Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




Movie Details



Songs List:



డైమండు రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి

వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే
సూదిలా నన్ను గుంజేస్తాందే
హంస నడకల్లో ఏం మాయ దాగుందో
హింస పెట్టేసి లాగేస్తాందే

గుండెలో ఏదో గడియారం ముళ్ళుందే
రోజు నీ చుట్టు తిరిగేస్తాందే
నన్ను వదిలేసి నా నీడ
నీ రెడ్డు చున్నీ పట్టుకొని వేలాడిందే

పోకే, నన్నొదిలి వెళ్ళిపోకే
నా మనసునే గిల్లిపోకే
నీ దారిలో పువ్వులే నేను చల్లానులే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నా డైమండు రాణి నువ్వే
నా గర్ల్ ఫ్రెండు అయిపోవే
పిల్ల నీ మాట ఇస్తే
నిలబెట్టుకుంటా నీతోనే ఉంటానే

నీ చేతిలోని ఓ బుక్కునైతే
నా లైఫ్ ధన్యంలే
నీ వేళ్ళు తాకి ఓ రెక్కలొచ్చి
లోకాన్ని చుడతాలే

బైకుకున్న బ్యాకు సీటు నీకై
మైకు పట్టి పిలుస్తున్నదే
వీపునంటి నువ్వు కూర్చుంటే
గాల్లోన ఎగిరిపోతదే

రావేమే నా రాజే
నాతో పడరాదే నువ్ రాజే
నువ్ ఒప్పుకుంటే మన జంటకొస్తది
ఊళ్ళోన యమ క్రేజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నీ నోట రాలే ముత్యాల కోసం
బెగ్గర్ ని అయ్యానే, ఓ తల్లే
నీ నవ్వులోని రత్నాల కోసం
దొంగల్లె చూశానే

అంటరాని మనిషినేం కాదే
అంత దూరం ఎందుకుంటవే
సెంటీమీటర్ ప్లేసు ఇచ్చి చూడే
అంటుకుంటే నిన్ను వదలనే

ఏవంటవే రాజే, ఓ రాజే
నువ్ రాసెయ్యే లవ్ పేజే
నువ్ తలుసుకుంటే
ఏమంత కష్టం ఎగ్జామ్స్ కంటే ఈజే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే





ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: కొత్త కొత్తగా (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: సిద్ శ్రీరాం 

మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానల కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే

నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే

ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ

ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా

No comments

Most Recent

Default