Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Janaki weds Sriram (2003)





చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
నటీనటులు: రోహిత్, గజాల, రేఖ వేదవ్యాస్, ప్రేమ
దర్శకత్వం: అంజి
నిర్మాత: యస్.రమేష్ బాబు
విడుదల తేది: 11.09.2003



Songs List:



మేరా దిల్ తుజుకో దియా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కుమార్ సాను & కోరస్

పల్లవి: 
మేరా దిల్ తుజుకో దియా 
గుండెల్లో నువ్వే ప్రియా 
మేరా దిల్ తుజుకో దియా
యదలో చూడే ఇలా ఎపుడూ నీదే లయా
యదలో చూడే ఇలా 
ఎపుడూ నీదే లయా
మేరా దిల్ తుజుకో దియా

చరణం: 1
అడుగు తీసి అడుగేయబోతే
ఆ అడుగే అడిగింది
నీ వైపే పదమంది
పెదవి విప్పి మాటాడబోతే
నీ పేరే పలికింది 
నువ్వే నేనంటుంది
ఎటు చూసినా,  ఏం చేసినా 
నీ రూపు రేఖలే కనిపించెనే
ఏ సవ్వడి వినిపించినా 
నువ్వు పిలిచినట్టుగా అనిపించెనే
మేరా దిల్ తుజుకో చియా

చరణం: 2
ఇన్నినాళ్ళుగా మూగబోయి
ఉందే నా మనసిపుడే
తెగ తొందర పడిపోతుంది
ఎంత చెప్పినా ఆగనంటూ
మాటే విననంటుంది తన బాటే తనదంటోందే
ఏమైందనీ, నేనడిగితే తన పెదవి ముడిని అపుడిప్పిందిలే
నీ కోసమే ఈ పరుగని చెవిలోన చిన్నగ చెప్పిందిలే
మేరా దిల్ తుజుకో దియా




పండువెన్నెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: టీనా కమల్

పల్లవి: 
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం 
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం
నీ పేరే పాడుతున్న మౌనసంగీతం 
ఎద నీ రాక కోసం పలికే స్వాగతం

చరణం: 1
ఎగిరే గోరింకా ఇటురావా నా వంక 
నువ్వు ఎందాకా పోతావో నేను చూస్తాగా 
చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్కా అలిసాకా నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపును నేనేగా
రప్పించు కోనా నిను నా దాకా 

చరణం: 2
కన్నె సీతమ్మకీ పెళ్లీడు వచ్చిందని కబురు
వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకె పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేదించే దూరమంతా కరిగేలా
విరహల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేలా 
మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలా



రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: సునీత, ఉష, సంజీవిని ఘంటాడి,
ఘటికాచలం, వరికుప్పల యాదగిరి & కోరస్

పల్లవి: 
రివ్వున ఎగిరే గువ్వా...
నీ పరుగులు ఎక్కడికమ్మా ...
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 1
అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక మెళ్ళోతాడు
ముడివేసే సిరిగల మొనగాడు ఎవరే వాడు
చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడౌతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గోపికలే వస్తే అటే పరిగెడతాడే
ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడతానే
కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు బావతో వెలతావా
పదబావా పాలకోవా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 
నీ రాజు ఎవరంటా... ఈ రోజే చెప్పమంటా...

చరణం: 2
చిటపట చినుకులు రాలి 
అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికి అవి చేరునది ఏదరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి నువ్వే తాళిని మెళ్ళో కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓబావా ఒట్టే పెడుతున్నా ...
నే కూడ ఒట్టేస్తున్నా...

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా 

నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...
నా రాజు నువ్వేనంటా... 
ఈ రోజే తెలిసిందంటా...




అందాల భామలూ ... పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: సందీప్ బేమెక్, సునీత, నిష్మా & కోరస్

పల్లవి: 
అందాల భామలు  క్యాట్‌వాకు చేపలు
ఆడతరా మాతో సైయ్యాటలు
మీరంతా కోతులుమీ తోనా ఆటలూ
వద్దంటే వినరే  మా మాటలూ 

ఎందుకలా  ఊరికనే నిందిస్తారే 
మాతో పోటీ అంటే భయమేమోలే 
అబ్బబ్బో మీకంత సీను లేదులే
మీ కంటే సీనియర్లని చూసినాములే
ఐతే లేదు ఎందుకంట  చప్పున వచ్చేయ్యరే 

