Search Box

MUSICAL HUNGAMA

Subramanyam for Sale (2015)


చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో రమ్యా బెహ్రా
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర, ఆదా శర్మ
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 24.09.2015

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై

అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట

జోడుకోసం గోడ దూకే వయసిది
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొపాపం అంత తాపం
తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా...

అరె  గువ్వ - హా.., గోరింకతో  - హా..
ఆడిందిలే బొమ్మలాట
హేయ్.. నిండు -  హా.. నా గుండెలో - అహా..
మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్..

కొండనాగు తోడు చేరి
నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె
పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పువ్వులో మకరందము ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ...

హేయ్... గువ్వ  - హాయ్.. గోరింకతో  - హాయ్..
ఆడిందిలే బొమ్మలాట
అహ.. నిండు - హా.. నా గుండెలో - అహ
మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై


AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0