Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Palnati Pourusham (1994)



చిత్రం:  పల్నాటి పౌరుషం (1994)
సంగీతం:  ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: వందేమాతరం శ్రీనివాస్, యస్.జానకి
నటీనటులు: కృష్ణంరాజు ,  రాధిక
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: విజయలక్ష్మి మోహన్
విడుదల తేది: 29.07.1994

బండెనక బండి కట్టీ... పదహారు బల్లు కట్టీ...
మెట్టినింటి దారే పట్టే... పుట్టినింటి ముద్దే పట్టీ...

ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా

బండెనక బండి కట్టీ పదహారు బల్లు కట్టీ
మెట్టినింటి దారే పట్టే పుట్టినింటి ముద్దే పట్టీ
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా

మనసే ఊయలగా ఊగెను ఈ చెల్లి
ఎండే వెన్నెలగా మార్చినది నా తల్లి
నువ్వే ప్రాణమని నీ నవ్వే లోకమని
తలచే అన్ననిలా విడిచి వెళ్ళేవా
ఊరు బోరుమంటుంది నీ తోడు లేక
గుండె బావురంటుంది నిను వీడలేక

ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా

ఓ బండెనక బండి కట్టీ పదహారు బండ్లు కట్టీ
మెట్టినింటి దారే పట్టే పుట్టినింటి ముద్దే పట్టీ
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా

అన్నా ఎల్లి రానా వదినా ఎల్లిరానా
ఊరా ఎల్లి రానా సెలయేరా ఎల్లిరానా
రెప్పకు కనుపాప చెప్పే వీడ్కోలు
చెల్లే అన్నకిలా చెబుతుంది ఈనాడు
మగాళ్లకెన్నటికీ పుట్టెనిల్లు లోకం
మగువలు పుట్టింది మెట్టెనింటి కోసం

ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా

ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా


*****   ******   *******


చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: శివగణేష్
గానం: మనో, సుజాత

మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే
మదిలోన మరులొలికే మరుమల్లె జాతరవే
పొట్టిజళ్ళ పాలపిట్ట పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పూర్ణమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగెదెట్టా..ఆ

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

కంటికీ కునుకే రాదాయే
నోటికీ మెతుకే చేదాయే
ఒంటిలో తాపం ఏదో మొదలాయే..ఏ
ఎక్కడో కాకులు కూస్తున్నా
ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వనే వెతికే గుండెకి గుబులాయే..ఏ
నావకడ గట్టిగ అరిచానూ
బావ సడి గుట్టుగ అడిగానూ
గాలితో కబురులు పంపానూ
మబ్బుతో మనసులు తెలిపానూ
దేనికీ బదులే రాకా కుదురే లేకా కన్నీరొలికానూ
ముద్దుల బావా నన్నిక ఇడిసి పోవద్దూ
ఈ మరదలి పేణం నీపై ఉందని మరవద్దూ

రాగాల సిలకా రంగేళి మొలకా..ఆ
రాయంచ నడకా రావాకు తళుకా..ఆ

కళ్ళలో కలతలు తీరేనా
కాళ్ళపై వాతలు మాసేనా
రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా
దాగనీ సొగసులు పొంగేనా
దాగినా దారులు తెరిచేనా
కొంగులో కోలాటాలే కోరేనా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ముందుగా బంధం వేసిన హృదయం
లోనికి విందుకు వస్తున్నా
మరదలు పిల్లా నిన్నిక విడిచీ వెళ్ళనులే
మన పెళ్ళికి లగ్గం దగ్గరలోనే ఉన్నదిలే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా



Most Recent

Default