చిత్రం: గాయం (1993) సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: సిరివెన్నెల (All) నటీనటులు: జగపతి బాబు, రేవతి దర్శకత్వం: రాంగోపాల్ వర్మ నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర విడుదల తేది: 22.04.1993
Songs List:
నైజాం పోరి పాట సాహిత్యం
చిత్రం: గాయం (1993) సంగీతం: శ్రీ సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, చిత్ర, ఈశ్వర్ ఆ... ఆ... ఆ... పాడనా గోపాలా కమ్మగా కైపే కమ్మగా కళ్ళే వాలగా ఊపనా ఉయ్యాల మెల్లగా చల్ల చల్లగా ఒల్లే తేలగా అరే గిదేం షురు చేసినావమ్మ ఇయలరేపు ఎవడింతడు పాటపాడితే కిక్ ఉండాలే నైజాం పోరి నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి నైజాం పోరి నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి బాగుంది భయ్ జర లాగింది భాయ్ దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే పత్త లేక పారిపోయెరో జింగారే జీగిచాక జింగిచాక (6) పైటను చూడగానే పైత్యమొస్తదా పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా మన్ను తిన్న పాము లెక్క ఊరుకుంటే పరువు పోదా పబ్లిక్ చూస్తరన్న ఖాతరుండదా ఇజ్జత్ పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా ఊర్కేనే ఉండమంటే మంచి మోకా జారిపోదా ఆ హ హా... వామ్మో వద్దమ్మో కిక్కు ఊపు అరె ఉండాలమ్మో గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా జింగారే జీగిచాక జింగిచాక (2) యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది తు తేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది ఒంటరి ఆడపిల్ల అంత లోకువా తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా అక్కలు సెల్లెల్లు అందరుండినా సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ కమ్ డౌన్ బేబీ డోంట్ షై వై డోంట్ యు టేక్ మీ ఆన్ ఎ డేట్ విత్ యు ఓ మై లవ్... మై డార్లింగ్... యాహ్ ఎ ఎ ఏ ఏందయ్యో ఏంటా స్పీడు లేదా బ్రేకు అరె ఆట పాట సాగాలంట ఫికర్ దేనికంట నైజాం పోరి నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి నైజాం పోరి నజ్దీక్ చేరి నవ్వింది ఓ సారి నా జంట కోరి నకరాలమారి వచ్చింది భయ్ ప్యారి బాగుంది భయ్ జర లాగింది భాయ్ దిమాక్ పాయె దిల్ దిమ్మెక్కి పాయె పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతమంటే పత్త లేక పారిపోయెరో జింగారే జీగిచాక జింగిచాక (2)
నిగ్గదీసి అడుగు పాట సాహిత్యం
చిత్రం: గాయం (1995) సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్.పి.బాలు (నవంబర్ 30, 2021 న చేంబోలు సీతారామశాస్త్రి గారు స్వర్గస్తులయ్యారు, ఈ సందర్భంగా ఈ పాటని గుర్తుచేసుకుంటూ, కాస్త ప్రశ్నించినట్టుగా అనిపించినా ఇరవైఐదు ఏళ్ళ క్రితం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నేటికీ వర్తిస్తుంది. సంవత్సరాలు గడచిపోతున్నాయే కానీ పరిస్థితులు మారట్లేదు. సమాజం ఉన్న పరిస్థితిని స్పష్టంగా కళ్ళముందు నిలిపే ఈ పాట చాలా మందికి ఇష్టం. ఈ పాటని సిరివెన్నెల గారిపై చిత్రీకరించాలనుకోవడం ఒక మంచి ఆలోచన, కవి ఆవేశాన్ని మరింత ప్రభావవంతంగా నేరుగా ప్రేక్షకులకు చేరవేయగలిగాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎస్.పి. బాలు గారి గళం నుండి ఆవేశం తో పాడిన ఈ పాట ఎన్ని తరాలైన ప్రశ్నిస్తుంది మనల్ని.) నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం
అలుపన్నది ఉందా పాట సాహిత్యం
చిత్రం: గాయం (1993) సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి) సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు చరణం: 1 నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు చరణం: 2 నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
స్వరాజ్యం ఎందుకని పాట సాహిత్యం
Song Details
చెలిమీద పాట సాహిత్యం
Song Details
1993
,
Gaayam
,
Jagapathi Babu
,
Ram Gopal Varma
,
Revathi
,
Sri (Kommineni Srinivasa Chakravarthi)
,
Yarllagada Surendra
Gaayam (1993)
Palli Balakrishna
Wednesday, July 5, 2017