Search Box

MUSICAL HUNGAMA

Amma Koduku (1993)చిత్రం: అమ్మ కొడుకు (1993)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్
దర్శకత్వం: క్రాంతి కుమార్
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 1993

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

చరణం: 1
మల్లె జాజుల్లో వాసనే మౌనము       
మత్తెకించే ఆ మౌనమే ప్రాణము
మల్లె జాజుల్లో వాసనే మౌనము       
మత్తెకించే ఆ మౌనమే ప్రాణము
పూలలో తేనెలు గాలికె ఆరవు
నింగిలో తారలు వానకే రాలవు
తొలకరి అనుభవం  - ఆ...ఆఆ..
తొడిమకు పులకరం  - ఓ..ఓఓ...
తొలకరి అనుభవం తొడిమకు పులకరం
తేనెపాలు చిలికిన వయసును

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

చరణం: 2
వెన్నెల్లో వేడి కన్నులే మూయదు
ఏదో ఆరాటం ఎంతకీ తీరదు
వెన్నెల్లో వేడి కన్నులే మూయదు
ఏదో ఆరాటం ఎంతకీ తీరదు
గుండెలో వేసవి చూపుతో ఆరదు
మనసులో ఆకలి మాటతో ఆగదు
పెదవుల పరిచయం  - ఆ..ఆఆ
ఎదలకు పరిణయం  - ఓ..ఓఓ
పెదవుల పరిచయం ఎదలకు పరిణయం
మాఘవేళ మలసిన వయసున

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి
ప్రేమకు నీ పెదవే పల్లవి
కన్నుల కాసిన జాబిల్లివి

కోవెల గంటలు ఏమన్నవి
నా తొలి పూజలు నీ కన్నవి

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0