Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "V. Samudra"
Sevakudu (2013)



చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
నటీనటులు: శ్రీకాంత్, ఛార్మి, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: యన్. సుధాకర్
విడుదల తేది: 04.01.2013



Songs List:



అబ్బాయి ఆంధ్రా మిర్చి పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: రంజిత్, శ్రావ్య

అబ్బాయి ఆంధ్రా మిర్చి 



ఆ దేవుడు పుట్టించాడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: తైదల బాపు
గానం: హరీష్ రాఘవేంద్ర, చిన్మయి శ్రీపాద

ఆ దేవుడు పుట్టించాడు 



గుడ్డు గుడ్డు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: యస్.పి.బాలు 

గుడ్డు గుడ్డు




మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: గురుచరణ్
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్

మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో



అడుగడుగో సేవకుడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ, విష్ణుశర్మ
గానం: మనో

అడుగడుగో సేవకుడు 

Palli Balakrishna Wednesday, March 13, 2019
Vijayadasami (2007)


చిత్రం: విజయదశమి (2007)
సంగీతం: శ్రీకాంత దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, వేదిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఈదర రంగారావు
విడుదల తేది: 21.09.2007

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
కలవై కలసి కథ మార్చావు
మెరుపై మెరిసి నను తాకావు

కుదురంటు లేకుంది మనసుకు
నిదరంటు రాకుంది ఎందుకు
అందర్నీ చూస్తున్నాను వింతగా
చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం
మొత్తంగా ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోకం
అటు నీవుంటే తెగ సంతోషం

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం

చంద్రుడు చేతికి అందెనా
మబ్బులు మాటలు నేర్చెనా
పువ్వులు పాటలు పాడెనా
కొండలు నాట్యములాడెనా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగానే
జగమంత వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్బుతమే
మాయలు చేసే మది సంబరమే

ఇది ఒక ఇది ఒక నవలోకం
ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం
ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో
శుభమో సుఖమో మది సంబరమో



******   ******   ******


చిత్రం: విజయ దశమి (2007)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: నవీన్, వసుంధరా దాస్

పల్లవి:
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే
పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే

చరణం: 1
ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ (2)
నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే

చరణం: 2
అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు (2)
సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె

మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే
కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే



Palli Balakrishna Thursday, March 22, 2018
Siva Rama Raju (2002)




చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: నందమూరి హరికృష్ణ, జగపతిబాబు, వెంకట్, శివాజి, పూనమ్ సింగార్, లయ, కాంచి కౌల్, మోనిక
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 01.11.2002



Songs List:



అందాల చిన్ని దేవత పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: శంకర్ మహదేవన్

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి

కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
అచ్చమైన ప్రేమే అంది అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
ఎన్ని జన్మలైన గంగకన్న స్వచ్ఛమైన 
ప్రేమబంధమంటె మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు 
కలత పెరుగు గుండెలో మాకు

అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమేదో నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు




డింగ్ డింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత


డింగ్ డింగ్



అమ్మా భవాని పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు

ఓం శక్తి మహా శక్తి 
ఓం శక్తి మహా శక్తి

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ 
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ
ఓ ఓ ఓ .....
సృష్టికే దీపమ శక్తి కె మూలము
సింహ రధమే  నీదమ్మా 
అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించమ్మ 

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ 
తల్లి నీ మహిమల్ని చూపవమ్మ

అమ్మ పసుపు కుంకుమ చందనము పాలాభిషేకము 
ఎర్రని గాజులు లతో పువ్వులతో నిను కొలిచాము
 
అమ్మ చంధానమే   పూసిన వొళ్ళు  చూడు
అమ్మ చంధానమే   పూసిన వొళ్ళు  చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు అ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపులా నోము చూడు
అమ్మమ్మా ముగ్గురమ్మల మూలా పుటమ్మ 
మీ అడుగులే తలలు
అమ్మ నిప్పులనే తొక్కిన నడక చూడు
అమ్మ దిక్కులన్నే దాటిన కీర్తి చూడు 
వెయ్యే సురిల్లె మెరిసిన  శక్తి ని చూడు 
మనుషుల్లో దేవుడి ఈ భక్తుని చూడు

