చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్.యన్ & కోరస్
నటీనటులు: నవదీప్ , సంతోషిణి , అయేషా జుల్కా
దర్శకత్వం: తేజా
నిర్మాత: తేజా
విడుదల తేది: 25.03.2004
దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం