Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dimple Hayathi"
Ramabanam (2023)



చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: గోపీచంద్, 
దర్శకత్వం: శ్రీవాస్ 
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
విడుదల తేది: 05.05.2023



Songs List:



ఐఫోన్ సేతిలో పట్టి పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిర్యాల, మోహన భోగరాజు

ఐఫోన్ సేతిలో పట్టి
హై క్లాసు సెంటె కొట్టి
హై హీల్స్ చెప్పులు తొడిగి
తిక్క తిక్క బోతే ఉంటె
తిప్పుకుంటా పోత ఉంటె
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల

రోలెక్స్ ఘడి పెట్టి
రేబాన్ జోడు బెట్టి
రేమాండ్స్ సూట్ తొడిగి
రేంజ్ రోవర్లా వస్తా ఉంటె
రయ్యు రయ్యునా వస్తా ఉంటె
నా పానం ఆగదు పిలగో
తెర్సుకుంది గుండెలో గొడుగో
నా పానం ఆగదు పిలగో
తట్టుకైనది ఎలాగో పిలగో

నీ పిప్పరమెట్టె వొల్లే
సప్పరించి పోయే తిల్లే
బుర బుగ్గల్లే మెరుపల్లె
పెంచినాయే కరెంటు బిల్లే
నా బుజ్జి బంగారు కొండా
నీ పోలిక సల్లగుండా
పోరి సోకె నువ్వుల ఉండా
ఆడుకోరా గిల్లి దండా
నడుములో భూకంపాలు
సూపించదే రిక్టర్ స్కేలు
నాభి లోతు సుడి గుండాలు
నా పాణం నా పాణం
అరెరే నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో

నువ్వు కస్సున సుత్తే సాలు
ఆడుతలే సెయ్యి కాలు
నీ ఒంపులో ఫెవికాలు
అత్తుకున్నాయి రెండు కళ్ళు
ఇది రింగు రింగు పిట్టా
నీ పైనే వాలిందిట్ఠా
అందాల ఆనకట్ట
తెంచుకోరా ఒంపు మిట్టా
ఏమున్నవే కోరమీను
నీ నవ్వే ఓ విటమిన్
నీ జల్లో నా జాస్మిన్
నేనయ్యి ఉంటా రావే నా జాను
నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల



దరువెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కృష్ణ తేజస్వి, చైత్ర అంబలపూడి

ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి
అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి

కొత్త రూపం ఎత్తాలయ్య
సెడుని మట్టు పెట్టాలయ్యా
నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా
నరసింహయ్య

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

నింగి హోరెత్తగా… కలవా కలవా
నేల శివమెత్తగా… గలబ గలబలేక
చిందు కోలాటాలు… చెక్క భజనల్లోనా
నీ ఒంట్లో నా ఒంట్లో… నరసన్న పూనాలిరా

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

సింగమంటి సిన్నవాడ
నీలో కంట బిరుసు ఉన్నదిరా
ఉన్న ఊరు నిన్ను చూసి
గుండె రొమ్ము చరుసుకున్నదిరా

దిష్టి తీసి హారతిచ్చి
ముద్దు మిటికలిరుసుకున్నదిరా ఆ ఆ
నీలాంటోడు ఉన్న చోటా
ఏ చీకు చింత ఉండదంటా

మనిషంటా ఒక్క సగం
మృగమంటా ఇంకో సగం
నరసన్నే చూపాడురా
మనలో ఉన్న గుణం

మంచి ఉంటే మంచిగుంటాం
రెచ్చగొడితే హెచ్చరిస్తాం
పడగెత్తే పాపపు మూకల
తోకలు కత్తిరిస్తాం

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న



నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: రితేష్ జి.రావు

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ

ఓ పికాసో డావెన్సీ కలగలసీ
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి
పిచ్చెక్కే మైకంలో నన్నే
నే మరచి మైమరిచి
నీ లోకంలో అడుగేస్తున్న
ఇక అన్నిటిని విడిచీ

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ
పికాసో డావెన్సీ కలగలసి
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

ఓ ఫుల్ మూన్ రోజు నాకే
ఫోన్ కాల్ చేస్తోందే
తన వెన్నెల ఎక్కడ ఉందో
చెప్పమని అడిగిందే

కళ్ళముందె నువ్వున్నా
తనకి నే చెప్పనులే
కాలమంతా నీతోనే
కలలు కంటున్నాలే

నా మనసే మనసే మరి
నా మాట వినను అందే
తెలియని వరసే వరసే కలిసే
నన్నే కాదలివ్వమందే

షురువాయే దిల్ సే దిల్ సే, దిల్ సే
న్యూ రొమాన్స్ డాన్సే
ఇంతక ముందరెప్పుడు
ఇంత కొత్తగా లేదులే

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హేవే 




మోనాలిసా మోనాలిసా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీ కృష్ణ, గీతామాధురి

కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి
కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి

మోనాలిసా మోనాలిసా
నడుమే నల్లపూస
చెవిలో చెప్పుకుందాం
నువ్వు నేను గుసగుస
హే మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస
కాదు కాదు అంటానా
కాదు కాదు అంటానా
రాను రాను అంటానా
ఈలా కొట్టి రమ్మంటే
గోడ దూకి వచ్చయినా
బొట్టు పెట్టి రమ్మంటే
పెట్టె సద్దుకొచ్చేయినా
నేనెట్టగుంటా తెరేబీనా
సరికొత్తగా మహా మత్తులో
పడిపోతిని కల్కత్తాలో కనులు చెదరగా
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస

సిగ్గు ముంచుకొస్తాందిరా
మీద మీదకొస్తుంటే
అగ్గి పుట్టుకొస్తదిరా ఆవురావురంటుంటే
సిగ్గు ఎగ్గూ ఎందుకు లేదు
పక్కన పెట్టేదాం
ఈ అగ్గి మాన్తా సంగతి ఏంటో
ఇపుడు తేల్చేద్దాం
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నన్ను నేను లాగేదెట్టా
గిల్లి గిల్లి గలాటకి ఎక్కాఏకి రా మరి
రా మరి రా మరి రా…
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి

Palli Balakrishna Tuesday, May 23, 2023
Khiladi (2022)



చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి
దర్శకత్వం: రమేష్ వర్మ 
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ 
విడుదల తేది: 11.02. 2022



Songs List:



ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిప్రియ 

చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం

కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం

తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం

గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం

ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం





ఖిలాడీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రామ్ మిరియాల

హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్
హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్
వీడు ఎదురయ్యే టైమింగు
డేంజర్ తో డేటింగు
యు గాట్ టు రన్ ఫాస్టర్

హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్
మనీ మోన్స్టర్
వీడితో నీకు మీటింగు
హెల్ తోటి గ్రీటింగు
లైఫే రోలర్ కోస్టర్

స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల
వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల
రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ
కొత్త హైట్ చూపిన హవాలా

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

లోకం యాడున్నా లిక్విడ్ మనీ
ట్రాకర్ లా లాగే వాలా
లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ
హ్యకర్ లా పట్టే వాలా

పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని
జోకర్ లా మార్చేవాలా
గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని
స్ట్రైకర్ లా కొట్టేవాలా

బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా
ఏకైక హ్యూమన్ వీడే
హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా
స్కెచ్ ల్తో నింపేశాడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ

అకౌంట్ బుక్కులో టాలీ కానీ… లెక్కలకే బ్యాలన్సరు
ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా… సరికొత్త ఫ్రీలన్సరు
కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా… మనకుంటే తప్పేంటి
సలహాలు ఇస్తూనే సర్వం దోచే… అరుదైన అడ్వైజరు

సొంత బాడీనంటి ఉంటోందని
నీడలకే రెంట్ ఏస్తాడే
సెంటీమీటర్ సెంటిమెంటే లేని
సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ




అట్టా సూడకే పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: దేవీశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే
షాకే సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే





ఫుల్ కిక్కు పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: సాగర్, మమతా శర్మ 

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి
మాస్ సాంగ్ అన్న
అయ్యబాబోయ్ మాసే
అః మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు

నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకే పెంచెను పల్సు
అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్ వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్
అవి నాకంట పడుతుంటే 
ఆ మంట నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్
కెలికేసిన దానితోటి నా ఛానెల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావు ఓ డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు

నేనున్న చోటు పసిగట్టే నీ  టాలెంట్స్
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్
మన మధ్య మొదలు పెట్టాయి నీ యాక్షన్స్
మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్
ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సొమెథింగ్స్యూ
మన ఇద్దరి మధ్యన లిరిక్స్
ఫుల్ అఫ్ రొమాన్స్
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు




క్యాచ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: నేహా బాసిన్,  జస్ప్రీత్ జస్జ్

హలో మిస్టర్ మాచో మ్యాన్
నాతో కొంచెం నాచో మ్యాన్
నాటీ డేటే పూచో మ్యాన్
మిస్సయితే రాదు సోచో మ్యాన్

రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డై
రారా సూపర్ మ్యాన్

హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్

క్యాచ్ మీ, క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ, టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హే పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా

హేయ్, బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

హేయ్, ఖిల్లాడి
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ

హేయ్ అమ్మాడి..!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి

హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా
నీలోని రొమాన్స్ ని తీయింకా
నీ షైని షైని మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ వాట్ యూ కెన్?

Palli Balakrishna Wednesday, February 9, 2022
Samanyudu (2022)



చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: విశాల్, డింపుల్ హయాతి
దర్శకత్వం: సరవనన్ 
నిర్మాత: విశాల్
విడుదల తేది: 2022



Songs List:



మత్తెక్కించే కళ్ళే పాట సాహిత్యం

 
చిత్రం: సామాన్యుడు (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీమణి 
గానం: యువన్ శంకర్ రాజా 

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
నేనేం చెయ్యాలి

నీతో అడుగే పడితే
నాలో ఒంటరితనమొక సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పదవే

కనుసైగ తోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని
నన్నే నిన్ను గిల్లుకుని

ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఏం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళి చావని

ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కధగా
మన ప్రేమని చరితే చదివేయ్ని

నీ బుగ్గల్లోని సిగ్గే
చీకట్లో వెన్నెల
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెల

కనుసైగతోటి పిలుపివ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అందించు చాలే
ఈ లోకమంతా ఏలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే
పిచ్చెక్కించే చూపే
నిముషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధమైతే
ఏం చెయ్యాలి

Palli Balakrishna Wednesday, January 19, 2022

Most Recent

Default