చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి నటీనటులు: యన్.టి.రామారావు, జమున దర్శకత్వం: యన్.టి.రామారావు నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు విడుదల తేది: 05.01.1962
Songs List:
ఉన్నది చెబుతా వింటారా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి, వసంత ఉన్నది చెబుతా వింటారా
అంబ జగదంబ పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.లీల అంబ జగదంబ
కాలిగజ్జే కదలకముందే పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి కాలిగజ్జే కదలకముందే
అనురాగ పయోనిధి పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల అనురాగ పయోనిధి
సలామలేకుం సాహెబు గారు పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల , యస్.జానకి సలామలేకుం సాహెబు గారు
నన్ను దోచుకుందువటె పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల పల్లవి: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 1 తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 2 నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం... నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
కలల అలలపై తేలెను పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, జానకి కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై కలల అలలపై..... చరణం: 1 జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు (2) తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు (2) చూపుతోనె హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు (2) విరిసీవిరియని పరువము మరులు గొలుపుతున్నందుకు (2) చరణం: 2 సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది (2) జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది (2) విరజాజులు పరమళించు విరుల పానుపేమన్నది (2) అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది (2)
ఒంటరినైపోయాను పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ చరణం: 1 నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని ఎవరికీ గాక ఏ దరిగానక ఎవరికీ గాక ఏ దరిగానక చివికి చివికి నే మ్రోడైపోతిని చరణం: 2 నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ బండలలో నొక బండనైతిని "ఒంటరి" చరణం: 3 వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేస గుండె ఆవిరైపోవుచుండ ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని
మదన సుందర నాదొరా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల మదన సుందర నాదొరా ఓ మదన సుందర నాదొరా నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె ఓ మదన సుందర నాదొరా చరణం: 1 చిన్నదానను నేను - వన్నెకాడవు నీవు (2) నాకూ నీకు జోడు (2) రాకాచంద్రుల తోడు చరణం: 2 మిసిమి వన్నెలలోన - పసిడి తిన్నెలపైన (2) రసకేళి తేలి (2) పరవశమౌదమీవేళ చరణం:3 గిలిగింతలిడ యింత పులకింతలేదేమి (2) ఉడికించకింక (2) చూడొకమారు నా వంక చరణం:4 మరులు సైపగలేను - విరహమోపగలేను (2) మగరాయడా రార (2) బిగికౌగిలి చేర
విన్నావా తత్వం గురుడా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పిఠాపురం నాగేశ్వరరావు విన్నావా తత్వం గురుడా
మాత జగన్మాత పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల మాత జగన్మాత