపోవాలి
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
నీ హాయే పాపాయై పొత్తిళ్ళల్లో వాలాలి

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

ప్రాణాల అంచుల్లో తానాలు పోసేటి
త్యాగ గుణమే అమ్మా
బరువైన బంధాన్నే మునిపంట మోసేటి
ఆదిశక్తి  ఆడజన్మ

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
బుజ్జి బుజ్జి బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
దేవుణ్ణే నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

Palli Balakrishna Friday, November 25, 2022
Nenu Meeku Baaga Kavalsinavaadini (2022)



చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ 
రచన: కిరణ్ అబ్బవరం
దర్శకత్వం: శ్రీధర్ గాదె 
నిర్మాత: కోడి దివ్య దీప్తి 
విడుదల తేది: 16.09.2022



Songs List:



లాయర్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రామ్ మిరియాల 

లాయర్ పాప 



నచ్చావ్ అబ్బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ్, లిప్సిక

నచ్చావ్ అబ్బాయ్ 



మనసొక మాటే పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి

మనసొక మాటే 




అట్టాంటి ఇట్టాంటి పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కీర్హన శర్మ, సాకేత్ 

అట్టాంటి ఇట్టాంటి 



చాలా బాగుందే ఈ ప్రయాణం పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఆదిత్య అయ్యంగార్ 

చాలా బాగుందే ఈ ప్రయాణం
నాతో వస్తోందే నా సంతోషం
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నిజంగా నిజంగా ఏంటో ఇదంతా
కలేమో అన్నట్టు ఉంది కదంతా
అందంగా మారిందే వెళ్లే దారంతా
కళ్ళారా చూస్తున్న నాలో కేరింతా

ప్రేమా ప్రేమా నేనే స్వయానా
పడిపోతున్నా పరాకులోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ

నవ్వుల్లో ముంచావే నన్నే అమాంతం
నాకంటూ ఏముంది నువ్వే సమస్తం
నాతోటి నువ్వుంటే ఏదో ప్రశాంతం
దూరంగా వెళ్ళావో అదే యుగాంతం

నీతో గడిపే క్షణాలకోసం
కాలం కాళ్ళే పటేసుకోనా

షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
షేహ్నాయి మోగిందే గుండెళ్లోన
వాహ్వా ఈ వైభోగం వరమనుకోనా
ఓహో, ఆ ఆ ఓహూ ఆ ఆ



మనసే (Family Song) పాట సాహిత్యం

 
చిత్రం: నేను మీకు బాగా కావలసినవాడిని (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ, రమ్యా బెహ్రా

మనసే (Family Song)

Palli Balakrishna Thursday, October 13, 2022

Most Recent

Default