Search Box

Kotha Janta (2014)


చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భువన చంద్ర
గానం: సాహితి
నటీనటులు: అల్లు శిరీష్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 01.05.2014

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ...బోటున్నదీ...
రా సంతకీ... తస్సాదియ్యా ''అటు''

కోనసీమలో...కూరగాయలూ...
గోదారిలో... కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో....
తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో ''సూపరు''
బేరమాడుకో...తస్సాదియ్యా ''అటు''

తప్పుడు కథల అప్పలరాజూ....
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చవయ్యో....
తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పెద్దపురము సంత చేరి
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకులూ
ఎంతో నాణ్యవైనదయ్యో
హెలుసేలుగా బేరమాడుకో....
ఒకటే మాటా ఒకటే రేటూ ''ఒకటే మాటా''
రైటు చేసుకో... తస్సాదియ్యా...''అటు''


********  *******   ********


చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: రమ్య

ఓహో.... ఎన్ని ఎన్ని ప్రేమలో...
ఓహో... ఎన్ని ఎన్ని పేరులో
కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
అమ్మా, బాబుకి మేటర్ లీకయ్యి
Left and right కోటింగ్ మొదలయ్యి
జిందగి మొత్తం  చిరిగీ చేటయ్యి... life long ఏడుస్తారే
ఇట్టా ఇట్టా ఎల్లాకిల్లా డల్లైపోయే మీకోసం
గండాలన్నీ గట్టెక్కించే కొత్త జంట మా ప్రోగ్రాం
లవ్వూ గివ్వూ లావాదేవీ క్షణాలలో తేలుస్తాం
ఇష్కే మీది రిస్కే మాది... బ్యాండు బాజా మోగిస్తాం

కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
ఆర్య సమాజూ... రిజిస్టార్ ఆఫీసూ
చర్చీ, మసీదులూ... వెడ్డింగ్ వెన్యూలే
ఎక్కడా లేనంతా... పక్కా గ్యారెంటీ

టైటూ సెక్యూరిటీ మేం అందిస్తంలే
కొత్తా జంటలకి ఊపిరిపోస్తాం
పెండింగ్ ప్రేమా కథలు సెటిలే చేస్తాం
బాబులకీ... బాంబులకీ...లొంగని మా...సత్తా చూపిస్తాం...

చలో చలో మీలో వున్న భయానికే బ్రేకేస్తాం
మీకూ మీకూ ఓకే ఐతే మిగతాదంతా మేం చూస్తాం
నిజంగానే మీ ప్రేమకి మా ప్రాణాలే అడ్డేస్తాం
నిఖార్సుగా నమ్మారంటే నిఖా షురూ చేసేస్తాం

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0