-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "DJ Tillu"



చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి
దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 2022



Songs List:



టిల్లు అన్న డీజే పెడితే పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల

లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

అరె, చమ్కీ షర్టు - ఆహ
వీని గుంగురు జుట్టు - ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ - ఆహ
అత్తరే జల్లినట్టు - ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు - అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే - ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు





పటాసు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ
గానం: అనిరుధ్ రవిచంద్రన్

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా

మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా

కలిసే నడిచే దారుల్లో
రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ
నడుం చూసే వేళా నరం ఆనేసిందే
మనసే కాలే జారెనే

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా




నువ్వలా వెన్నెలా (Male) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: సిద్దు జొన్నలగడ్డ

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా





నువ్వలా వెన్నెలా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: యామిని గంటసాల 

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

Palli Balakrishna Sunday, February 13, 2022

Most Recent

Default