-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Deva Katta"



చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్ , జగపతి బాబు, రమ్యకృష్ణ
దర్శకత్వం: దేవ కట్టా
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లయ్య
విడుదల తేది: 01.10.2021



Songs List:



Gaana of Republic పాట సాహిత్యం

 
చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహ్మాన్
గానం: అనురాగ్ కులకర్ణి, ధనుంజయ, పృద్విచంద్ర, హైమత్ మహమ్మద్, ఆదిత్య అయ్యంగార్

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

నా ప్రాణంలోని ప్రాణం… నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం… నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా

నా కళ్ళలోన రంగుల కలరా, ఆ ఆఆ
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బతుకులోన బాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే, ఏ ఏ
అంతలోనే తెలిసిందది మాయమై పోయిందని
ముందుకన్నా ముప్పుఉన్న పంజరానా ఉన్నదని

అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా, ఆ ఆఆ
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు… అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం… చెరలో బంధించారు, ఊఊ ఊ
రెక్కలనే విరిచేసి… హక్కులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని… అణిచి అణిచి వేసినారు

నరజాతి చరిత్రలో నలిగిపోయెరా
చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్చరా
నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా, ఆ ఆఆ
కనిపించక నడిపించే కాంతిరా

ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో
ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ||2||




జొర్సే బార్సే పాట సాహిత్యం

 
చిత్రం: రిపబ్లిక్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
సాకీ: శ్రీనివాస్ దరిమి శెట్టి
గానం: అనురాగ్ కులకర్ణి

సిగురు సింతల మీద రామ సిలకలోయ్
పగలెదిగినాయి సూడు సెంద్రవంకలోయ్
సెరుకూ పిల్లాడు సూసే సూపు సురుకులో
కలికీ బుగ్గలమీద సిగ్గు మరకలోయ్
సూడబోదమా ఆడబోదమా..!!

సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా

జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ

ఢమఢమ జాతర పండుగరోయ్
గుమగుమ పువ్వుల దండలు వెయ్
కనులతో కాచే తల్లికి జై
తనువుతో పొర్లి దండం సెయ్

ఢమఢమ జాతర పండుగరోయ్
గుమగుమ పువ్వుల దండలు వెయ్
కనులతో కాచే తల్లికి జై
తనువుతో పొర్లి దండం సెయ్

ఎన్నెల్లో కొల్లు యేరు
తానమాడుతున్నాదంటా… ఎల్దామా ఎల్దామా
సరసుతోని సెందురుడు
సరసమాడుతున్నాడంట… ఎల్దామా ఎల్దామా
గాలి సెంపా గిల్లుతుంటే
పూలు సిగ్గు పడతాయంటా… ఎల్దామా ఎల్దామా
వలసా పచ్చులొచ్చి నీళ్ళ హోళీ జల్లుకుంటాయంట

సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా..!
హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా

జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే, ఏ ఏఏ

పసుపుకుంకాలు గాచే పార్వతమ్మ రూపమంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డల కోసం కొలువైన తల్లేనంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
రంగురంగుల ప్రభాలు కట్టి… తారంగమాడుకుంటా
ఎల్దామా ఎల్దామా
ఏ, ముడుపుకట్టుకున్న జంట… ముళ్ళు ఏసుకుంటాయంటా

జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ
జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ

Palli Balakrishna Friday, October 1, 2021


చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగచైతన్య , సమంత, రకూల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్
దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 27.06.2014









చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రెహ్మాన్
గానం: అనూప్ రూబెన్స్

ఓ నువ్వేలేని నేను లేనులే చెలి
నిన్ను చేరే దారి చూపవా చెలి
ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా
ఏదేమౌతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా
ఉన్న ప్రాణం నీవేలే...

ఏ ఏ ఏ ఏ
మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీ

నీ చూపే నా శ్వాసగా 
నీ రూపే ఓ ధ్యాసగా జీవిస్తూ ఉన్నా నీకై వేచున్నా
కనులు మూసిన కనులు తెరిచినా నీవే నీవే
కడలి నీవు అని అలలు నేను అని
ఏ చోటైన ఏ నాడైన నిన్నే నేను చూస్తూ ఉన్నాలే

మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీ

కాలం వేగం మారదా వీచే గాలి ఆగదా
కాలం నేడిలా చెంత చేరగా
కునుకు  మరచిన కనుల కాంతిలే నీవే నీవే...
వెలుగు నీవు అని నీడ నేను అని
నాలో ఉన్న నాతో ఉన్నా నావనుకున్న అన్నీ నీవేలే

మంచెలీ..
ఓ నువ్వేలేని నేను లేనులే చెలి
నిన్ను చేరే దారి చూపవా చెలి
ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా
ఏదేమౌతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా
ఉన్న ప్రాణం నీవేలే...

మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీ







చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్

ఒరేయ్ గోలిగా ఆ ఇప్పుడు నా
సిరి ఏమందో సింగల్ లైన్లో క్లియర్ గా చెప్పరా
అదే బావ ఇందాక నువ్వేదో కల అన్నావే
అది కాదు నిజం అని చెప్పెల్తుంది ఆహా 

ఎంత రా గోలిగా టైం ఎంత రా
టైం చెప్పరా గోలిగా టైం ఎంత రా 
ఒకటా రొండా మూడా ఏడా 
రేయి పగలు తేడాలేమీ తెలియకుందిరా
ఓ ఆకాశం రంగు చూడరా నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా 

అమ్మాయో భయమే లేనోన్ని 
బెదురే రానోన్ని అయినా అయినా ఇదిగో
ఈ తడబాటెందుకంట 
ఓ సైరెన్ కూస్తున్నా మెలుకువ రానోన్ని
చిటికెల సడికే లేచేస్తున్నా ఇదేమిటంటా
ఎవడూ లేకున్నా హారన్ కొడుతున్నా
హారన్ వింటున్నా అక్కడే నిలబడుతున్నా
ఇది ఏమి వింతరా 

ఓ ఎవరైనా జంట ఎదురయ్యారంటే
తనలా నాలా కనిపిస్తారే కల ఇదంతా
ఓ ఎవరూ నాచెంత లేనే లేకున్నా
తనతో జతగా గడిపేస్తున్నా కాలాన్ని కొంత
చీకట్లో ఉన్నా అన్నీ చూస్తున్నా వెలుగెంతో ఉన్నా
ఇది ఏమి మాయ రా 

ఓ టైం ఎంత రా
టైం చెప్పరా గోలిగా టైం ఎంత రా 
ఒకటా రొండా మూడా ఏడా 
రేయి పగలు తేడాలేమీ తెలియకుందిరా
ఓ ఆకాశం రంగు చూడరా నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా 







చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ
గానం: అనూప్ రూబెన్స్, రీతు పతాక్

సూపర్ అన్నా 
అబ్బో ఏస్కో
సర్రు సూపరే 
సూప రే సూపరో 

హేయ్ హైదరాబాదు బిర్యానీ సూపరుంటాది
ఔనా 
హే రాయలసీమ రాగి సంగటి సూపరుంటాది 
ఔనా
యే గుంటూరు గోంగూర సూపరుంటాది - ఔనా
కాకినాడ కాజా సూపరుంటాది
లేత లేత పెదవుల్తో కిళ్ళి నోటికందించి
మీకు తీపి ముద్దే ఇస్తే 
అబ్బో ఇస్తే ఎట్లుంటదమ్మ 

సుర్ర్... 
సూపరుంటాది ఇంకా సూపరుంటాది  
సూపరుంటాది చాలా సూపరుంటాది
సూపరుంటాది ఇంకా సూపరుంటాది  
సూపరుంటాది చాలా సూపరుంటాది 
చాలా సూపరుంటాది  హేయ్

హేయ్ హైదరాబాదు బిర్యానీ సూపరుంటాది
రాయలసీమ రాగి సంగటి సూపరుంటాది

మోడలింగ్ లోన నాకు పేరున్నాది - అబ్బ 
ఆ రీమోడలింగ్ లోన మేము కింగులమండి
స్పానర్లను పట్టి మీకు పవరున్నాది 
ప్రయోగిస్తే నాపై మజాగుంటది - ఔనా 

హై స్పీడు సీల్డ్ బైక్ నేను
షోరూం లోనే ఇంకా ఉన్నాను
నా బాడీ కాస్త పట్టి పట్టి యాక్సలేటర్ ఇచ్చి ఇచ్చి
రయ్యిమంటూ పరిగెత్తిస్తే
ఏ.. అబ్బ ఎట్లుంటాదేటి

సుర్ సుర్ సుర్ ర్..
సూపరుంటాది ఇంకా సూపరుంటాది సూపరుంటాది చాలా సూపరుంటాది
సూపరుంటాది ఇంకా సూపరుంటాది సూపరుంటాది చాలా సూపరుంటాది

యే హార్స్ పవరు ఎక్కువున్న పోష్ కారును 
ఆయ్ క్లచ్ పట్టి గేర్ మార్చి కంట్రోల్ చేస్తాం 
క్లాస్ మాసు డ్రైవింగుని మెచ్చుకుంటాను
స్పీడ్ బ్రేక్ అయినా కుదుపు తట్టుకుంటాను

