Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maavichiguru (1996)




చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రంజిత
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: పి.ఉషారాణి
విడుదల తేది: 30.05.1996



Songs List:



కోదండ రాముడంట అమ్మలాలో పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, జగపతి బాబు, వందేమాతరం శ్రీనవాస్, ప్రసన్న, అల్లు రామలింగయ్య, యం.యం.శ్రీలేఖ, రేణుక

కోదండ రాముడంట కొమ్మలాలా వాడు
కౌసల్య కోమారుడంటా కొమ్మలాలా
ఆజాను బాహుడంటా అమ్మలాలా వాడు
అరవింద నేత్రుడంట అమ్మలాలా

రామణీల లామెకు తగ్గ జోడువాడేనని
రహదారులన్నీ చెప్పుకోగా విని

కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని
కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా

ఈడు జోడు బాగానే ఉంటుందండీ
చూసయిగానే లగ్గాలే పెట్టించండి
ఏదీ ఇంకా అందాకా రాణీ రాణీ
పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ

బాడీ మాత్రం భేషుగ్గా కనపడుతోంది
టైర్ లు మాత్రం రిటైర్ అయిపోయాయండీ
అడపా దడాపా గాలి కొడితే సరిపోతుంది
మారుతి లాగా మాబుల్లో పరుగెడుతోంది

వత్తన్నారు వత్తన్నారు అయ్ బాబోయ్
వచ్చేత్తనారండోయ్
దొంగలో బందిపోటులో వస్తున్నట్టు
ఆ గావు కేకలు ఏమిట్రా
వచ్చేది పెళ్లి వారేగా
బాగుందయ్యోయ్ ముసలాయన
వచ్చేది మగ పెళ్ళివారు
కబుర్లాడుతూ కూర్చోకా
ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురేళ్ళు
అన్ని యార్పాట్లు చేసానే ముసలీ
అయినా ఏది ఇంకా రానిదే

ఆ వచ్చామండీ మొత్తానికి వచ్చామండీ
తెచ్చామండీ అబ్బాయిని తెచ్చామండీ
కార్ ఉ పల్లకి మాక్కూడా తెచ్చామండీ
పిళ్లనంపితే తీసుకునే వెళతామండీ

అబ్బాయ్ మనం పెళ్ళికి రాలేదు
పెళ్లి చూపులకి వచ్చాము
నువ్వలా తొందర పడకూ

రండయ్యా రండి పెళ్లి పెద్దల్లారా
అన్ని సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా
కాఫీ ఫలహారాలవి కానిస్తారా
లేక అర్జెంటుగా అమ్మాయిని చూసేస్తారా

బాబాయ్ కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు
అమ్మాయిని పిలిపించండీ
వధువు వస్తున్నది
వధువు కాదు అదేదో వింత వస్తువు
బాబాయ్ నీ పేస్ అలా సైడుకి పెట్టి
అమ్మాయిని తీసుకు రండీ
వధువు వస్తున్నది
కొంచెం ఏజ్డ్ గా ఉన్నట్టుంది
నీ మొహం ఆవిడ మా పిన్ని
పిన్నీ ఆలస్యం చేస్తే మావాడు
ఆడ వాళ్ళు అందర్నీ పెళ్లికూతుర్లు
అనుకునేట్లున్నాడు
అసలు హీరోయిన్ ని తీసుకురండమ్మా
వధువు వస్తున్నది

అబ్బాయ్ వాయిదాలు వేయకుండా
జడ్జ్మెంట్ ఇచ్చేయ్
అమ్మాయి నచ్చిందా
ఒకే నచ్చినట్టేనండీ
నసాగకూ ఎం కావాలో అడుగూ
పాటా ఏమైనా వచ్చునేమో
కనుక్కోండి గురువుగారూ

హహహ పాట ఆటమ్మా
పడేస్తే పోలా

కోదండ రాముడంట కొమ్మలాలా వాడు
కౌసల్య కోమారుడంటా కొమ్మలాలా
ఆజాను బాహుడంటా అమ్మలాలా వాడు
అరవింద నేత్రుడంత అమ్మలాలా

రామణీల లామెకు తగ్గ జోడువాడేనని
రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని
కలికి సీతమ్మ వీచే గుమ్మలాలా

సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ
డివ్వి డివ్వి దివ్విట్టం తెచ్చిందండీ
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ
డివ్వి డివ్వి డివ్విట్టం తెచ్చిందండీ
రేపోమాపో పప్పన్నం పెడతామండీ
ఊరు వాడా జనమంతా దీవించండి





కొమ్మన కులికే కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర 

పల్లవి:
కొమ్మన కులికే కోయిల 
ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి
నీ అందెల సవ్వడి చెయ్యవే
ఓ....మామా  -  ఓ....భామా
ఎదలోయల దాగిన చిత్రమా
కనుసైగలు చేసిన ఆత్రమా
ఉదయాలకు నీవే ప్రాణమా
కసి ముద్దులు రాసిన కావ్యమా 
వయారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా

కొమ్మన కులికే కోయిల 
ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా 
కను చూపుల గారడి చేయకే

చరణం: 1
చెప్పేయ్ వా చెవిలోన ఒక మాట 
పువ్వులతో తుమ్మెద చెప్పేమాట
నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నాదట
నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట
నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా
నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ
అనంతాల ఆర్త నీవై చేరుకున్న వెళ్లలో

కొకలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియవే
తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడి చేయకే

చరణం: 2
పూసింది కౌగిట్లో పులకింత
వెచ్చంగా పాకింది ఒళ్ళంతా
పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన
నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన
నీ చెంతకు చేరా విరహంతో పడలేక
నును మెత్తని పరువం రాసింది శుభలేఖ
సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో

