చిత్రం: ఐతే (2003)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్
నటీనటులు: శశాంక్, జనార్ధన్, మోహిత్, చద్దా, అభిషేక్, సింధూతులని
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: గంగరాజు గుణ్ణం
విడుదల తేది: 11.04.2003
చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె
తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
అడ్డు చెప్పదె అంబ్రెల్లా ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటె
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటె
అడిగిన తరుణమె పరుగులు తీసె అల్లావుద్దీన్ జీని ఉంటె
చూపద మరి ఆ మాయా దీపం మన ఫేటె ఫ్లైటయ్యె రన్వె
నడి రాత్రె వస్తావె స్వప్నమ
పగలంత ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినె ఊరిస్తె న్యాయమ
సరదాగ నిజమైతె నష్టమా
మోనాలీసా మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా
వేకువనె మురిపించె ఆశలు
వేను వెంటనె అంత నిట్టూర్పులూ
లోకంలొ లేవ ఏ రంగులు
నలుపొకటె చూపాల కన్నులూ
ఇలాగేనా ప్రతి రోజూ ఎలాగైనా ఏదొ రోజూ మనదై రాదా
చిటపట చినుకులు అరచేతులలొ ముత్యాలైతె ఐతె
తరగని సిరులతొ తల రాతలనె మార్చేస్తుంటే ఇట్టె ఇట్టె
Aithe (2003)
Palli Balakrishna
Saturday, July 29, 2017