అందాల భామలూ

చరణం: 1
గోడమీది బొమ్మ  ఆ గొలు సులున్న బొమ్మ 
ముట్టుకుంటే మొట్టికాయ వేస్తదమ్మా 
దాని పేరేంటో నువ్వు చెప్పవమ్మా
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం 
ఇంత సిల్లి క్వశ్చన్  అది కాదు మాకు కష్టం
దాని పేరు తేలు అని అంటారంట
ఒళ్ళంతా గొలుసులుగా ఉంటుందంట
మామా కాని మామా మరి ఎవ్వరే 
నింగిలోని నిందు చందమామ లే
కాయకాని కాయ మరి ఏమిటే
కాయకాని కాయ నీ తలకాయలే

అందాల భామలూ

చరణం: 2
హలో హలో సారు జరదేఖో ఒక మారు 
ఆ దాచేసిన పెళ్ళి బట్టలిచ్చుకోండి
ఇక మా ముందు మీ ఆటలు చెల్లవండి 
ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
అరె ముద్దు ముద్దుగుమ్మ  మురిపాల పూల రెమ్మ
ముందు మేము అడిగింది ఇచ్చుకోమ్మ 
ఆ తర్వత ఆ బట్టలు పుచ్చుకోమ్మ 
అంత హెడ్డు వెయిట్ మీకు ఎందుకూ 
ఇవ్వకుండా మారము లెందుకు
ఎంతైన మగపెళ్ళి వారమే
మరీ మర్యాదలు మాకెన్నో చెయ్యాలిలే

అందాల భామలూ 




రివ్వున ఎగిరే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమకథ. 

రెండు గువ్వలు చిలక, గోరింక, 
రెండు రవ్వలు తార, నెలవంక
కలలు కన్నాయి కథలు చెప్పుకున్నాయి
ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా
పసి వయసులో బొమ్మల పెళ్లి చేసుకున్నాయి.
కడవరకు నిలవాలని బాసల వీలునామా రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది,
ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట,
ఇప్పుడు అదే నా ఈ పాట

పల్లవి:
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా
నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ..... ఏ ఏ ఏ.....

చరణం: 1
వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూటా చూడనే లేదా

నీ జాడను చూపించంటు ఉబికేనా ఈ కన్నీరు
ఏ నాడు ఇలపై పడి ఇంకిపోలేదు
నడిరాతిరి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండెకు ఓదారుపు

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా 
నిను ఎక్కడవెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా

చరణం: 2
కిన్నెరసాని నడక నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువై పోగా మిగిలున్న ఒంటరి శిలగా
మన బాసల ఊసులు అన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది ఆంటే ఇంకా ఈ నా దేహం
క్షేమంగ ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా
త్వరలోనే నీ జతగా వస్తా

రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ వెతికేదమ్మా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా
ఇకనైనా గూటికి రావా




ఈఫిల్ టవరయినా...పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: శంకర్ మహదేవన్, సురేఖా మూర్తీ

పల్లవి: 
ఈఫిల్ టవరయినా...
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా
ఈఫిల్ టవరయినా
మన చార్మినార్‌ తో సాటిరాదురా
వాషింగ్టన్ అయినా 
మన వాగులముందు దిగదుడుపేరా

సుబ్బలక్ష్మి ముందు మదోన్నా వేస్టు
ఫాస్ట్ బీట్ కన్నా మెలోడి టేస్టు
అచ్చమైన ఆవకాయే మనకు నచ్చునురా

ఈఫిల్ టవరయినా....

చరణం: 1
క్రికెట్లో వీరుల్లా ఎవరికి వారే అనుకున్నా
ఉరుమల్లే ఊరిమేటి సచ్చిన్ తో సరితూగేనా
ఆ మైఖేల్ జాక్సన్ తెగ ఊపే స్టెప్పుల కన్నా
మెరుపై మెలితిరిగే చిరునగువే మిన్నా

గంగి గోవుపాలు గరిటెడు చాలు కడివెడు ఎందుకురా
గుండె నిబ్బరంతో సాధించేందుకు ఒక్కడు చాలునురా
నోరు తెరిచి పలకరాని భాషలెన్నున్నా
స్వచ్చమైన తేట తెలుగే అన్నిటా మిన్నా

ఈఫిల్ టవరయినా...

