-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sankranthi Song (2019)"


పాట: సంక్రాంతి పాట (2019)
సంగీతం: SK.బాజీ
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: మంగ్లీ


సంక్రాంతి పాట (2019) సాహిత్యం

 
రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు 
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి..
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

పంతాలతో రగిలిన మన రాయలసీమ. 
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండుగ నీవు
ప్రేమలతో  ప్రతి గుండెల పెనవేసావు
తెలతెలవారుతుంటే రాజేసే భోగి మంట 
కొత్త అల్లుళ్ళతో  కోనసీమ మురిసేనంట
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా
ఊరిని తలుచుకొని తన్మయమే చెందేనట

ఆట పాటలకే  పట్టం కట్టి 
సంతోషాలకే శ్రీకారం చుట్టి..
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతి
ప్రేమల చిరునామా..రాయలసీమ 
అనురాగాల రాగం పాడేనమ్మా
పసిడి కోనసీమ  పంటచేల నడుమ 
పరువాల గోదావరి పారేనమ్మా
పంటలు కానుక ఇచ్చి 
రైతుల కలలను తీర్చి 
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి
పచ్చి పాలజల్లు పచ్చని పొదరిల్లు
పైరులతో పల్లెలన్నీ విలసిల్లు
మంచు పూలజల్లు పరిమళాలు చల్లు
వేలాది పువ్వుల కల్లాపిని చల్లు

ఏరువాక ఎదల మీద పంటను తీసి 
సంచారజాతికింత దానం చేసి
గోమాత, భూమాతల పూజలు చేసి 
హరిదాసుల కీర్తనలు గానం చేసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం..
బొమ్మల కొలువులోన కొలువుదీరే పసితనం 
పసుపు కుంకుమలే పడతులకు వాయనం
గగనం తాకునమ్మా గాలిలోన పతంగం
స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం 
ఉత్తర దిక్కున భానుడి  సంచారం 
తెలంగాణ, ఆంధ్రులకు చెరిపెను దూరం

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు 
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు 
పట్టు పరికిణి కట్టి చుక్కల వరసలు పెట్టి 
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి. ఎడ్లతో పరుగులు పెట్టి 
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే    సంక్రాంతి 

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు 
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

Palli Balakrishna Saturday, May 29, 2021

Most Recent

Default