ని పద సేవయే మాకు పుణ్యం 
అమ్మ నీ చూపు సోకినా జన్మ ధాన్యం

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ

దిన్నకు దిన్నకు త దిన్నకు దిన్నకు త 
గలగల గలగల గలగల దిన్నకు దినన్నకు త 
గజ్జల్నే కట్టి  ఢమరుకమే పట్టి  
నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట 

భూమే ఊగేల ఇయ్యాలి హారతి
భూమే ఊగేల ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి ఫలములు పెట్టి పదాలు తాకితే 
అడిగిన వరములు ఇచ్చును తల్లి 
చిరలు తెచ్చాం రవికలు తెచ్చాం చల్లంగ అందుకో 

జై జై శక్తి శివ శివ శక్తి 
జై జై శక్తి శివ శివ శక్తి 


కంచిలో కామాక్షమ్మ
మధురలో మీనాక్షమ్మ నువ్వే 
అమ్మా కాశీలో అన్నపూర్ణవే
శ్రీశైల భ్రమరాంబవే
బెజవాడ కనకదుర్గవు నువ్వే
అమ్మా కలకత్తా కాళీమాతవే

నరకున్ని హతమార్చి  శ్రీకృష్ణున్ని కాచి
సత్య భామ మై శక్తివి నివే చూపినావే 
నార లోక భారాన్ని భూదేవీ మోచి 
సాటిలేని సహనం చాటినవే
భద్రకాళి నిన్ను శాంతి పరిచేందుకు 
రుద్రనేతుండు శివుడిన సరితుగున 

బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు 
ని పద పుపెఇనె తాకగా వచెనటా
బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు 
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా

నీ పద ధూళిని తాకగ వచ్చెనటా
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా
నీ పద ధూళిని తాకగ వచ్చెనటా




పిడుగులు పడిపోని పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు


పిడుగులు పడిపోని




నిరుపేదల దేవుడయా పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: యస్.పి. బాలు, సుజాత


నిరుపేదల దేవుడయా



స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: శివరామరాజు (2002)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత


స్వాగతం

Palli Balakrishna Monday, October 23, 2017
Mallepuvvu (2008)

చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  శ్రేయా ఘోషల్
నటీనటులు: భూమిక, మురళీకృష్ణ
దర్శకత్వం: వి. సముద్ర
నిర్మాత: మోహన్ వడ్ల పట్ల
విడుదల తేది: 19.09.2008

చందమామ రావే నువ్వు మౌన సాక్షి గా
చెంత నుండి పోవే మాకు ప్రేమ రక్ష గా
వెతలుగా మా యవ్వనం చెయ్యి జారు లోపు నీవె
బతుకులో తీయాందానం చవి చూపి వెంట రావే
ఒహో
జీవితం ఒక అధ్భుతం అది అందితేనె అమృతం
శాశ్వతం ఈ అనుభవం
ఇది రాయలేని చరితం

చరణం: 1
కాలమే నిలదీసినా నీ ప్రాణమై బతికాను
దైవమే దాటెసిన నీ ధ్యానమై నిలిచాను
కరగనీ కలాలతో
కదలనా కనులలో
ఇక నీది నాది ఈ లోకం
దరి చేర రాదు శోకం
క్షణమైనా చాలులే ధాన్యం
ఇది జన్మ జన్మ భాగ్యం
శిధి లాలే నదులల్లే కదలాదే వెళా

చరణం: 2
లోకమే చేసీందిలె ఒక మాయానీ పెను గాయం
గాయమే కోసిందిలె అది హాయనే మన భావం
నిన్నటీ స్మృతులతో నడవానా నీడ గా
నిట్టూర్పు నీడలో నీకే ఓదార్పు నేను కానా
నీ గుండె గొడుకింతైనా మైమరపు ఇవ్వలెనా
ఈ రాత్రే శుభ రాత్రే మది మీటె రాత్రీ


********  ********  *******


చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  భావతరని

సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా
సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా
పైరు లెంతై రావాలా పులకరిన్థై పోవలా
పువ్వుల్లాలా కువ్వల్లల్లా గువ్వాల్లాలా

