Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pedababu (2004)
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
నటీనటులు: జగపతి బాబు , కళ్యాణి
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్.ఎల్. కుమార్ చౌదరి
విడుదల తేది: 30.04.2004Songs List:ఒక వేకువ దీపంతో...పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

హర హర మహదేవ శంభో హర ఓం...
శుభకర శివానంద జగదీశ్వర ఓం...
ప్రణవాంశ శక్తి స్వరూపాయ ఓం....
ప్రళయాగ్ని సెగశిఖలనిటలాక్ష ఓం...

పల్లవి:
ఒక వేకువ దీపంతో ...ఈ లోకం మేలుకొని...
ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని....
ముసి ముసి నవ్వుల .... విరిసిన పువ్వుల....

పల్లె ఘల్లుమందీ....
ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి...తలలు వంచుకుంది
హరి ఓం శాంతి శాంతి....
డమరుక నాద విశ్వశాంతి... 

భం చిక భం చిక చమ్ చక్క.. 
చక్కనమ్మ ముగ్గులెట్టె ఎంచక్కా...
పాడిపంట  పొంగులాడే భం చిక....
ఊరువాడ చిందులాడే ఎంచక్కా...

ధన ధాన్య రాసులు పోసి....
ధర్మానికి  దోసిళ్ళేసి
గుణ శీలం  జనకొలు వైతే
మహదేవుడు మారాజైతే

ముత్యాల పండే లోగిళ్ళలో
వరాలనవ్వుల జల్లంటరో...
చుక్కల్లో వెన్నెల బొమ్మ....
పుట్టింటికి నడిచొస్తుంటే...
పక్కన చిరునవ్వుల వాడే...
శివదేవుడు అనిపిస్తుంటే...

ఆ తాత మనవళ్లాట... ఈ ఊరికిఊయల పాట...
ఆ కుంకుమ రేకుల ముట..మా గడపకి వచ్చిన పూట...
పండగే వచ్చినంత సందడంటరో....
సందెపొద్దు చిందులాడె వేడుకంటరో...

హరి ఓం శాంతి శాంతి
డమరుక నాద విశ్వ శాంతి
అనురాగం పురుడోసుకుని
అనుబంధం ముడులేసుకుని
దేవుడుమనిషై పుడుతుంటే...
నలుగురితో నడిచొస్తుంటే...
బుడి బుడి అడుగుల నాట్యానికీ
ఆ నటరాజే గురుతొచ్చేనట
మనిషిని మహానీయుడు జేసీ....
మమతల గుడి ఒడి జేసుకుని....

కనిపించే తల్లులు వుంటే....
లోకాలను వెలిగిస్తుంటే....
ఆ వెలుతురు కిన్నెరబాట
తాతయ్యకు వెన్నెల కోట
ఆ కోటకు రారాజెవరో
ఈకాలమె చెప్పేనంటా
ఝూం కొకో ఝూం కొకో కోడి పుంజురో....
జాతికోడి కూతలేసే పండగంటరో...
చంకలాడే సంకురాతి రొచ్చెనంటరో....
గొబ్బిళ్లమ్మ పువ్వులెట్టి ముగ్గులంటరో...
బావ....బావ... పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: జాలాది
గానం: రవివర్మ, సునీత బాలాజీ

బావ....బావ...బావ...ముగ్గులోకి రావా
ముద్దులాడి పోవా ... సింగారంగా
భామ... భామ...భామ...ముగ్గులోని ప్రేమా

ముద్దబంతి సిగ్గులా వుండాలంట
అలాగైతే ఇలా వచ్చి ....భలేగ పెళ్ళి చుక్క పెట్టరాదా
ప్రేమకైనా పెళ్ళికైనా.... అదేదో కలిసివచ్చే కాలముందిగా
ముద్దు పుట్టినప్పుడే చంకనెక్కమంటే
మొక్కుబడి మాటలింక ఎందుకంట
హేయ్ చంకలోన బిడ్డకు
చందమామ ముద్దుకు.....
సంబరాల వేళ కాదుగా 

