Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Julai (2012)




చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, ఇలియానా
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: యస్.రాధాకృష్ణ
విడుదల తేది: 09.08.2012



Songs List:



జులాయి పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ప్రియ హిమేష్, సుచిత్ సురేషన్

నానేడ పుడితే నీకేటన్నాయ్
నానెట్టగుంటే నీకేటన్నాయ్ 
నానేటిసేత్తే నీకేటన్నాయ్
సిర్రాకు పెట్టకన్నాయ్ 
నే దమ్ము కొడితే నీకేటన్నాయ్
నే డప్పు కొడితే నీకేటన్నాయ్ 
నే కన్నుకొడితే నీకేటన్నాయ్ 
కొట్టానో పళ్లురాల్తాయ్

నా షర్టుకెన్ని బొత్తాలున్నాయ్
ఒంటికెన్ని టీకాలున్నాయ్ 
నా జీన్స్‌కెన్ని కన్నాలున్నాయ్
సెల్ నంబర్‌కెన్ని సున్నాలున్నాయ్ 
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్
చెల్లికెన్ని రాఖీలున్నాయ్ 
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్ 
నేనో పక్క జులాయ్ ఐతే నీకేంటన్నాయ్

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి (4)

ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో
ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో 
ఏ బంతి ఎనక ఏ సిక్సరుందో
కొట్టాకే చూడగలవు 
ఏ లేబులెనక ఏ సరుకుందో
ఏ టేబులెనక ఏ సొరుగుందో 
ఎహే ముట్టకుండా చెయ్యెట్టకుండా 
నువ్వెట్టా చెప్పగలవు 
తెల్లగుంటె జున్ను కాదూ
నల్లగుంటే మన్ను కాదూ 
మెరిసిపోతే గోల్డు కాదూ 
మాసిపోతే ఓల్డు కాదూ 
పై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్ 
నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి (2)

నా పేరు పిప్పరమెంటు నా ఒళ్లంతా కరెంటు 
నా షేపే ట్రంపెట్టు నా సుపే బుల్లెట్ట్టు 
అరె  సక్కెరకన్నా స్వీటు 
నా లిక్కరుకన్నా ఘాటు 
నా ఫేసే ఫ్లడ్‌లైటు ఎలిగిస్తా మిడ్‌నైటు 
హే... ఊరంతా గందరగోళం 
రాత్రైతే రంగుల మేళం 
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలైటు

ఉళ్లాయిళ్లాయి రావో జులాయి
ఉళ్లాయిళ్లాయి సూపిస్తా హాయి

నీ లెక్కకేమొ నే బేవార్సు
నా లెక్కలోన నే ఏక్లాసు 
నీ గోల నీది నా గొడవ నాది 
మనకెందుకంట క్లాషు 
నేనెటెళ్లాంది నాకే తెల్సు 
నీ చూపుకేమొ అది టైం పాసు 
ఏ లెన్సు పెట్టి నువు చూడగలవు 
నా సీరియస్‌నెస్సూ 
టెన్తు ఫెయిల్ మరి టెండూల్కర్ 
క్రికెట్ మాస్టరే కాలేదా
పేపర్‌బాయ్ టు ప్రెసిడెంటు 
అబ్దుల్ కలాము కథ వినలేదా 
ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతా నై 
అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి (2)



ఓ మధు ఓ మధు పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: అద్నాన్ సామి

ఇంతకీ నీ పేరు చెప్పలేదు - మధు

ఓ మధు  ఓ మధు నా మనసు నాది కాదు
ఓ మధు  ఓ మధు నా మనసు నాలో లేదు
రంగులరాట్నంలా కళ్లను తిప్పి చేశావే జాదూ 
అందాల అయస్కాంతంలా తిప్పావే హైదరబాదూ
నన్నొదిలి నీవైపొచ్చిన మనసెట్టాగో తిరిగిక రాదు
వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచేయ్ నాకొద్దు

ఓ మధు  ఓ మధు నా మనసు నాది కాదు
ఓ మధు  ఓ మధు నా మనసు నాలో లేదు

వాన పడుతుంటే...
ప్రతి చిన్న చినుకు అద్దంలాగ నిను చూపిస్తుందే
మా నాన్న తిడుతుంటే...
ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే
రెండు జళ్లు వేసుకున్న చిన్నపిల్లలాగ
యవ్వనాలు పూసుకున్న వాన విల్లులాగ
ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్కలాగ
కవ్వించి చంపావే కరెంట్ తీగ

ఓ మధు  ఓ మధు నా మనసు నాది కాదు
ఓ మధు  ఓ మధు నా మనసు నాలో లేదు
ఓ మధు...

సన్నాయిలా ఉందే అమ్మాయిలందరిని 
ఉడికించే నున్నని నీ నడుము
సంజాయిషీ ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన 
చేసిన తప్పును క్షమించనే లేము
చందనాలు చల్లుకున్న చందమామలాగా
మత్తుమందు జల్లుతున్న మల్లెముగ్గ దాకా
ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ
ఊరించి చంపావే నన్నే ఇలాగ

ఓ మధు  ఓ మధు నా మనసు నాది కాదు
ఓ మధు  ఓ మధు నా మనసు నాలో లేదు
మధు... మధు...మధు...
ఓ మధు... ఓ మధు...ఓ మధు... 




