చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి నిర్మాత: రమేష్ పి.పిళ్ళై విడుదల తేది: 28.12.2018
Songs List:
ఏవో రంగుల పరిచయం పాట సాహిత్యం
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీచరణ్ జంగా ఏవో రంగుల పరిచయం
ఏ మాయో ఏమో తెలియదే పాట సాహిత్యం
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: విశ్వనాథ్ కారసాల గానం: సునీత ఏ మాయో ఏమో తెలియదే తెలిసేదెలా మనసుకే అడిగా తొలిగా నన్నే ఎవరనీ రోజూ చూడని తీరే నీదని ఏమైనదో తెలియదే తెలిసేదెలా మనసుకే మనసా నా మనసా.. నా మనసే.. ఓ.. ఓఓఓ.. తెలియని భావాలన్నీ తోడై నన్నే చేరీ నాతో చేస్తున్న సావాసమా అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని ప్రేమ గీతాల ఆలాపనా.. కురిసే వరమై ఎదనే తడిమెనుగా కలిసే వరసై మనసే మురిసెనుగా అయ్యయ్యయ్యో నీలా ఎలా ప్రేమే నాలో చేరిందెలా.. ఏ మాయో ఏమో తెలియదే తెలిసేదెలా మనసుకే కొత్తగ నాకే నేను పరిచయమౌతున్నాను నాలో ఈ మాయ నీదే సుమా చిన్ని మోమాటాలే చెప్పే మౌనంగానే ప్రేమ బాగుంది నీ భావనా పలికే పెదవే సడినే మరిచెనుగా ఐనా మరిలా నీ పేరే పలికెనుగా అయ్యయ్యయ్యో నీలా ఇలా ప్రేమే నాలో చేరిందెలా ఏ మాయో ఏమో తెలియదే తెలిసేదెలా మనసుకే అడిగా తొలిగా నన్నే ఎవరనీ రోజూ చూడని తీరే నీదని ఏమైనదో తెలియదే తెలిసేదెలా మనసుకే మనసా నా మనసా.. నా మనసే.. ఓ.. ఓఓఓ..
నీతోనే పాట సాహిత్యం
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సునీల్ కశ్యప్ నీతోనే
సత్కర్మభీశ్చ సత్ఫలితం పాట సాహిత్యం
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: మధురకవి కోగంటి వెంకటా చార్యులు, రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్, సునీల్ కశ్యప్ సత్కర్మభీశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ సత్కర్మభీశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచీ కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఏ కన్నూ చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా... ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ సత్కర్మభీశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే
What The BEEP (promotional song) పాట సాహిత్యం
చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: లక్ష్మి భూపాలం గానం: సత్య దేవ్, సునీల్ కశ్యప్ What The BEEP (promotional song)
Bluff Master (2018)
Palli Balakrishna
Friday, January 25, 2019