కొండమీద పొద్దుకి..... కలువలమ్మ ముద్దుకి
బంధమేదో... అనుబందమేదో
కారుమబ్బులొచ్చినా...కాలమెంత మారినా
తీరదంటా..ప్రేమా మారదంటా.
కలవపువ్వు రేకులన్ని రాల్చకుండా
కాలమంత వుంటుందా... హొయ్...
చేసుకున్న పుణ్యమే దేనికైనా
ఆశ తీర్చకుంటుందా...
అందుకే నా బావా... నా పొందులోకి రాలేవా
శివ శివ ఓ బేలా ఇక్కడెందుకీ గోలా 

వాన చుక్క వరద...తేనె  చుక్క సరదా
అందినప్పుడే.. దాన్ని పొందినప్పుడే
చేను పంటకైనా... చేదు నోటికైనా
తియ్యనేగా...తీపి బంధమేగా
సృష్టికే మూలమైన ముద్దులాట
నోచుకున్న వారికంట...హొయ్....
అందుకే అందమైన ఆశలన్నీ
పొందుకోరే మోజులన్నీ....
శివ శివ ఏమిటంటా... యిప్పుడెందుకీ తంటా
చక్కనైన మన జంటా... మక్కువే తీర్చమంటా
నవ్వవయ్యా బాబూ.... పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్ 
గానం: చక్రి, కౌసల్య

నవ్వవయ్యా బాబూ....
నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది

నవ్వు దొరబాబూ....!
అరె నీ కేమయ్యింది చిరునవ్వే రాకుందీ 

ఆడదిలా వెంటపడీ అడుగుతుండగా
మూతినలా ముడుచుకునీ ఎంతసేపటా
తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే
నవ్వు చినుకులే ఓయ్ పెదబాబూ

మూటలే తరిగేనా కోటలే కూలేనా
నవ్వితే ఓసారి కొంపలే మునిగేనా
వింతలే జరిగేనా ఇంతలో ఏవైనా
నవ్వితే మనసారా కొండలేం కరిగేనా
నేను చూడలేదురోయ్ నువ్వు నవ్వగా
అంత కోపమెందుకోయ్ వరుసకు బావా
ఇదిగో ఈ వేళా నవ్వాలా
పకపకమని కిలకిలమని కాకుల రొదలా
ఏయ్... ఏంటీ!?
కోకిలా శృతిలా  

మణులే అడిగానా మాన్యాలడిగానా
నువ్ తప్ప ఏమైనా నిన్ను నేనడిగానా
నగలే అడిగానా నాణ్యాలడిగానా
చిన్న నవ్వు కాకుండా చీరలే అడిగానా
దాచుకోకు నవ్వునీ పెదవి చాటునా
ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా
చెబుతా వింటావా ఇపుడైనా
పడిపడి నువు నవ్వర మరి నా అత్తకొడుకా

ఒళ్ళెలా వుందే...
కాదని అనకా ఒరేయ్ పెదబాబు

నవ్వు దొరసానీ...
చిరునవ్వుల సవ్వడితో నవ్వు సందడి చేయాలి

నవ్వు నీలవేణి...
కొంటెనవ్వుల పల్లకిలో నిను రోజూ చూడాలి 

నిత్యమల్లె పువ్వులాగ నువ్వు ముద్దుగా
నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా
గలగలమని నవ్వుతుంటే నాకు పండగా నాకు పండగా
నాలో నువ్వుండాలి పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి.బాలు, కౌసల్య

నాలో నువ్వుండాలి... నీలో నేనిండాలి
నువ్వే నేనవ్వాలి ఏనాటికీ
నా వెంట నడిచాకా....నా చెంతే చేరాకా
నువ్వంటే నేనేగా ముమ్మాటికీ
వద్దన్నా వినకుండా నువు సాయం చేస్తుంటే
పదిమందీ చూశారా బాగోదులే
ఎవరేమీ అనుకున్నా ఎగతాళే చేస్తున్నా
నీ సేవలో నిత్యం వుంటానులే...