ఆకాసమే తొంగి చూస్థొన్దిలా
నా పైట గా తానే మారాలనా
సువ్వి సువ్వి సువ్వాలా పువ్వు నాలా నవ్వాలా

చరణం: 1
కోయిలమ్మ ఎందుకమ్మ
కొత్తగుందీ వైనం
నా గొంతు చూసి గంతు లేసీ నేర్చినావా గానం
నెమలి గువ్వ ఏమిటమ్మ ముందు లేదే లాస్యం
నా నడక లోని హోయలు చూసి మార్చినావా నాట్యం
దూకే వాగు వంక
రాదా కన్నె వంక
ఒంపు సొంపు చూసి
కాదా చంద్ర వంక
న వయసన్థె సొగసంతే మల్లె పూల వాసంతం


********  ********  *******


చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: టిప్పు

హీరో నేనొచ్చానే  మీకే టీ ఇస్తానే
హీరో నేనొచ్చానే మీకోసం మీకోసం
టీలెన్నో తెచ్చానే మీకోసం మీకోసం
కలిపేసే లెమన్ టీ వేడి వేడి గా లమ్సా టీ
అందించే ఇంకోటీ ఆర ఆరగా అంధ్రా టీ
ఇది పడితే కదిలే రధమే మనిషీ
తీస్కోర నా టీ ఇది అన్నింట మేటీ
లేదింక పోటీ ఆపైన భేటీ

లక్ష గాడు తాగే టీ బిక్ష గాడు మెచ్చే టీ
లక్షణం గ తాగేస్తే రక్ష నీకు ఇచ్చే టీ
అచ్చమైన అస్సాం టీ వెచ్చనైన నైజాం టీ
ఒక్క కప్పు నాకిస్తే నీ మత్తు దులుపు చక్రా టీ
కుర్ర వాళ్ళు తాగే టీ పెద్ద వాళ్ళ టీపార్టీ
ఆడవాళ్ళు పెట్టే టీ ఆడ ఈడ దొరికే టీ
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట తధీం తకిట
తధీం తకిట తకిట తకిట థాం

అత్త మామ అడిగే టీ భర్త మార్కు భార్యా టీ
అతిధి దేవుడొస్తుంటే అర్జంటు గా పెట్టే టీ
పల్లె లోనా పారే టి పట్టణాన ఛాయే టీ
ఒక్కరైతె సింగిల్ టీ ఎక్కువైతె ఒన్ బై టీ
ఎక్కడైన దొరికేటీ ఏరువాకలయ్యే టీ
ఎంత లోడు ఉంటే ఎంటీ ఉత్సాహం గ్యారెంటీ
సరిగ రీస ససరిసాగ దదసపాగ పపదపాగ
తధీం తకిట తధీం తకిట
తధీం తకిట తకిట తకిట థాం


********  ********  *******


చిత్రం: మల్లెపువ్వు (2008)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  భావతరని

చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ
నాకు నీవు తోడు కావాలీ
చిరుగాలీ చిరుగాలి చెలియ జాడ చూపాలీ
నాకు నీవు తోడు కావాలీ
ఒక సారి దరి చేరి ఊసు తెలుప రావా
కడదాకా చెలితోనే చేయి కలపవా నా తోడై

కంటి పాప జంట చూపు చుక్క నీవు కావా
ఎండ మావి వెంట పడ్డ బాటసారి కానా
గూడు లేని గువ్వ పిట్ట నీడలేని దోవా
గోరువంక సాగరాన ఈదుతున్న నావ
చెప్పలేను ఈ బాధా ఎక్కడుందో నా రాధా
వేణువుండి నా చేతా వేదనాయె నా రాతా
ఎంత తీపి ప్రేమ రాలు పూల ఓలే
అంతులేని శోకం మనసా

Palli Balakrishna Monday, October 16, 2017
Mahanandi (2005)



చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
నటీనటులు: సుమంత్ , అనుష్క , శ్రీహరి
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: అనసూయ దేవి
విడుదల తేది: 03.12.2005



Songs List:



ఏమైనా ఏదేమైనా పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: బండారు దానయ్య కవి
గానం: హరిహరన్ , చిత్ర

