చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్ ,జయసుధ, సుజాత దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున విడుదల తేది: 24.12.1982
Songs List:
నారినారి నడుమ మురారి.. పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు పల్లవి: నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి చరణం: 1 హా.. తాగానని తప్ప తాగానని.. చేస్తానని తప్పు చేస్తానని అనుకోమాకు కలగనమాకు... గోదారి వేశానని పందెం వేశానని.. పోతానని ఓడిపోతానని అనుకోమాకు కలగనమాకు... కావేరి తాగి.. తాగి తాగి.. ఊగి.. ఊగి ఊగి అడుగు తప్పక.. పదము తప్పక ఆడిపాడి నిలిచేవాడే.. మగాడు... నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి చరణం: 2 ఆగానని.. ఆగి తాగానని తింటానని.. దెబ్బ తింటానని అనుకోమాకు కలగనమాకు.. గోదారి.. చూశానని.. అందం చూశానని పోయానని.. పడిపోయానని.. అనుకోమాకు కలగనమాకు.. కావేరి పాడి ఆడి పాడి.. ఆడి పాడి ఆడి గెలుపు పొందగ.. పిలుపు అందగ నిన్ను ఓడి గెలిచేవాడే మగాడు... నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
ఎవరో చెప్పారు పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక పున్నమి తొలిపొద్దులో కృష్ణా గోదారి నడిబొడ్డులో ఒక యువరాజు పుట్టాడని ఒక యువరాజు పుట్టాడని వాడే వాడే నారాజు అవుతాడని ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు వైశాఖ పున్నమి తొలిపొద్దులో కృష్ణా కావేరి నడిబొడ్డులో ఒక యువరాణి పుడుతుందని ఒక యువరాణి పుడుతుందని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు చరణం: 1 కనులనిండుగుంటాయనీ.. కామాక్షి కాదని.. కంచిలో లేదని ప్రణయానికి రారాజని.. దేవేంద్రుడు కాడని.. స్వర్గంలో లేడని కనుముక్కు తీరు చూసేటి జోరు కనుముక్కు తీరు చూసేటి జోరు ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు చరణం: 2 సిరులున్న చిన్నోడనీ.. శ్రీనివాసు కాడని.. తిరుపతిలో లేడని చిన్నిముక్కు చిలకమ్మనీ.. చిత్రాంగి కాదని.. చిత్రాలు లేవని చిరునవ్వు నోరు చిరివాడే తీరు చిరునవ్వు నోరు చిరివాడే తీరు ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని వాడే వాడే నారాజు అవుతాడని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు వైశాఖ పున్నమి తొలిపొద్దులో కృష్ణా గోదారి నడిబొడ్డులో ఒక యువరాణి పుడుతుండని ఒక యువరాజు పుట్టాడని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
నెలలు నిండినట్టు పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: నెలలు నిండినట్టు బతుకు పండినట్టు కానిచోట కాశావు వెన్నెలా కారడవుల కాశావు వెన్నెలా ఎవరికొరకు కాశావే వెన్నెలా ఆడవి కాసినా వెన్నెలా.... ఓ వెన్నెలా... వెన్నెలా... చరణం: 1 ఏ గుడిలో చేరుటకో జడలో ముగియిటకో పువ్వులు పూస్తాయి ఆశగ చూస్తాయి ఏ తుఫాను రక్కసికో ఏ పిశాచి చేతులకో బలియై పోతాయి అవి నేలరాలి పోతాయి ఎవరికొరకు పూశాయె పువ్వులు చచ్చి బతుకుతున్న యీ శవాలు ఓ వెన్నెలా... వెన్నెలా... చరణం: 2 ప్రేమికులను పిలుచుటకో ఏ ప్రియులను కలుపుటకో పున్నమి వస్తుంది వెన్నెల కాస్తుంది ఏ మబ్బుల దప్పికకో ఏ గ్రహణపు ఆకలికో ఆహుతి అవుతుంది కధ ముగించుకొని పోతుంది ఎవరికొరకు కాసిందో వెన్నెలా.... అమవాసయి పోతుంది కడకిలా ఓ వెన్నెలా... వెన్నెలా...
నీలాల నింగి పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: నీలాల నింగి ఒకసారి వంగి నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే అదే అచ్చట.. అదే ముచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంట నీలాల నింగి ఒకసారి వంగి నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే అదే అచ్చట.. అదే ముచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా చరణం: 1 పయనించు మేఘాలు పయనాలు ఆపి చిరునవ్వు నవ్వి చిరుజల్లు చల్లి కదలి వెడలిపోతే అదే ముచ్చట సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి సిగ్గుల్లో నిన్ను మైకంలో నన్ను చూసి చూడలేక.. ఉండీ ఉండలేక కదలి వెడలిపోతే అదే ముచ్చట.. అదే అచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే అదే అచ్చట.. అదే ముచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా చరణం: 2 నిదురించు అందాలు ఒకసారి లేచి పైపైకి వచ్చి పరువాలు చూసి నిదుర మరచిపోతే అదే ముచ్చట లోలోని కోరికలు లోకాలు మరిచి లోలోని కోరికలు లోకాలు మరిచి కళ్ళల్లో నిన్ను.. కౌగిళ్ళో నన్ను ఉంచీ ఉంచలేక వదలీ వదలలేక కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా నీలాల నింగి ఒకసారి వంగి అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే అదే అచ్చట.. అదే ముచ్చట అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా
ఎవరా నలుగురు పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు పల్లవి : ఎవరు, ఎవరు ? ఎవరు ? ఎవరా నలుగురు ఏరా నలుగురు నీవాణ్ణి నీలో వున్నవాల్లా నిన్ను చూసి నవ్వేవాళ్ల నవ్వలేక ఏడ్చేవాణ్ణి నిను నవ్వులపాలు చేసేవాల్లా ఎవరా నలుగురు, ఏరా నలుగురు ఎవరా నలుగురు నలుగురు ఏరా నలుగురు నలుగురు Tell me who aro thiey? Where are they? చరణం: 1 ఎవడో ఏదో అన్నాడని ఆలిని వెలివేశాడు యుగపురుషు డొక్కడు ఎవరో ఏదో అంటారని ఆలిని అమ్మేశాడు మహనీయు డొక్కడు వెలివేసిన వానిని ఏమన్నారా నలుగురు అమ్మేసిన వానిని ఏమన్నారా నలుగురు వినేవాడు ఒకడుంటే అనేవాళ్ళు కోకొల్లలు పడేవాడు ఒకడుంటే పడగొట్టేవాళ్ళే పదుగురు ఎవరా నలుగురు - ఏరా పదుగురు.. Come on - Come on - tell me ఎవరు ? ఎక్కడ ? చరణం: 2 ఎవరో పోనీ నాకేమని ఇంటను కూర్చుంటే అయ్యేవాడా బుద్దుడు ఎవరో ఏదో చేస్తారని భయపడి కూర్చుంటే తలచేవారా అభిమన్యుని శోధించిన వానిని ఏమన్నారా నలుగురు సాధించిన వానిని ఏమన్నారా నలుగురు విన్నానని ఒకడంటే చూశానన్నది నలుగురు అంటాడని ఒకడంటే అన్నాడనేది పదుగురు ఎవరా నలుగురు ? ఏరా పదుగురు Who are they? Where are they Come on tell me Where are they ?
అందగాడు పాట సాహిత్యం
చిత్రం: యువరాజు (1982) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు, సుశీల అందగాడు