నీతో నిమిషం మాటాడినా
నూరేళ్ల సావాసం అనిపించదా....
యుగమే క్షణమైపొతుందిగా
నీవైపు ఫలమో ఇది నీ తోడే ఒక వరమై
దొరికిందని అనిపించగ సంతోషమే
మూసిన   -   కనులు
దాచెను    -    కలలు
ఊసులే   -   మొదలై
ఆశలే    -     అలలో
నదిలో   -    మదిలో
ఉరికే    -   జడిలో                                    
ఒకసారి    -    ఒడిచేరి             

మురిసేనంటా...
పతిలో దైవం కనిపించగా
ప్రతిరోజు ప్రేమించీ పూజించనా
ఇలలో స్వర్గం ఇల్లేననీ
ఇల్లాలిగా నిన్నుపంపించెనా
నా గుండెకు నీ నవ్వులే నులివెచ్చని కిరణాలై
తాకినవని కలిగెను మరి ఆనందాలే
నీకిది  - తెలుసు
మూగది  - మనసు
నాచెలి   - కురులు
పూచిన  - విరులై
ఇదిగో   -  ఇపుడే
తకధిం   -  తకతై
కదలాడి  - దరిచేరి
పిలిచేనంటా
ఒక దేవుడు మనిషైతే పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

ఒక దేవుడు మనిషైతే...తన తల్లికి ఎడమైతే....
విలపించే అనురాగం... విలువెంతో తెలిసేది....
చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా
కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా....

ఏడడుగుల జీవితమా...
ఇది దేవుడి శాసనమా..
ఏడ్పించే నా గతమా
ఓదార్చని  జీవితమా......!ఫెళ్ళున విరిగిందిరో శివధనసు పాట సాహిత్యం

 
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: జాలాది
గానం: సందీప్, కౌసల్య

ఫెళ్ళున విరిగిందిరో శివధనసు 
పెళ్ళికి రమ్మందిరో సీత మనసు
ఆకాశం పందిట్లో అక్షింతలై
భూదేవి గుండెల్లో పులకింతలై
కళ్యాణం సంబరానికీ....హొయ్...హొయ్...హొయ్....హొయ్....
మత్తుగా గమ్మత్తుగా... చిత్తుగా చిర్రెత్తగా
వెచ్చగా గుండెల గిచ్చగా మెచ్చగా కోర్కెలు రెచ్చగా 
జత పెదవుల్లో కధలన్నీ... శృతిలయ ఒడిలో సవరిస్తే
పదనిసలాడే పరువంలో... మదనుడు నీవై కవ్విస్తే

జివ్వును నవ్వుల్లో తేలించనా... యవ్వన పువ్వుల్లో దొర్లించనా
కోరుకున్న కొండంత దైవం... కోర్కెలన్నీ తీరుస్తానంటే
అందుకేగా నా అర్ధ భాగం..ముందుగానే ముడిపిచ్చుకుంది
అల్లుకో నను గిల్లుకో ... హరివిల్లుగా నను దాచుకో
రెచ్చిపో నను గుచ్చుకో... నులివెచ్చగా వాటేసుకో

బంగినపల్లి బంగారమ్మా
రంగుల బుట్ట గంగానమ్మా
చిందులు తొక్కే సింగారమ్మా
టింగుల టంగుల తాయారమ్మా

తొలకరి జల్లై నువ్వొస్తే... వలపుల వొళ్లే తడ్పేస్తే
పిడికెడు నడుమే అందిస్తే ...పిడుగుల మెరుపై మెలికేస్తే
అమ్మొ నాకేదో భయమేస్తుంది... ముందే నన్నిట్లా వొణికిస్తుంటే
కొత్తలో మరి ఏ జంతకైనా ... చిత్తరంగా వుంటుందిలే
పైట చెంగుల పందేలతోటి... పగలూ రేయీ గడిచేనులే
కొద్దిగా చలిముద్దగా...కౌగిళ్ళలో ఆడొచ్చులే
వొద్దులే అసలొద్దులే...సరిహద్దులే దాటొద్దులే


Most Recent

Default