పల్లవి:
ఏమైనా ఏదేమైనా
ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
ఏమైనా ఏదేమైనా మనసు తెలుసుకున్న
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 1
నువ్వంటే ప్రాణం నీలో నా స్థానం
పదిలమవ్వాలి  పద పద మని పదికాలాలు
ప్రేమంటే దైవం వెంటుంటే ధైర్యం
సాగిపోవాలి కనుమరుగై మన దూరాలు
ప్రేమెంతో పోసి చీటీలను రాసి కొరాను దైవాలని
ఆ ఆశను చూసి ఆశ్చర్యం వేసి
నువు నాకు కావాలనే
ఇన్నాళ్ల నా ప్రేమ నువ్వే నా చిరునామా
అని అనగా అనగా కలలు కనగ

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 2
అందాల రాశి నన్నేదో చేసి తిష్ట వేసావు
తొలి వలపుల తలుపులు తీసి
పక్కింటి పెళ్లి అంటుంది తుళ్ళి
ఒప్పుకోవాలి వధు వరులం మనమైపోయి
చూపుల్లో భావం చేతల్లో జీవం
మార్చింది నీవాడిగా
మాటల్లో మాఘం ఆశల్లో భాగం
అడిగింది నిను తోడుగా
మరణాలే ధరిరాని గగనాలే విడిపోని
ప్రతి జన్మలోను ఒకటి మనము

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు





టైట్ జీన్ ప్యాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: తైదల బాపు 
గానం: టిప్పు 

టైట్ జీన్ ప్యాంట్



ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: శ్రేయా ఘోషల్ 

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

స్వరాలూ ఏడూ సముద్రాలేడు
వెంకన్న వుండే కొండలు ఏడు
పెళ్లితో వేసే అడుగులు ఏడు
నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు
నింగి నెల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

వచ్చింది ఈడు కోరింది తోడు
కన్నేసి చూడు తప్పించు కోడు
చూపులతో వాడు గాయం చేసాడు
ప్రేమించమంటే మాయమౌతాడు

ప్రతి రేయిలో ఇదే స్వప్నము
తెల్లవారితే అదే మౌనము
ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తా
గోల చేస్తుంది నా ఈడు గోల చేస్తుంది
ఆగనంటుంది అందాకా ఆగనంటుంది

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

చూసింది మొదలు గుండెల్లో గుబులు
ఏమైందో అస్సలు ని పైనే కళలు
కౌగిళ్ళ కధలు చెప్పాలా బదులు
ఎందయ్యో అస్సలు ఈ పిచ్చి పనులు

ప్రేమన్నది ఓ అద్భుతం
ప్రేమించడం మరో అద్భుతం
ఇదే అర్ధం ఇదే నిత్యం ఇదే సత్యం
నన్ను ప్రేమిచే మగడు ఎక్కడున్నాడో
కల్లముందొచ్చి షొక్కిస్తే ఎంత బాగుందో

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు




ఎటు చుస్తే అటు నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేల్పుల వెంకటేష్ 
గానం: చిత్ర 

ఎటు చుస్తే అటు నువ్వే 




చంపకమాల పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మాలతి, శంకర్ మహదేవన్ 

చంపకమాల



నా పంచప్రాణాలు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు , చిత్ర

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా (2)
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

ఈ నేల అన్నదీ నా గంగ నువ్వని నీ ప్రేమ స్వాతివాననీ
ఈ గాలి అన్నదీ నువ్వంటే నిప్పని ఆ అగ్నిసాక్షి చాలనీ
తారలతోటి ప్రేమకు నింగి పందిరి వేసే నేలకి వంగి
అడగలేక అడుగుతుంటే అడుగడుగుకి తడబడే హృదయం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

కార్తీక మాసమే కళ్ళల్లో ఉన్నది కల్యాణమెప్పుడన్నది
పెదాల మాటున ఏ మౌనమంత్రమో అక్షింతలేయమన్నది
అందరి మాటే మంగళవాద్యం అందెను నీకే మంగళసూత్రం
అదును చూసి పదును చూసి ముడిపడినది మనసుల ప్రణయం

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం




కత్తిలాంటి అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేటూరి 
గానం: అద్నాన్ సామి, సుజాత 

కత్తిలాంటి అమ్మాయి 

Palli Balakrishna Thursday, September 14, 2017
Simharasi (2001)




చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
నటీనటులు: రాజశేఖర్, సాక్షి శివనంద్
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 06.07.2001



Songs List:



పేదలంటే ప్రాణమిచ్చె పాట సాహిత్యం

 
చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: వెనిగళ్ళ రాంబాబు 
గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్ 

పల్లవి:
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు
దానవీరశూరకర్ణ నరసింహరాజు

సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

చరణం: 1
పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు
నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు
బ్రతుకు బరువై లేకున్న చదువు
చదువులమ్మకు అయినాడు గురువు
మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు
మా కంటిచూపుల్లో సూరీడే నీవు
ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై

సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

చరణం: 2
కటిక నేలే నీ పట్టుపరుపు
పూరి గుడిసెను గుడి చేసినావు
కట్టుపంచే నీకున్న ఆస్తి
కోట్లు ఉన్న నిరుపేదవయ్యా
కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు
కన్నోళ్ల కలలే పండించినావు
ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై

సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా

మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి
కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి
సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి
పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది
గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది








తెలుసా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: వి.రాంబాబు
గానం: హరిహరన్, చిత్ర

తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి
మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి
మమతలే పండాలి మనసులే నిండాలి
దైవం పలకాలి దీవెనలివ్వాలి

ప్రేమపైన నమ్మకాన్ని
పెంచుకున్న చిన్నదాన్ని
ప్రేమతోనే జీవితాన్ని
పంచుకుంటూ ఉన్నవాణ్ని

చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన

తెలుసా నేస్తమా నేస్తమా
ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

ఎదురుగా రారాజు కదలగా ఈరోజు
పరువం పులకించి పరుగులు తీసింది
ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది
పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది

నింగి విడిచి గంగలాగ
నిన్ను చేరుకున్నదాన్ని
కొంగులోనే దాచుకోవే
పొంగుతున్న సాగరాన్ని

ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే

తెలుసా నేస్తమా నేస్తమా
ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా




సత్యభామ సత్యభామ పాట సాహిత్యం

 
చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్ 

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా




అమ్మా అని పిలిచి పిలిచి పాట సాహిత్యం

 
చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.జానకి

అమ్మా అని పిలిచి పిలిచి గుండె కోయకురా
ఆకలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా
గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయ్యింది రా
చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా



రాణి రాణి రాణి రంగసాని రాణి పాట సాహిత్యం

 
చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని
రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని హాఁ...
రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా 
కోరస్: అరె రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా 
కోరస్: అరె కమ్మంగా కానీరా
కండలు తిరిగిన మామ కోరివచ్చాను కాదందువా
పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా
పట్టే పట్టూ హే పట్టే పట్టూ 
ఏ కోడి కూసిన ఆపకుండ నీ దమ్ము చూపెట్టూ
రాణి రాణి రాణి ఏయ్... రంగసాని రాణి హాఁ... 
కాని కాని కాని హాఁ... రాసలీలలన్ని
ఆఁ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా

ఎంతకాలం ఒంటరి గుంటావు జంటగ నన్నుంచుకో 
అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో
ఎయ్ మాటలన్ని చాలించి కాస్త పైటింక సరిచేసుకో 
వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో
ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని 
మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని 
ఉఁ అంటే సరదాగా ఉందామయ్యా 
ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా
నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మాచర్యము
పట్టే పట్టూ హే పట్టే పట్టూ 
ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ

రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా 

సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా 
స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా
మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ
అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు
ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా
నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా
వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా 
వలవేస్తే సూరీడు పడబోడమ్మా
నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా
పట్టే పట్టూ హే పట్టే పట్టూ 
ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ
హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా 
కోరస్: అరె రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా 
కోరస్: అరె కమ్మంగా కానీరా
పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా...
ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము ఏయ్...
అరె పట్టుకోవద్దు నను ముట్టుకోవద్దు
మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు హూఁ...

రాణి రాణి రాణి రా... రంగసాని రాణి రా...
కాని కాని కాని ఏయ్... రాసలీలలన్ని హాఁ...
రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default