చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020)
సంగీతం: బిజిబల్
సాహిత్యం: విశ్వా
గానం: విజయ్ ఏసుదాస్
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, హరిచందన, నరేశ్, సుహాస్, రూప, కుశాలిని, రవీంద్ర విజయ్
దర్శకత్వం: వెంకటేశ్ మహా
నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయప్రవీణ పరుచూరి
విడుదల తేది: 30.07.2020
నింగి చుట్టే మేఘం ఎరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలామెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
నింగి చుట్టే మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
తమదేదో తమదంటూ
మితిమీర తగదంటూ
తమదైన తృణమైన చాలను వరస
ఉచితాన సలహాలు పగలేని కలహాలు
యెనలేని కదనాలు చోటిది బహుశా
ఆరాటం తెలియని జంజాటం
తమదిగ చీకు చింత తెలియదుగా
సాగింది ఈ తీరు కథ సగటుల చుట్టూ
నింగి చుట్టే మేఘం ఎరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
సిసలైన సరదాలు పడిలేచే పయణాలు
తరిమేసి తిమిరాలు నడిచేలే మనస
విసుగేది ధరిరాని విధిరాత కదిలేని
శతకోటి సహనాల నడవడి తెలుసా
చిత్రంగా కలివిడి సుతారంగా
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా
సాగింది ఈ తీరు సగటుల కనికట్టు
నింగి చుట్టే - చుట్టే
మేఘం యెరుగద - యెరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
No comments
Post a Comment