Search Box

MUSICAL HUNGAMA

Gopi – Goda Meeda Pilli (2006)చిత్రం: గోపి గోడమీద పిల్లి (2006)
సంగీతం: కోటి
సాహిత్యం: విశ్వనాథ్ బాగుల్
గానం: చిత్ర , శ్రీ కృష్ణ
నటీనటులు: అల్లరి నరేష్ , జగపతిబాబు, ఆర్తి చాబ్రియా, గౌరి ముంజల్, రంభ, వడ్డే నవీన్
దర్శకత్వం: జనార్దన మహర్షి
నిర్మాతలు: పొలిశెట్టి రాంబాబు, పల్లి కేశవరావు
విడుదల తేది: 16.11.2006

పల్లవి:
ముద్దులకే ముద్దొచ్చే ముద్దుల గుమ్మా
ముద్దులన్ని మూట కట్టవే
సిగ్గులకే సిగ్గోచ్చే సిగ్గుల కొమ్మా
సిగ్గులన్ని దాచిపెట్టవే
అరెరే తళుకు బెళుకు దుడుకు వయసు
మురిసి మురిసి మెరిసె మిల మిల
భళారీ బిరుకు బిరుకు చిలిపి మనసు ఉరక లేసే
మధుర వరదలా మరదలా
నీ ఎదములుపుల చేరే సూత్రం
నీ మెడ మెరుపుల మంగళ సూత్రం

చరణం: 1
మబ్బుల్ని దించి పందిల్లే వేసి
చేస్తానే నీ పెళ్లి అది సరే మరి
మబ్బుల్లో నుంచి వానొచ్చే నంటే ఔతుంది మన పెళ్లి
వారెవ్వా... ఇంటి పేరు మారిపోయి వేడుకేదో వేచి ఉందలా
ఒహొహో... ఒకరి పేరు ఒకరు చెప్పు ముచ్చటేదో చేరుతుందలా పెళ్లిలా
నవ వధువుగ నిను చూసిన పూటా
మా కనులకు చిరు చినుకుల పాటా

చరణం: 2
ఏడడుగులేసి కార్యాలు చేసి జంటల్లే వెళ్ళండి
చల్ చలో మని మూడో నెల దాటి
ముగ్గురిగా మారి ముచ్చటగా రారండి
ఓలమ్మో... పడుచు దనపు గడుసు ధనము
తోక ముడిచి పరుగులే ఇలా
అమ్మమ్మో... ఆడతనము అమ్మతనము అణువు అణువు తీరులే అలా మరదలా
నీ ముసి ముసి లోగిలి లోన
మా రేపటి కల చూపవె జాణా హేయ్

ముద్దులకే ముద్దొచ్చే ముద్దుల గుమ్మా
ముద్దులన్ని మూట కట్టవే
సిగ్గులకే సిగ్గోచ్చే సిగ్గుల కొమ్మా
సిగ్గులన్ని దాచిపెట్టవే
అరెరే తళుకు బెళుకు దుడుకు వయసు
మురిసి మురిసి మెరిసె మిల మిల
భళారీ బిరుకు బిరుకు చిలిపి మనసు ఉరక లేసే
మధుర వరదలా మరదలా
నీ ఎదములుపుల చేరే సూత్రం
నీ మెడ మెరుపుల మంగళ సూత్రం

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0