Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Oxygen (2017)



చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: శ్రీమణి
గానం: దీపక్ , యస్.ఐశ్వర్య
నటీనటులు: గోపిచంద్ , రాశిఖన్నా , అనుఇమాన్యుయేల్, శామ్
దర్శకత్వం: జ్యోతిక్రిష్ణ
నిర్మాత: యస్.ఐశ్వర్య
విడుదల తేది: 12.10.2017

కన్నులు కలిసేదోక్షణం పెదవులు కలిసేదోక్షణం
నీతో ఈ నిమిషం కలకాలం
రెప్పలు సవ్వడి ఓ క్షణం తీయని కన్నీరోక్షణం
నీతో ఈ నిమిషం చిరకాలం
ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే
ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే

నీ చెంత లేని ఏ నిమిషమైన
నీ జత నిమిషమంత మధురం పంచలేదే
కన్నీరునైనా పన్నీరు చేసే
నీ ఒడిలోనె క్షణమే నా గుడి అయ్యనే
నీ పేరుతోటి నా పేరుని పెనవేసి క్షణము ఉప్పొంగెలే
కాలాన్ని సన్న దారం లా అల్లుకున్నాయి శరమ పూలే
వయసే మళ్ళిన వెళ్లిన తనువుకి
యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే

ఈ తీపి నిమిషం చేదవ్వకుండా
నా ప్రాణాన్ని పంచి నే కాపాడుకోనా
ఈ హాయి నిమిషం మాయవ్వకుండా
నా హృదయంలో దాచి నే బ్రతికించనా
నిమి క్షణములో తీపి కవితలా
నిమి సెకనులో ప్రేమ శకములా
అని తేల్చ లేని వింతైన ముద్దులో నిలిచెను ఈ క్షణమే
ఊపిరి ఆగినా జాగిలా తెలియదే
ఈ క్షణం ముద్దులో తీర్చనే తీరదే

తెలుసా మనసా తెలుసా నీతో
విడి వడి వేసిన అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే
తెలుసా మనసా తెలుసా నీతో
జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే


*******   *******  *******


చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్

అది లెక్క దరువెయ్ రోరన్న
తకదిన్న కూని రాగం ఎత్తుకున్న
పక్క తాళం అందుకోన
దీనికన్నా తీయనైనా కమ్మనైన వెలుగన్న
ఆ హాయే వేరన్నా
అరదండ మువ్వల పట్టిలో
56 అక్షరాలు ఘల్ ఘల్ తెలుగన్నా
మూడు లింగాల నేలంటూ నింగి గంగే జారి
తెలుగల్లే మారిందన్నా...
అణువణువు మన పుట్టకనుంచే ఒంట్లో చేరే
గాలి తెలుగు భాషే యన్నా
అడుగడుగుకట్టుబొట్టు తీరు తెన్ను
మనతో నడిచే పూల దారేయన్నా
అమ్మగోరు ముద్దే మన అచ్చతెలుగన్న
పిజ్జా బగ్గర్ పైన పిచ్చామోజు వద్దున్నా

ఎగా దిగా మనకు


*******   *******  *******


చిత్రం: ఆక్సిజన్ (2017)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్.ఎల్.ఆర్.కార్తికేయన్, యస్.ఐశ్వర్య

హో సింగమంటి మొనగాడు
మా ఇంటి బందువైనాడు
ఇక నేడు రేపు ఏనాడు
మా సొంత సైన్యమే వీడూ

సింగమంటి మొనగాడు
మా ఇంటి బందువైనాడు
ఇక నేడు రేపు ఏనాడు
మా సొంత సైన్యమే వీడు
మా సొంత సైన్యమే వీడు ఊ ఊ ఊ ఊ…

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడు
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..

సుతి మెత్తనైనా మనసున్న వాడూ
సివాలెత్తి సివుడైతే ఆపేవాడే లేడూ
ప్రేమ గంగ గుండెల్లొ ఉన్నొడూ..
ముప్పు చూస్తే మూడో కన్నై లెస్తాడూ.

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడూ
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..

గుండె దమ్ములున్న మంది ముందు వీడు
మల్లె చెండు లాగ మారిపొయినాడు
జడపాయి లో జతగాడై త్వరలో రానున్నాడు
మండె నడి పొద్దుల్లోని వేడి సూరీడు
నా పాపిట కుంకుమ వీడె నే వెతికే వాడు

హెయ్ నలు దిక్కుల పొలిమెరల్లో నిలబడినాడూ
మా ప్రాణాల పగ రా వీడూ
మా ఊపిరికే దసరా వీడూ
దైర్యం వీడూ
మా సౌర్యం వీడూ
బందం వీడూ
మా బాగ్యం వీడూ

ఆకాశం పందిరి వీడు
మా అందరి నీడైనాడు
ప్రతి చోట వీడూ మా తోడూ..
భూగోలం లాగ వీడు
మా అడుగును నిలబెడతాడు
నడిపించే బలమై ఉంటాడూ..



Most Recent

Default