నా  స్టీరింగ్ మీద చెయ్యి వేస్తే 
సరదాకి టెస్ట్ డ్రైవ్ చేస్తే 
యే కారే మనకు పైవ్ స్టార్
ఇరుకు షడ్డ సెవెన్ స్టార్ 
నువ్వు నేను సెట్ అయిపోతే 

సూపరుంటాది ఇంకా సూపరుంటాది సూపరుంటాది చాలా సూపరుంటాది
సూపరుంటాది ఇంకా సూపరుంటాది సూపరుంటాది చాలా సూపరుంటాది

అబ్బా సూపర్

Palli Balakrishna Monday, March 5, 2018


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: సుదీప్ , అరవింద్, దేవన్
నటీనటులు: రాజా, పార్వతి మెల్టన్, శర్వానంద్, రవివర్మ
దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాతలు: రవి వల్లభనేని, సచి పినగపని, చలపతి మన్నూరు
విడుదల తేది: 26.11.2005

పల్లవి:
భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది
రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది
భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది
రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది
చక్కని పిల్లాడు సోకైన పిల్ల
బస్టాండ్ షెల్టర్లో చూశారంట
కాలేజీ కాంటీన్లో కలిసింది చూపు
ఇద్దరి నడుమ మెరిసిందో ప్రేమ

నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు

చరణం: 1
పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం
పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం
టెక్సాస్లో ఉద్యోగం వెగాస్లో ఉల్లాసం
పారిస్లోన పెళ్లి హాలండ్ హనీమూన్
ఇటలీలోన టూరంట సింగపూర్లో షాపంట
నైలు నదిలో ఈతంట లండన్ గదిలో రెస్ట్ అంట

ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు
అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు

చరణం: 2
ముంబై వజ్రం హవాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం
ముంబై వజ్రం హవాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం
తైవానోడి షర్టు బర్మావాడి ప్యాంటు
జెర్మనోడి కారు చైనా ఓడి బ్లేడు
హిందుస్తాను కోనంట
జపానోడి ఫోనంట
అరబ్బోడి ఆయిలంట హాలీవుడ్ ఫిల్మంట

ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు.....
అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు

నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు


*******  *******  *******


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: సుదీప్ , సైందవి, రజిని, దేవన్

ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు
జగమంతా కనిపిస్తావు

పండుగ నీవు నా పచ్చిక నీవు (2)

చరణం: 1
మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగివున్నా
గాలిలో ఈ కల తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరివున్నా
నీ శ్వాసకోసం మానై ఉంటా
నీ మాటకోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వుకోసం అలుసై పోతా

జాబిలికే వెన్నెల నీవు
సూర్యునికే వేకువ నీవు
ఊపిరిలో ఉష్ణం నీవు
ఊరించే తృష్ణం నీవు

శూన్యం నీవు నా శోకం నీవు (2)

చరణం: 2
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పి నన్నాదుకోవా
నీ తోడుకోసం ఆవిరైపోనా
నీ స్పర్శకోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా

నీలానికి నింగివి నీవు
కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు
భావానికి మూలం నీవు

ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం



**********  ***********  ***********


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: రవివర్మ , దేవాకౌశిక్

Come on girls
రోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి ఫైవ్ స్టార్ లైఫ్ ఇస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
చేస్తారా లవ్ చేస్తారా లవ్
రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు
గంటకొక్క లక్ష వద్దు 5 స్టార్ లైఫ్ బోరు
తియ్యనైన మాట చెప్పవోయ్
తియ్యనైన మాట చెప్పవోయ్

చరణం: 1
సల్మాన్లా సెక్సీగుండి బచ్చన్లా బారుగుండి
సచ్చిన్లా సిక్స్ కొట్టి టైసన్లా మజిల్స్ ఉంటే
చేస్తారా లవ్ చేస్తారా లవ్  చేస్తారా లవ్ చేస్తారా లవ్
సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు
ఫోరులొద్దు సిక్సులొద్దు నల్లరాతి కండలొద్దు
గుండె తాకు చూపే చాలునోయ్
గుండె తాకు చూపే చాలునోయ్

చరణం: 2
గుండు గీసి గుండీ విప్పి
బ్లడ్ తీసి బొట్టే పెట్టి రఫ్ కట్ ఫేస్ తోటి
అడుగు అడుగు వెంట వస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్
గుండు ఉన్న గూండాలొద్దు బ్లడ్ చూపే సైకోలొద్దు
రఫ్ కట్ రాంగు బాసు ఊరకుక్కల్ వెంట వద్దు
చందమామ చందం నచ్చునోయ్
చందమామ చందం నచ్చునోయ్