ఒసేయ్ ఒసేయ్ నన్ను పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్సి గిఫ్ట్

ఓ లవ లవ లవ లవ లవ లవ 
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా 
ఓ లవ లవ లవ లవ లవ లవ 
మూతి ముడుచుకోకే మార్చి నెల్లో మల్లెపువ్వా 
హేయ్ పోలిసోడి బండి సైరన్‌లా 
అంబులెన్స్ గాడీ హారన్ల
లౌడ్ స్పీకర్ ఏదో మింగావనేంతగా ఏందీ గోల 
ప్రేమ పుండు మీద కారం పెట్టి 
గుండె అంచుకేమో దారం కట్టి 
ఇష్టమొచ్చినట్లు దాన్నే ఎగరెయ్యకే అలా ఇలా

ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే 
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే

ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉరేసి ఎల్లిపోకే 
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పారేసి పారిపోకే

ఓ లవ లవ లవ లవ లవ లవ 
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా 

నువ్వెంటలేనిదే టెంపుల్‌కెళితే తిట్టి పంపడా గాడే 
నువ్వు తోడు లేనిదే పబ్‌కి పోతే నో ఎంట్రీ బోర్డే 
సింగిల్‌గా నన్ను ఆ మిర్రర్ చూస్తే 
ఎర్రర్ అంటూ తిడతాదే 
నా సొంత నీడే నన్ను పోల్చుకోలేక 
తికమక పడతాదే 
ఉప్పులేని పప్పుచారులా 
స్టెప్పులెయ్యని చిరంజీవిలా 
నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా

ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే 
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారేయకే

ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉతికేసి ఆరేయకే 
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పిండేసి పారేయకే

ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా

నువు క్రికెట్ ఆడితే ఒక్కో టిక్కెటు లక్ష పెట్టి కొంటానే 
నువ్వు అవుట్ అంటే ఆ అంపైర్ పైనే కక్షే కడతానే 
నీ నవ్వు కోసమై క్యూలో ఉండే కోటిమందిని నేనే 
నువు ఏడిపించినా నిను నవ్వించే ఏకైక జోకర్ నే 
మందు ఉందే హార్ట్ ఫెయిల్‌కి 
మందు ఉందే లవ్ ఫెయిల్‌కి 
పండులా ఉన్నోడిని పేషెంట్‌లా మార్చేయకే

ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పారబొయ్యకే 
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే 

ఒసేయ్ ఒసేయ్ ఈడిని చింపేసి పారబొయ్యకే 
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పాతరేయకే 




హే... చక్కని బైకుంది పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: టిప్పు, మేఘ, శ్రీ చరణ్

Girl you’re my mission
let’s do salvation
give me some kiss and
your home is so loving
baby come into me
hey fuse into me
baby o baby you are my star

Girl you’re my mission
let’s do salvation
give me some kiss and
your home is so loving
baby come into me
hey fuse into me
baby o baby you are my star

హే... చక్కని బైకుంది
హే... పక్కనె పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
హే... నీక్కొంచెం పిచ్చుంది
హే... నాకది నచ్చింది
హే... నీ మీద మోజైంది నువ్వు రాజంది
హే... రయ్యి రయ్యి రయ్యిమంది బైకు
సర్రు సర్రు సర్రుమంది సోకు
జివ్వు జివ్వు జివ్వుమంది నాకు
కులుకుతోటి కుట్టమాకు

Girl you’re my mission
let’s do salvation
give me some kiss and
your home is so loving
baby come into me
hey fuse into me
baby o baby you are my star

హే... అడ్డేడ్డేడ్డేడ్డేడ్డే నడుము చూస్తే
అయ్‌ బాబోయ్ ఐ లూస్ మై కంట్రోలు
హేయ్ బ్యాకు సీటు మీద గాని నువ్వు ఎక్కితే
గాలిలోకి లేచి పోద్ది ఫ్రంటు వీలు
నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే
నీ బైకు ఇంక ముట్టుకోదు పెట్రోలు
నా ఒంటిలోన ఒదిగి ఉన్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు
ఆ నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే
ఓ.. గుప్పుమన్న నీ పెర్ఫ్యూము
ముక్కును ముంచిందే
హే... ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు
ముద్దు అంటూ మొత్తుకుంది మూడు
ఒక్కసారి ఎస్సు చెప్పి చూడు
ఆపలేవు నా స్పీడు

హే... చక్కని బైకుంది
హే... పక్కనె పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది

అరె కాళిదాసు రాసుకున్న బుక్కులోంచి
జారిపడ్డ అందమైన పేజీ నువ్వా
దేవదాసు మందు సీసా కిక్కులోంచి
పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డు ఆర్మ్స్ నుండి ఊడిపడ్డ
ఉక్కులాంటి కండలున్న అందగాడా
జేమ్స్ బాండు గన్ను లోంచి దూసుకొచ్చే
గుండుకున్న స్పీడునంతా మింగినోడా
ఆయ్... రింగు రింగులుగ తిరిగిందే నల్లని నీ జుట్ట్టు
ఓ...చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ
హే... లబ్బు డబ్బుమంది గుండె రిథమ్
గేరు మార్చమంది లవ్వు రథం
కుమ్ముతోంది కన్నె మెస్మరిజం
ప్రేమలోన ఇది సహజం

హే... చక్కని బైకుంది
హే... పక్కనె పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది

Girl you’re my mission
let’s do salvation
give me some kiss and
your home is so loving
baby come into me
hey fuse into me




మీ ఇంటికి ముందో గేటు పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీ మణి
గానం: సాగర్ , రెనినా రెడ్డి

మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు
మీ రూట్లో వెలగదు లైటు నాకసలే తెలియని చోటు
ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికెను ఒళ్ళు
మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్
ఆడి కంటికి నేనొక జోకర్ లాగా కనిపిస్తున్నానే
నువు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే 
 
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

హే... కోఠిలొ ఉందో కాఫీ హౌసు 
కేపచ్చినోకి అది ఫేమస్సు
నురగలు కక్కే కాఫీ కప్సు తగిలాయో నీ చెర్రీ లిప్సు
టేబులు కింద చేతులు చేస్తాయ్ ఎంతో రొమాన్సు
ఓయ్... కాఫీ తాగేదా నీ ఫేసు 
నీ ఎదవైడియా నాకు తెల్సు
జబ్బలు దాచని స్లీవులెస్సు 
మోకాళ్ళు దాటని మినీ స్కర్ట్సు
ఆకలి నిండిన నీ చూపుల్తో ఎంతో న్యూసెన్సు
ఏ... అట్టా కాదే చిట్టి నాకో నాటీ తాటే తట్టి
అందరి ముందున పట్టి నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి
ఆ ఊపుకి షాపుకి టాపు లేచి పోయేలా

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

ఓల్డ్ సిటీలో సినిమా హాలు 
అక్కడ ఆడేవన్ని లవ్ స్టోరీలు
పాప్ కార్న్ తింటూ ఒకటో రీలు 
పావుబాజీతో ఇంటర్వెల్లు
పావుగంటకో డ్యూయెట్ చూస్తూ 
దిద్దేద్దాం ప్రేమ అ ఆ లు
ఆపర బాబు కహానీలు 
పెట్టకు నాకు చెవిలో పూలు
ఖాళీ హాల్లో కార్నర్ సీటు 
ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ 
చేస్తావేమో ఎక్సట్రాలు
హేయ్... అల్లా కాదే పిల్లా నీతో నేనే ఏగేదేల్లా
అల్లాహ్ జీసస్ మళ్ళా పుట్టి నిన్నే నమ్మించాలా
నా మాటిని మ్యాటినీ ఆటకి వచ్చేస్తే

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం



పకడో పకడో పాట సాహిత్యం

 
చిత్రం: జులాయి (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మాల్గాడి శుభ, దేవి శ్రీ ప్రసాద్

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో
ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక ఛోడో  బారికేడ్స్ తోడో
మాస్కులన్ని లాగేయ్ రో
నలుగురిలోన నువ్వు ఒకడో
లేక నువ్వు కోటిమంది కొక్కడో
గోడచాటు షాడో  మిష్టరీకో ఫాడో
లెక్కలన్ని తేల్చేయ్ రో
హే విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా
ఆటుపోటు దాటరా రిస్కో గిస్కో ఉస్కో పకడో

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో

నిన్న నువ్వు మిస్సయింది పకడో
రేపు నీకు ప్లస్సయ్యేది పకడో
ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో
దాని పక్క అంకెయ్ రో
గెలుపను మేటరుంది ఎక్కడో
దాన్ని గెలిచే గుట్టు పకడో
టాలెంటుంది నీలో ఖుల్లం ఖుల్ల ఖేలో
బ్యాటూ బంతీ నువ్వేరో...
చెదరని ఫోకస్సే  సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై
యారో మారో యాపిల్ పకడో

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో

Journey of a million mile starts with the single step
i'll put in everything i got, not a single left
I won’t stop till i reach the top, and if i burn out
I will rise from the ashes
you cant stop this no matter what happens
Things in my life keep over lapping
We keep pushing no matter of distraction
Step back when u see me in action.

హే జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీకా హైట్సు పీక్స్ పకడో
పట్టుకుంటే గోల్డయి ప్లాటినం ఫీల్డయి
లైఫు నీకు దక్కాల్రో
నీలో ఏదో స్పార్కు ఉంది ఎక్కడో
ఆరాతీసి దాని ట్రాక్ పకడో
ఆటలన్ని మానేయ్ యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖ చూపాల్రోయ్
పెట్టుకున్న గోల్ నీ కొట్టకుంటే క్రైమనీ
వాడుకుంటు టైమునీ
ఏ దిల్ సే తేరే దిల్ కో పకడో

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో


Most Recent

Default