కొమ్మన కులికే కోయిల 
ఓ కమ్మని పాట పాడవే
తేనెలు మరిగిన తుమ్మెదా 
నీ అల్లరి పనులిక ఆపవే
ఓ....భామ  -  ఓ....మామ
ఉదయాలకు నీవే ప్రాణమా
కసి ముద్దులు రాసిన కావ్యమా 
ఎదలోయల దాగిన చిత్రమా
కనుసైగలు చేసిన ఆత్రమా
వయారాల వీణ నీవై దోచుకున్న అందమా

కొమ్మన కులికే కోయిల 
ఓ కమ్మని పాట పాడవే
కమ్మగ నవ్వే నెచ్చెలి
నీ అందెల సవ్వడి చెయ్యవే




మాట ఇవ్వమ్మా చెల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.యస్.చిత్ర 

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి 
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి 
మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి 
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి 
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని 
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి 
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి 

పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా 
కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా
కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ 
పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ 
ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా
అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ 
త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి 
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి 

ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా 
వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా 
ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా 
ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా
ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై 
వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ 
ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి 
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి 
మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి 
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి 
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని 
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని 

మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి 
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి 





కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకో పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర 

పల్లవి:
కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూకొట్టి పిలిచినందుకే
చిరు నవవుల దొరసాని
చిరు గజుల సడియేమి
యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి

అశలన్నీ... ఊసులాయే
గుండెచేరే... గువ్వలాయే 

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూకొట్టి  పిలిచినందుకే

చరణం: 1
చుక్కల్లూ మెరిసెవేళా 
చెలి చెక్కిళ్లు ముద్దాడనా
వెన్నల్లు కురిసేవేళా
నిన్ను వడిచేర్చి లాలించనా
కౌగిల్లా పందిట్లో జత చేరవా
పరువాల పొంగుల్లో తేలించవా
కళ్యాణ రాగాలు వినిపించని
కళ్ళల్లో నీ రూపు కనిపించని
ఈ చలిలో నీ ఒడిలో
ఈ ఆరాటం పోరాటం ప్రతి ప్రేమ కథలోదే
తోడుకోరే... ఈడు బాధ
చుడలేవా... చిట్టి రాధ

కోరస్: 
కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూకొట్టి  పిలిచినందుకే

చరణం: 2
నీ కల్ల వాకిల్లలో 
పెళ్లి పల్లకి నేనెక్కనా
లేలేత నడువంపులో
నీ  అందాలు తిలకించనా
జడ పట్టి నిలబెట్టి కవ్వించకు 
జతకట్టి నను చుట్టి బందించకు 
నిను మెచ్చి నీకోసమొచ్చానులే 
కడదాకా నిన్నింకా విడబోనులే
ఒకటయ్యే సమయనా
ఈ ఆనందం అనుబంధం ఏ జన్మ వరమో
అల్లుకుంది... వల్లేవాటు
చేరమంది... చెట్టుచాటు

కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే
కుర్రగాడు కన్నూకొట్టి  పిలిచినందుకే
చిరు నవవుల దోరసాని
చిరు గాజుల సడియేమి
యెదలోయల కదలాడే
తొలి ఆశల సడి స్వామి
అశలన్నీ... ఊసులాయే
గుండెచేరే... గువ్వాలాయే 

కోరస్: 
కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే 
కుర్రగాడు కన్నూకొట్టి  పిలిచినందుకే




రంజు భలే రామచిలుక పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, అనుపమ

చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, అనుపమ

Hey Lovely Girls It's Beautiful day
You are so Young

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
సిద్ధం అంటే సరదా పడదామే..ఏ..ఏ..

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముస్తాబంతా చిత్తైపోతుందే..ఏ..ఏ..

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక




మానస సంచరరే పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: యస్.పి.బాలు

మానససంచరరే బ్రహ్మణి మానససంచరరే
మదసికి పింఛాలంకృత చికురే
మదసికి పింఛాలంకృత చికురే
మహనీయ కపోలజిత ముకురే
మానససంచరరే... ఏ
శ్రీ రమణీ కుచ... శ్రీ... శ్రీ... శ్రీ రమణీ
శ్రీ రమణీ కుచ దుర్గవిహారే సేవకజన మందిర మందారే
పరమహంస ముఖచంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే
మానససంచరరే... ఏ...



మావిచిగురు తిని పాట సాహిత్యం

 
చిత్రం: మావి చిగురు (1996)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: యస్.పి. బాలు

పల్లవి:
మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో తలపండగ...
ఇంటిలో తొలి పండుగ...
సింగారి సీతకు శీమంతమై
సరికొత్త ఆశల వసంతమై
మనసు మురిసిపోగా ఊఁ... ఊఁ...

మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల

చరణం:1
నీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయనా
ఆ బొమ్మలో గల పాపాయికి జోజోలు పాడనా
మన కలలకి ఉదయమిదే అని తెలిపిన కిరణమిది
అణువణువును కలగలపే మన చెలిమికి సాక్ష్యమిది
మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగ కనబడగా
పలికించనీ నవ నాదాలనీ పారాడనీ పసి పాదాలనీ
మనసు మురిసిపోగా...

మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల

చరణం:2
వయ్యారివూహలు తియ్యంగ ఊదిన వేణునాదమో
చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానమో
నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది
నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది
మునుపెరుగని ప్రియలయలో శ్రుతి కలిపిన జత కథలో
సంసార వీణను సవరించగా సంతాన గీతిక
రవళించగా
మనసు మురిసిపోగా....

మావిచిగురు తిని మీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిల
మంచి కుబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయల
ఇంతలో తల పండగ...
ఇంటిలో తొలి పండుగ...


Most Recent

Default