Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mass (2004)




చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, జ్యోతిక, ఛార్మి
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 23.12.2004



Songs List:



మాస్ మమ మాస్ పాట సాహిత్యం

 
Song Detailsచిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: మనో , రవివర్మ

మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా 
అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ 
అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ 
అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్ 
అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క 
అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్ 
అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్ 
మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా 
మరిమాయలు చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
అన్నా ఒక్కసారి పాడన్నా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో 

చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో 
నీసాటి వారి కందరికి ప్రేమ పంచరా 
ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా 
ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా 
నీకిలా దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే 
మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా 
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో 
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో 

సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో 
మట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్ 
అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్ 
మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా 
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్ 
వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలుపెడితే పిడత పగులురో 




వాలు కళ్ళ వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్

నా... బూరెలాంటి బుగ్గ చూడు 
కారు మబ్బులాంటి కురులు చూడు 
వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్ 
అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ 

హేయ్ హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి 
హో...బూరెబుగ్గ బంగారి చేపకళ్ళ చిన్నారి 
బుంగమూతి ప్యారి నంగనాచి నారి
లవ్వు చెయ్ ఓ సారి 

హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి 
వింత వింతగుంటోంది ఏవిటో ఈ స్టోరి 
నువ్వు కన పడకుంటే తోచదే కుమారి 
నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

చరణం: 1 
నీ హృదయంలో నాకింత చోటిస్తే 
దేవతల్లే చూసుకుంట నీకు ప్రాణమైనా రాసి ఇస్తా 
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే 
దీవెనల్లే మార్చుకుంట దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా 
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే 
ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే 
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే
నీకు నేను ఇష్టమేనని 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

వహ్ వ హొ వహ్ వ హొ 
కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో 
వహ్ వ హొ వహ్ వ హొ 
ఆరడుగుల అందగాడు ఒప్పుకో 

చరణం: 2 
ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే... 
బంతిపూల దారి వేస్తా లేతపాదమింక కందకుండా 
ఆ జాబిలమ్మే నా లైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా
ఏ పాడుకళ్ళు చూడకుండా 
నాలాంటి మంచివాడిని మీరంత చూసి ఉండరే 
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే 
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే 
నువ్వు నాకు సొంతమేనని 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 



ఇందురూడు చందురూడు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: రంజిత్, కల్పన

ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు 
నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే
గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే
వేలికేసె మాయదారి సచ్చినోడె

ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే
కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు
ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం
వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ
అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి
నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు
పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె 

ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా
నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా
ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి
నీదోద కుచ్చిల్లే లాగాలా
అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని
అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే
కొంప ఇట్టా ముంచినాడే 





కొట్టు కొట్టు కొట్టు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: టిప్పు, ప్రసన్న

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనె లైఫ్ ఉందిరా (2)

హెయ్... కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు 
ఒంటినిండా సత్తు ఉందిరా 

హెయ్.. ఎర్ర రంగులోన చూడు - రబ్బా రబ్బా 
కుర్ర గుండె జోరు ఉంది - రబ్బారే 
పచ్చరండులోన చూడు - రబ్బా రబ్బా 
పడుచుకళ్ల గీర ఉంది - రబ్బారే 
రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ 
రారో మనమంత ఒక్కటే... 

హోలి హోలి హోలి రంగుల రంగోలి 
హోలి హోలి హోలి రంగుల రంగోలి 
నింగినేల రంగే మారాలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా (2)

చరణం: 1 
హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు 
కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె హాయ్ 
అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు 
అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే... హేయ్
నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె 
అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె 
ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో... 

హోలి హోలి హోలి... 
హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా (2)


ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ 
తొరగా తీసుకురండ్రా...

హోయ్... హోయ్... 
ఆయిరే హోలి ఆయిరే ఓరబ్బా హోలి 
రంగోకి వర్షా లాయిరే 
తా ధినక్ త ధినక్ త దినక్‌త 
తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్‌త 
ధితాంగ్ ధితాంగ్ త... క్యా బాత్ హై 

చరణం: 2 
కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు 
నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయ్యడానికే... హెయ్ 
పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో 
బంతి పూబంతి భావనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే... హెయ్ 
నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు 
నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓనాడు
పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే... హోయ్ 

హోలి హోలి హోలి... 
హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా
హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా
హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 




ల ల లాహిరే ల ల లాహిరే పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: విశ్వా
గానం: వేణు, సునీత సారధి

ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
సరదాగా ఓ సారే వడికొస్తే మంజూరే
గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్మోరే అయ్యయ్యయ్యో
లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే బాప్ షాక్ లిచ్చే షేప్ చూస్తే గుండెలే పేకప్

ల ల లాహిరే ల ల లాహిరే
హే ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే

చరణం: 1
సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత
అడ్వాన్స్ 
అందాలన్ని ఆరేస్తూ చేయించకులే న్యూ డాన్స్
దిల్ కా చోర్  కార్ నే ప్యార్ ఎంచక్కా కుమారా
చూపిస్తే జోర్ నే తయార్ దరికే రారా త్వరగా రణధీర
ఫ్రంటు చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్
సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్

చరణం: 2
హే రుకు రుకు రుకు రుకు రుక్సానా
హే కసి కసి కన్నుల కొరమీనా
నిన్నియాలా అల్లేయాలా మెత్తగా మురిపానా
ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలనే విసిరెయ్నా
ఓ దిల్దార్ బేకరార్ సందించేయ్ నీ తీర్
నీ సరిరారు లేనే లేర్ చడిగా రావే దరికి మనసారా

యూ మియాలి టాల్మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం
బాయ్ ఆవాన బి అన్ లవ్లీ ఇజ్కేబి ఆనందం

ల ల లాహిరే...
ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే




నాతో వస్తావా నాతో వస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: ఉదిత్ నారాయణ్, సుమంగళి

హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 
నీతో వస్తాలే నీతో వస్తాలే 
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 
నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా 
ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే 
ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా 

హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ 
రావె నా సంబరాల సుందరి 
హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకో హరి
నీదే సోయగాల చోకిరి 

చరణం: 1 
మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు 
ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు 
హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు 
నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు 
రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే 
అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే 

హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని 
రావే నా జింగిలాల జిగినీ 
హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి 
మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ 

హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 

చరణం: 2 
అరెరే అరెరే తేనూరే పెదవి 
మెలికే పడని నను నీలో పొదివి 
పడితే నదిలా వరదయ్యే నడుము 
పరదా విడనీ నీదయ్యే క్షణము 
పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ 
పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు 

హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి 
రావే నా బంతిపూల లాహిరి 
హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తిపో హరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ 

హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 
నీతో వస్తాలే నీతో వస్తాలే 
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 


Most Recent

Default