చరణం: 3
భక్తీ పూజ పుణ్యాలంటూ పంగ నామం పైన పెట్టి
పైసా పైసా కూడబెట్టి చదువుల్లోన ఫస్టుంటె
చేస్తారా లవ్ చేస్తారా లవ్
భక్తి పూజ కొంచెం చాలు పంగ నామం ఫాషన్ కాదు
పైసల్ చేర్చే పీచుల్ వేస్టు చదువుల్ మాత్రం లైఫైపోదు
కుర్రకారు కబురే చెప్పవోయ్
కుర్రకారు కబురే చెప్పవోయ్

చరణం: 4
హీరోలంటే ఏంటి మీకు చెప్పి చావవొచ్చు మాకు
ఎందుకింత పాడు లొల్లి సింగిల్ హింట్ ఇచ్చి చూడు
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్
వట్టి మాటల్ కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు
సొంత సొత్తు కొంచెం చూపు
టైమింగ్ చూసి లవ్ చెప్పు
పెళ్లి కార్డు మాకు పంపారో
పెళ్లి కార్డు మాకు పంపారో


*********  *********  *********


చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: టిప్పు

సూపర్ మోడల్ లాంటి పిల్ల ఒకతొచ్చె గుండె గుచ్చె
నా చూపులు కదిపి ఊహలు చెడగొట్టిపోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చిందో కలత రేపి కలలెక్కి పోయిందో
నెమలీకలా అడుగేసి వచ్చిందో మల్లికలా విరుగాలి వీచిందో
సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే గుండె గుచ్చె
నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టి పోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చాడు కలత రేపి కలలెక్కిపోయాడు
మేఘంలా వర్షించి వచ్చాడు మోహం రేపి మరులిచ్చి పోయాడు

చరణం: 1
మెరుపై వచ్చి మెలకువిచ్చి కవితను నేర్పింది
శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసింది
కిన్నెరసాని పున్నమి రాణి రధమున వచ్చింది
కోకిల వాణి నవ్వుల బాణి పదమై వెలిసింది
వెల్లువై తరుముకు వచ్చిందో
ఉప్పెనై ఎత్తుకు పోయిందో
దేవతై దర్శనమయిందో
వేవేల వరములు ఇచ్చిందో

చరణం: 2
మాటలు చెప్పి మాయలు చేసి చూపులు దోచాడు
గుండెను మీటి గొంతున పొంగి స్వరముగా మారాడు
మిన్నులు వీడి వెన్నెల రాజు వేటకు వచ్చాడు
కన్నయ్యలాగా కన్నెను చేరి వేణువులూదాడు
వేసవై వేడిగా వచ్చాడు
వేకువై వెచ్చగా తాకాడు
నదిలా నురగలు చిందాడు
నీడై మారి తోడుగా ఉన్నాడు

Palli Balakrishna Saturday, July 29, 2017


చిత్రం: ప్రస్థానం (2010)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: వనమాలి
గానం: సాహితి, మహేష్ శంకర్
నటీనటులు: శర్వానంద్, సందీప్ కిషన్, సాయి కుమార్, రూబీ పరిహార్
దర్శకత్వం: దేవ కట్టా
నిర్మాతలు: రవి వల్లభనేని, విజయకృష్ణ.ఎల్
విడుదల తేది: 16.04.2010

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్నింతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలో పాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా

ఏ వైపుగా నా అడుగు సాగినా
నీ ముంగిటే ఆ నడక ఆగినా
ఏం దాచినా ఈ రెప్పల్చాటున
నీ రూపమే నా కనులు చూపిన
ప్రేమంటే ఎవరికైనా
అలవాటు లేని ప్రేమగా
తపనెంతగా తరుముతున్నా
తడబాటు తొలగి నేనేగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా

ఈ గుండెలో నీ కలల సవ్వడి
విన్నానులే నీ వెంట గారడీ
నీ చూపులే నా వయసు వెంబడి
ఆపేదెలా నీ చిలిపి అలజడి
క్షణమైన నన్నువీడి నీతలపే ఉండనందా
గతమెంతగా తోడుతున్నా
నేనే నీ చోటు ఉన్నాగా

ఇన్నాళ్లుగా నేను నేనుగా
ఉన్నానులే ఈ తీరుగా
ఈనాడిలా ఉన్నపాటుగా
అయ్యానులే నేన్నీవుగా
వస్తానుగా వెన్నంటే నీడగా
ఉన్నానుగా గుండెల్లో నిండుగా
నన్ను ఇంతగా నీవే మార్చేశావుగా
నన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదా
అంతేనుగా నీ మాటే నీదిగా
ప్రేమించగా నీ మధి వేసే నాలోపాగా

ఇన్నాళ్లుగా...

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default