చరణం: 2
ISI ని తరిమేసేయ్ పోలిమేరల్లోకి రాకుండా
హిందుస్తాన్ హమారహై అని ఒట్టేయ్యాలి ప్రతి ఇంటా
మువ్వన్నెల జెండా - అది ఎగరాలి ఎదనిండా
చూసేద్దాం శతువుతో ఇక నిదురే రాకుండా
మువ్వన్నెల జెండా
కుప్పిగంతులేసే ముషారఫ్ ని రఫ్ ఆడించేద్దాం
మన అటల్ బిహరి వాజ్ పేయ్ కి చేయూత అందిద్దాం...
హద్దుమీరి చేయిజారే సాంప్రదాయాల్లో
కమ్మనైనా కల్చరంటే ఇండియాదే రోయ్

ఈఫిల్ టవరయినా....




ఏ దూర తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రాజేష్ , నిత్య సంతోషిని 

ఏ దూర తీరాలలో... వుందో నా చెలి
ఎనాడూ నా కంటికీ... కనిపిస్తుందో మరీ

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ
హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలీ
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా

చరణం: 1
హ...పువ్వు నవ్వితే
తన నవ్వే అనుకొని చూస్తున్నా
అటుగా పరుగులు తీస్తున్నా
మువ్వ మోగితే ఆ అలికిడి తనదే అనుకున్నా
పొరబడి ఎదురే చూస్తున్నా
రెక్కలు తొడిగిన గువ్వను నేనై
దిక్కులు అన్నీ వెతికాను
దివిలో తారలు నా కన్నులుగా
భువినంతా గాలించాను
ఆశే నేనై శ్వాసే తానై నిలిచా తనకోసం
నాలో చదరని ప్రేమకు సాక్షం నేలా ఆకాశం

వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

చరణం: 2
చిన్ని గుండెలో కలిగిందే కమ్మని తుళ్ళింతా
యేదో తెలియని పులకింతా
పిలిచినంతలో మనసంతా తియ్యని గిలిగింతా
నాలో ఏమిటీ ఈ వింతా
వేకువ పొద్దున మందారాన్నై
వాకిట ఎదురే చూస్తున్నా
పాపిట దిద్దిన సిందూరానికి
పరమార్థం లా నేనున్నా..
జగములు యేలే జానకిరాముని సగమే నేనమ్మా
జతగా తానే కలిసే వరకు బతికే శిలనమ్మా

ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ...

హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ...
ఆమనికై ఇల కోయిలలా నే తనకై చూస్తున్నానని
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలి
ఎన్నడు తరగని ప్రేమకు నువ్వే ఊపిరి పోయాలి



నిన్ను ఎంత చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: ఉదిత్ నారాయణ్, టీనా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు
నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టే ఉండదు

ప్రేమన్న మాటేమో రెండు ముక్కలే 
నీతోని చెబుదమంటె ఎన్ని తిప్పలే
ఆడిగేస్తానంటూ ముందు కడిగేస్తాడే
తీరా నేనెదురుపడితే తడబడతాడే
పచ్చి మిరపకాయ తిన్న బహు తీపిగున్నదే
మరి మందు తాగకున్న మత్తెక్కుతున్నదే 
నాకు కూడా బాబు అట్టాగే ఉందిలే
మరి నువ్వు పక్కనుంటే గమ్మత్తుగావుందిలే
హలో పిల్ల శుభానల్లా నీకు ఇవాళ 
ఇలా నిన్నే చూసి నా మనసు పడిపోయే వెల్లకిలా

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

పొద్దున్న లేవంగ ముద్దు అంటాడే
వద్దన్నా వినకుండా ఎగబడతాడే 
బొత్తిగ ఈ లోకం బహు కొత్తగున్నదే
మొత్తంగ మాయేదో అవుతున్నదే
అయ్యో చంటి పిల్లడల్లే మారేముచేస్తాడే
మరి చిలిపి చేష్టలల్లా అహ చిన్ని కృష్ణుడే
ఇక నిన్ను చూడకుండ ఆ పొద్దు గడవదే
ఈ రాణిని చూశాక నా మనసు నిలవదే
వద్దని అన్నా వద్దకు వచ్చి కలబడతాడే
వాడే సందే చూసి చప్పున్న వచ్చి గిలిగింతలుపెట్టేస్తాడే

అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా
అయ్యో అయ్యో రామ 
ఇది ఏమీ మాయో ప్రేమా

నిన్ను ఎంత చూసినా చూసినట్టు ఉండదు
ఎంత మాటలాడిన ఆడినట్టు ఉండదు

ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే
అరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందే 
నీ వైపే నా మనసే లాగేస్తుందే

హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ
హేయ్ బోలో బోలో బామ
ఇది ఏమి మాయో ప్రేమ

Most Recent

Default