చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: నందమూరి హరికృష్ణ , జగపతిబాబు , వెంకట్, శివాజి, పూనమ్ సింగార్, లయ, కాంచి కౌల్ , మోనిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్.బి. చౌదరి
విడుదల తేది: 01.11.2002
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
అచ్చమైన ప్రేమే అంది అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
ఎన్ని జన్మలైన గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమబంధమంటె మాదిలే
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై
హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమేదో నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా