Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jagadeka Veeruni Katha (1961)




చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.ఆర్, బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి
దర్శకత్వం: కదిరి వెంకటారెడ్డి
నిర్మాత: కదిరి వెంకటారెడ్డి
విడుదల తేది: 09.08.1961



Songs List:



జయ జయ జయ జగదీక ప్రతాప పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

జయ జయ జయ జగదేక ప్రతాపా! జగదానందకరా
విక్రమ సాహస శౌర్య విధానా! విమలాశయమణి కిరీటధారీ!
వీర ధీర గంభీర సుందరా ! విజయఖడ్గ ధారీ !
మూర్తిమంత నవమోహన రూపా ! - కీర్తి కామినీ మానసచోరా
దివిజలోక సురరాజ సమానా ! - దివ్యగాన నిపుణా !




జలకాలాటలలో  పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా, పి.సుశీల

పల్లవి: 
జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా
జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా

చరణం: 1 
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో 
సన్న వలపు విరిసే 
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో 
సన్న వలపు విరిసే 

జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా

చరణం: 2 
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే 
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే 
అది వరుని కొరకు పిలుపే 

జలకాలాటలలో కలకల పాటలలో 
ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా



ఓ సఖీ ఓహో చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
ఓ దివ్య రమణులారా... 
నేటికి కనికరించినారా 
కలకాదు కదా సఖులారా 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖి

చరణం: 1 
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో...
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కనులవిందు చేశారే...
కనుల విందు చేశారిక ధన్యుడనైతిని నేనహా

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 

చరణం: 2 
నయగారము లొలికించి 
ప్రియరాగము పలికించి 
నయగారము లొలికించి 
ప్రియరాగము పలికించి 
హాయి నొసగు ప్రియలేలే 
హాయి నొసగు ప్రియలే మరి 
మాయలు సిగ్గులు ఏలనె 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 

చరణం: 3 
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు 
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు 
ఆటలహో తెలిసేనులే 
ఆటలహో తెలిసెను 
చెలగాటమయ నా కడ చెల్లునె 

ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ 
ఓ సఖీ





నను దయగనరా పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా

నను దయ గనవా, నా మొర వినవా మది నమ్మితి
నిన్నేమాతా ఇక శరణము నీవే మాతా
అపశకునంబయే నమ్మా సుతుడే - ఆపదపాలాయెనో
ఎటు చూచెదవో, ఎటు బ్రోచెదవో నా - తనయుని భారము నీదే
ఆశాదీపము ఆరిపోవునా చేసిన పూజలు విఫలము లవునా
నీవు వినా ఇక రక్షకు లెవరే కానగ రావా! ఓ మాతా! ఓ మాతా!



వరించి వచ్చిన మానవ వీరుడు పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.సుశీల

పల్లవి: 
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 1 
నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే 
అహ నవ మన్మధుడే ఆయెనే 
ఓ హో...మన్మధుడై నిన్నావేశించి మైమరపించేనే హలా 
నిను మైమరపించేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 2 
అలిగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే 
అహా మలయానిలుడే ఆయెనే 
ఓహో మలయానిలుడై చల్లగ చెలిపై వలుపులు విసిరినే హలా 
అహ వలుపులు విసిరేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 

చరణం: 3
చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే 
అహ లలిత వసంతుడె ఆయెనే 
వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా 
తన చెంతకు పిలిచేనే హలా 

వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా 
ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ 
అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట 





కొప్పు నిండా పువ్వులేమో పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత 

కొప్పునిండా పూవులేమే కోడల కోడల
నీ కెవరూ ముడిచీనారే కోడల కోడల
ఎదురింటి మల్లెచెట్టు మామయ్య మామయ్య !
నీళ్లుపోసి పెంచానయ్యో మామయ్య మామయ్య !
ఆ ! ఆహాఁ! అట్టాగే మరిగైతే
చెంపంతా గాట్లేమే కోడల, కోడల- నిన్నెవరు కొరికినారే
కోడల
ఎదురింటి రామచిలుక మామయ్య మామయ్య
ముద్దు పెడితే కొరికిందయ్యో మామయ్య మామయ్య




ఐనదేమో ఐనదిపాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

ఐనదేమో ఐనదీ ప్రియ 
గానమేదే ప్రేయసీ 
ఐనదేమో ఐనదీ ప్రియ 
గానమేదే ప్రేయసీ 

ప్రేమ గానము సాగ గానే 
భూమి స్వర్గమె ఐనది 
భూమి స్వర్గమె ఐనది 

ఐనదేమో ఐనది

చరణం: 1 
ఏమి మంత్రము వేసినావో 
ఏమి మత్తును చల్లినావో 
ఏమి మంత్రము వేసినావో 
ఏమి మత్తును చల్లినావో 
నిన్ను చూసిన నిమషమందె 
మనసు నీ వశమైనదీ
మనసు నీ వశమైనదీ

ఐనదేమో ఐనది

చరణం: 2 
కులుకులొలికే హోయలు చూసి 
వలపు చిలికే లయలు చూసి
కులుకులొలికే హోయలు చూసి 
వలపు చిలికే లయలు చూసి
తలపు లేవో రేగి నాలో 
చాలా కలవరమైనదీ 
చాలా కలవరమైనదీ

ఐనదేమో ఐనదీ ప్రియా 
గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనదీ 





ఆశా ఏకాశా నీ నీడను పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా
ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా
చింతలో రెండు చింతలొ 
నా చెంత కాదు నీ తంతులు...ఓయ్... చింతలో 
ఓ...ఓ...ఓ...ఓయ్... చింతలో 

చరణం: 1 
వద్దంటే కాదె ముద్దుల బాలా 
ప్రేమ పరగణా రాసేశా ఒద్దంటె 
నిన్ను రాణిగా... నిను రాణిగా చేసేశా 
చేతులు జోడించి మ్రొక్కేశా... ఆశా

చరణం: 2 
ఓ...ఓ...ఓ...ఓయ్.... 
కోశావు లేవోయి కోతలు 
చాలా చూశానులే నీ చేతలు
కోశావు లేవోయి కోతలు 
చాలా చూశానులే నీ చేతలు
రాజు ఉన్నాడూ - రాజు ఉన్నాడు 
మంత్రి ఉన్నాడు సాగవు సాగవు 
నీ గంతులు... చింతలూ

చరణం: 3
రాజా... మంత్రా... ఎవరూ? ఎక్కడా? 
తా తరికిట తా తరికిట తళాంగు తక భా 
రాజు గారి బూజు దులిపేస్తా 
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
రాజు గారి బూజు దులిపేస్తా 
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
కోటలో పాగా... కోటలో పాగా వేసేస్తా 
గట్టిగ నీ చెయ్యి పట్టేస్తా ... ఆశా...





మనోహరముగ మధుర మధురముగ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి.సుశీల

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

చరణం: 1 
ఇది చంద్రుని మహిమేలే 
అందంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఇది చంద్రుని మహిమేలే 
అందంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఆ మంచిది యైనా కొంచెమైనా 
వంచన నీదేలే అయినా  మంచిదిలే 

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 

చరణం:2 
ఇది మోహన మంత్రమెలే 
అదంతేలే సరేలే మనకిది మేలేలే 
ఇది మోహన మంత్రమెలే 
అదంతేలే సరేలే మనకిది మేలేలే 
మేలే అయినా మాలిమైనా
జాలము నీదేలే  అయినా మేలేలే

మనోహరముగ మధుర మధురముగ 
మనసులు కలిసెనులే 
ఆ మమతలు వెలసెనులే 





ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీలా, పి.సుశీల

పల్లవి: 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా...

చరణం: 1 
కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు 
తొలి మేము చేసిన పుణ్యమున గాక 
ఆ మందార మాలతీ పారిజాతాలతో 
అందముగ ముడివేసి అలరజేసేము

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 

చరణం: 2 
మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి 
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము 
ఆ పారాణి వెలయించి పాదపూజను చేసే 
కోరికలు తీరునని పొంగిపోయేము 

ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
సేవలంది మాకు వరములీయవమ్మ 
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా...




రారా కనరారా పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

పల్లవి: 
రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా 
రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా 

చరణం: 1 
నాలో నాలుగు ప్రాణములనగా 
నాలో నాలుగు దీపములనగా 
నాలో నాలుగు ప్రాణములనగా 
నాలో నాలుగు దీపములనగా 
కలిసి మెలసి అలరించిన చెలులే 
కలిసి మెలసి అలరించిన చెలులే 
నను విడనాడెదరా 

రారా కనరారా 
కరుణ మానినారా ప్రియతమలారా...రారా 

చరణం: 2 
మీ ప్రేమలతో మీ స్నేహముతో 
మీ ప్రేమలతో మీ స్నేహముతో 
అమరజీవిగా నను చేసితిరే 
మీరు లేని నా బ్రతుకేలా 
మీరు లేని నా బ్రతుకేలా 
మరణమె శరణముగా 

రారా కనరా 
కరుణ మానినారా ప్రియతమలారా





శివశంకరీ పాట సాహిత్యం

 
చిత్రం: జగదీకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల

శివశంకరీ
శివశంకరీ శివానందలహరి 
శివశంకరీ శివానందలహరి 
శివశంకరీ 
శివానందలహరి శివశంకరీ 

చరణం:1 
చంద్రకళాధరి ఈశ్వరీ... 
ఆ...చంద్రకళాధరి ఈశ్వరీ... 
కరుణామృతమును కురియుజేయుమా 
మనసు కరుగదా మహిమ జూపవా 
దీనపాలనము చేయవే 

శివశంకరీ 
శివానంద లహరి శివశంకరీ 
శివశంకరీ శివానందలహరి 
శివానందలహరి శివశంకరీ 
శివశంకరీ శివానందలహరి
శివశంకరీ శివానందలహరి
శివశంకరీ

చంద్రకళాధరి ఈశ్వరీ..
రిరి సనిదనిస మపదనిస 
దనిస దనిస దనిస

చంద్ర కళాధరి ఈశ్వరీ 
రిరి సని పమగ రిసగ
రి రి రిరిస రిమ పదా
మప నిరి నిస దప 

చంద్రకళాధరి ఈశ్వరీ 
దనిస మపదనిస 
సరి మగరి మపని దనిస
మపనిరి సరి నిసదనిప
మపనిసరీసని సరిగా రిస రిరి సని 
సనిపనిపమ పమ గమరిసనిస 
సరిమపనిదానిస 
సరిమపనిదానిస 
సరిమపనిదానిస 
చంద్రకళాధరి ఈశ్వరీ 
చంద్రకళాధరి ఈశ్వరీ 
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

శివశంకరీ... ఆ...ఆ...
శివశంకరీ... 

తోం తోం తోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
దిర్ ద్రి యానా దరితోం 
దిరిదిరి తోం దిరిదిరి తోం 
తోం తోం 
దిరిదిరి దిరిదిరి దిరిదిరి 
నాదిరి దిరిదిరి దిరి దిరి దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం 
నినినిని నినినిని దనిని దనినినిని దప 
రిమరి సరిసనిసని పనిప మపమరిగా 
సరి సస మపమమ సరిసస సససస 
సరిసస పనిపప సరిసస సససస 
మపమమ పనిదద 
మపమ పనిదద 
మపమ పనిద మపమ పనిద 
పదపప సరిసస 
పదప సరిస పదప సరిస 
మమమ పపప దదద నినిని 
ససస రిరిరి గరిసనిసరిపా 

శివశంకరీ

Most Recent

Default