చిత్రం: చాణుక్య శపథం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 18.12.1986
మెల్లగా - మెల్లగా
అల్లుకో - అల్లుకో
మెత్తగా - మెత్తగా
హత్తుకో - హత్తుకో
అల్లుకుంటు అందమంత గిల్లుకోనా
హత్తుకుంటు హాయికాస్త జల్లుకోనా
గుట్టు గుట్టుగా గుండెలోనే వేడిగా వెచ్చగా ఉండిపోనా
మెత్త మెత్తగా ఉన్నవన్నీ చాటుగా మటుగా ఇచ్చుకోనా
మెల్లగా - మెల్లగా
అల్లుకో - అల్లుకో
ఆడ ఈడ ఉన్న ఆడ అందమంత
ముద్దచేసి ముద్దుపెట్టి కొట్టమాకు
కన్నె ఈడు సన్నకారు సోకులన్ని
కౌగిలిస్తే లెక్కపెట్టి చంపమాకు
చల్లగాలి కొట్టగానే ఉల్లికోక జారిపోయే
తాకే నీ ఊపిరి సాగించే అల్లరి
పోజులన్ని పట్టుకోర పోరగాడ
బొమ్మలాడుకోర వాలుపొద్దు కాడ
మెల్లగా - మెల్లగా
అల్లుకో - అల్లుకో
మెత్తగా - మెత్తగా
హత్తుకో - హత్తుకో
చూడరాని చెప్పలేని రేఖలన్ని
ఏడు రంగులేసి చూసి రెచ్చిపోకు
పుట్టుమచ్చ తాకలేని పూతలన్ని
గుచ్చి మాలలల్లుతుంటే నొచ్చుకోకు
కన్ను నువ్వు కొట్టగానే గాజులమ్మ ఘల్లుమంటే
తగిలే నీ కాటుకా రగిలే నా కోరికా
పండు దాచుకోకు బిట్టలాడు వేళ
పక్కదాటిపోకు చుక్కలాడువేళ
మెల్లగా - మెల్లగా
అల్లుకో - అల్లుకో
మెత్తగా - మెత్తగా
హత్తుకో - హత్తుకో
అల్లుకుంటు అందమంత గిల్లుకోనా
హత్తుకుంటు హాయికాస్త జల్లుకోనా
గుట్టు గుట్టుగా గుండెలోనే వేడిగా వెచ్చగా ఉండిపోనా
మెత్త మెత్తగా ఉన్నవన్నీ చాటుగా మటుగా ఇచ్చుకోనా