Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Oosaravelli (2011)

 
చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్, నేహా భాసిన్
నటీనటులు: జూ. యన్. టి. ఆర్, తమన్నా, పాయిల్ ఘోష్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: బి.వి. యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 06.10.2011

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

చరణం: 1
రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వు దూరమైతే
రెండుచేతులు ఊరుకోవుగా
నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

చరణం: 2
నువ్వు ఎంతగా తప్పు చేసినా
ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా
ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా
తీయ తీయగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా
హాయిగానే ఉంది
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్టు
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకెన్నో
గుర్తుకొచ్చేనే వింత గా

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక నువ్వయ్యానిక



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
సర సర సర మంటు విషమల్లే
నర నరం పాకింది తొలి ముద్దు
గబ గబ గబ మంటు గునపాలే
మెదడును తొలిచింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే వదలనులే చెలి చెలీ
నిన్నే మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి చెలీ
నిన్నే మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంతా తిమిచీరే ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధురణాలలే కదిపి కుదుపుతోంది చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే
ఒక జనణం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే సతగ్నులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్సే ఓ ఓ చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

ఒక క్రోదం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే
ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే
ఒక యోధం ఒక యజ్ఞం నిర్విగ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా ఆ ఆ ఆ
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వివేక
గానం: ఫ్రాన్సిస్ కేస్టిల్లినో

Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
ఏంటో నీ Feeling చెప్పేయ్ Darling
ఎటు అంటే అటు తిప్పుతాలే నా Steering
Love అంటే దొంగల్లే Secretగా కలవాలే
Friend అంటే దొరలా Meet అయ్యే Chance లే
Love అంటే Red RosE కోపంగా ఉంటాదే
Friendship White RosE Cool గా ఉంటాదే
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing

ఓసారి Love Better అంటాడు
ఓసరి Friend Great అంటాడు
ఏ రోజెలా వీడుంటాడో వీడికే Dought
ఓ సారి Dear అని అంటాడు
ఓ సారి Fear అని అంటాడు
ఏ Mood లో ఎప్పుడు ఉంటాడో No Updatu

నీ కంట నీరొస్తే నా kerchief అందిస్తా
మళ్ళీ అది శుభ్రంగా ఉతికిచ్చే Wait చేస్తా
నీ కాళ్ళు నొప్పంటే నిను నేనే మోసుకెల్తా
దింపాక నీతోనే నా కాళ్ళు నొక్కిస్తా
Sim Card తెమ్మంటే Cell Phone తెచ్చిస్తా
నువ్వు Swith Off లో ఉన్నా Ringtone మోగిస్తా
Address చెప్పంటే Drop చేసి వచ్చేస్తా
Petrol కై నీ Credit CardE గీకేస్తా
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing


Love అంటు చెప్పాలంటే I Love You చాలే
దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైనా నే Sorry చెపుతాలే
Hey Friendship లో Ego లేదని నే చూపిస్తాలే
నిన్నైనా నేడైనా నేడైనా రేపైనా
రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైన వానైన కన్నిరుండే దారైనా
ఏమైన గాని తోడుండే వాడే Friend అంట
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అద్నాన్ సామి

నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హో ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిల్లు ఎరుపయ్యే సూరీడు చూపైనా
నాచెయ్యి దాటందే నిను తాకదే చెలి
వెక్కిల్లు రప్పించే ఏ చిన్ని కలతైనా
నాకన్ను తప్పించి నిను చేరదే చెలీ చెలీ చెలీ
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తలమోసేలా హో హో
పూలన్నీ నీసొంతం ఓ ఊల్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం ఆదేగ నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చెనా హో
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం

చేదు బాధ లేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హుం హుం హుం హే హే హే
హొ హొ హొ హుం హుం హుం



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఉజ్జయిని

ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి
వీడు మాయగాడు ఊహకందనోడు
వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు అంతుచిక్కనోడు
కోటి తలల తెలివికైన Question మార్కుడు

ఊ ఊసరవెల్లి ఊ ఊ యా యా యా యా ఊసరవెల్లి

Atom Bomb వీడు చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మాసుగాడు వేల రంగులోడు
Wrong నైనా రంగు మార్చి Right చేస్తడు

ఊ ఊసరవెల్లి ఊ అ ఊ అ ఊ అ ఊసరవెల్లి

You Can't Catch Him
You Can't Meet Him
You Can't Punch Him
You Can't You Can't You Can't You Can't Stop Him
You Can't Track Him
You Can't Chase Him
You Catch Catch Catch Catch Catch
ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి ఊసరవెల్లి


*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: MLR. కార్తికేయన్

నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధమంటూ మొదలు పెట్టాకా
కంటికి కనపడాల్సింది Target మాత్రమే
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయు పుత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఓ భజరంగ బలి దుడుకున్నదిరా నీ అడుగులలో
నీ సరిలేరంటూ తన ఆశయ సాధనలో
ఓ పవమానసుతా పెను సాహస ముంగిట పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
దండించాలిరా దండదాలివై దుండగాల దౌత్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకాల శంఖం

ఓం బ్రహ్మాస్త్రము సైతము వమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాసమె పూదండవదా నీ మెడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో
అదే రధసారిగ మార్చద కడలిని పయణములో
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
భజే వాయుపుత్రం భజే బాల గాత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Most Recent

Default